ఒకప్పుడు ఏసీలు(AC), ఫ్రిడ్జ్‌లు, టీవీలు(TV) విలాసవంత వస్తువులుగా ఉండేవి. కానీ నేడు మాత్రం అవి రోజువారీ అవసరాలుగా మారిపోయాయి. దేశంలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే వివిధ కారణాలతో వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయినా వీటిని కొనుగోలు చేసే వినియోగదారుల (Consumers) సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం వీటన్నింటినీ కన్స్యూమర్ గూడ్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ జాబితాలో టీవీలు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిడ్జ్‌లు, వాటర్ హీటర్లు మొదలైనవి ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీటి ధరలు 5 నుంచి 7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని వివిధ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
2022 సంవత్సరంలోని మొదటి క్వార్టర్‌లోనే(First Quarter) సామాన్యులకు ఈ ధరల షాక్ తగలనుంది. ఇది వరకే కరోనా(Corona)తో అతలాకుతలమవుతున్న సామాన్యులకు కన్స్యూమర్ గూడ్స్ ధరల పెంపు నిజంగా భారమనే చెప్పాలి. త్వరలోనే ధరలను 5 నుంచి 7 శాతం మేర పెంచుతామని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లికేషన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక CEAMA తెలిపిన తర్వాత ధరల పెరుగుదల తప్పనిసరిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధరలను పెంచాలని పలు కంపెనీలు భావించినప్పటికీ పండుగల సీజన్ కావడం వలన ధరల పెరుగుదలను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా ధరలు పెంచుతామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. Discounts on iPhone: ఐఫోన్ మినీపై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.28 వేలకే.. ఆఫర్ వివరాలివే..
ఈ త్రైమాసికంలో ధరల పెరుగుదల తప్పనిసరిగా ఉంటుందని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడిసరుకుల ధరల ప్రభావంతో ప్రొడక్ట్స్ ధరలు పెంచాల్సి వస్తోందని CEAMA ప్రెసిడెంట్ ఎరిక్ బాగ్రాంజా తెలిపారు. ఈ త్రైమాసికంలో 5 నుంచి 7 శాతం మేర ఉత్పత్తుల ధరలను పెంచుతామని ఆయన ప్రకటించారు. కన్స్యూమర్ గూడ్స్ తయారీలో టాప్ సంస్థలైన హిటాచీ, హయర్, గోద్రేజ్, బజాజ్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించాయి. హిటాచీ సంస్థ తమ ఉత్పత్తుల ధరలను 3 నుంచి 4 శాతం మేర పెంచుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, వాషింగ్ మెషీన్ల కేటగిరీలో హయర్ కంపెనీ ఉత్పత్తుల ధరలు 3 నుంచి 5 శాతం మేర పెరుగుతాయని కంపెనీ ఇటీవల ప్రకటించింది. Gold Price Today: పెరిగిన వెండి రేటు.. మరి బంగారం పరిస్థితేంటి? తాజా ధరల వివరాలు
ఎల్జీ (LG), పానాసోనిక్ (Panasonic) వంటి కంపెనీలు ఇప్పటికే ధరల పెంపును అమలు చేశాయి. ఓరియంట్ ఎలక్ట్రిక్ కూడా ధరలను పెంచుతుందని ఆ కంపెనీ ఎలక్ట్రిక్ హోమ్ బిజినెస్ హెడ్ సలీల్ కపూర్ తెలిపారు. గత సంవత్సరం కూడా ఓరియంట్ ఎలక్ట్రిక్ కంపెనీ ధరలను పెంచిందని ఆయన పేర్కొన్నారు. ముడి వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుందన్నారు. మార్కెట్‌ను నిశితంగా పరిశీలించి రాబోయే నెలల్లో ధరల పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు.
గతేడాది కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని అందుకే ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుందని బజాజ్ ఎలక్ట్రిక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ పొద్దార్ తెలిపారు. ఏదేమైనా ధరల పెరుగుదల మాత్రం మిడిల్ క్లాస్ వినియోగదారులకు పెద్ద షాకే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.