• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • TV PRICES COULD RISE BY 20 TO 35 PER CENT FROM OCTOBER 1 KNOW WHY SS GH

TV Price: అక్టోబర్ 1 నుంచి పెరగనున్న టీవీల ధరలు... ఎంతంటే

TV Price: అక్టోబర్ 1 నుంచి పెరగనున్న టీవీల ధరలు... ఎంతంటే

TV Price: అలర్ట్... పండుగ సీజన్‌లో పెరగనున్న టీవీల ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

TV Price | మీరు కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? వచ్చే నెలలో టీవీ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఎందుకో తెలుసుకోండి.

 • Share this:
  పండుగ సీజన్లో టీవీలు కొనాలనుకునేవారికి పెద్ద షాక్. ఈ అక్టోబరు నుంచి టీవీల ధరలు పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. సుమారు 20 నుంచి 35శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. టెలివిజన్ సెట్లో కీలకమైన ప్యానెళ్ల ధరల పెరుగుదల కారణంగా ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా దసరా, దీపావళి నాటికి ఆఫర్లు ప్రకటిస్తారనే ఉద్దేశంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటారు. అలాంటి వారికి ఈ ధరల పెరుగుదల విషయం మింగుడుపడనిదిగా మిగలనుంది. టీవీ ధరలో సుమారు 60 శాతం వరకు దాని తెరను తయారుచేసే ఓపెన్-సెల్ ప్యానెల్ కే అవుతుంది. కొంతమంది ప్యానెల్ తయారీదారులు ధరలను పెంచడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఇండస్ర్టీ వర్గాలు తెలిపాయి. ప్యానెళ్లు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతాయి. ప్యానెళ్ల కొరత ఉందని టీవీ తయారీ సంస్థలకు సమాచారం అందిందని దిల్లీకి చెందిన ఒక డీలర్ చెప్పారు. సరఫరాకు కొన్ని వారాల ముందే ఆకస్మికంగా కంపెనీలకు ఈ విషయం చెప్పారని ఆయన అంటున్నారు.

  Gold Price Today: బంగారం కొనకుండా తప్పు చేశారా? గోల్డ్ రేట్ దూసుకెళ్తోంది

  Special Trains: ప్రయాణికులకు గమనిక... మరో 40 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే... లిస్ట్ ఇదే

  ప్యానెల్ ధరలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఈ ఏడాది పండుగ అమ్మకాల్లో డిస్కౌంట్లు ఉండవని, తద్వారా టీవీల అమ్మకాలు కూడా తగ్గే అవకాశం ఉందని ఒక సంస్థ టెలివిజన్ల విభాగాధిపతి చెప్పారు. కరోనావైరస్ కారణంగా ఇప్పటికే టీవీల అమ్మకాలు తగ్గాయి. చైనాలో విడిభాగాల ఉత్పత్తి అంతరాయం కారణంగా టీవీల ధరలు ఈ ఏడాది 10 శాతం వరకు పెరిగాయి. గత కొన్ని వారాలుగా ప్యానెల్ ధరలు 20 శాతం పెరిగాయి. ప్రతి సంవత్సరం పండుగ సీజన్ కంటే ముందు టీవీలకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో, ప్యానెళ్ల ధరలు కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరం కరోనావైరస్ ప్రభావంతో ఉత్పత్తి కొరత ఏర్పడింది. ఇది కూడా ధరల పెరుగుదలకు తోడ్పడింది. టీవీల్లో ఉపయోగించే ఓపెన్ సెల్ ప్యానెళ్లు ఎక్కువగా చైనా మార్కెట్ల నుంచి దిగుమతి అవుతాయి. చైనాలో ఉత్పత్తి దాదాపుగా మూసివేయడంతో, వాటి ఎగుమతులు ఏప్రిల్ వరకు ఆగిపోయాయి. ఇది భారతదేశంలో టీవీల తుది ఉత్పత్తిని ప్రభావితం చేసింది.

  IPL 2020: హాట్‌స్టార్‌లో ఐపీఎల్ ఫ్రీగా చూడాలా? ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్స్ రీఛార్జ్ చేయండి

  Savings Schemes: ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్‌తో మీకు ఎంత లాభమో తెలుసుకోండి

  థామ్సన్ టీవీ, కోడాక్ టీవీల లైసెన్సు పొందిన సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సంస్థ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా దీనిపై స్పందించారు. ఈ సారి ధరల పెరుగుదల 35 శాతం వరకు ఉండొచ్చని ఆయన చెప్పారు. ధరలకు అదనంగా ఓపెన్ సెల్ ప్యానెళ్లపై విధిస్తున్న ఐదు శాతం కస్టమ్స్ సుంకం కంపెనీలకు మరింత తలనొప్పిగా మారింది. ఎల్సీడీ, ఎల్ఈడీ ప్యానెళ్లపై ఎలాంటి కస్టమ్స్ సుంకాన్ని విధించబోమని 2019 సెప్టెంబర్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 సెప్టెంబర్ 30 వరకు ఇది చెల్లుబాటు అవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తరువాత స్థానికంగా ప్యానెళ్ల తయారీని ప్రోత్సహించవచ్చు. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే (ఎల్సీడీ), లైట్ ఎమిటింగ్ డయోడ్(ఎల్ఈడీ) టీవీ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్స్కు (15.6 అంగుళాలు, అంతకంటే ఎక్కువ ఉండేవి) కస్టమ్స్ సుంకం లేదు. స్థానిక ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం కోరుకుంటుందని, అందువల్ల ఓపెన్ సెల్ కోసం జీరో-కస్టమ్స్-డ్యూటీ విధానాన్ని పొడిగించాలని కోరుకోవట్లేదని తెలుస్తోంది.

  Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

  Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్‌తో రూ.30,000 ఇన్స్యూరెన్స్... వారికి మాత్రమే

  భారతదేశంలో దైవా, షింకో టీవీ బ్రాండ్లను కలిగి ఉన్న వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ అర్జున్ బజాజ్ కూడా ధరల పెరుగుదలను నిర్ధారించారు. ధరలు 20-30 శాతం పెరిగే అవకాశం ఉందని, ఓపెన్-సెల్ ధరలు పెరుగుతూ ఉంటే అది ఇంకా మించిపోవచ్చని ఆయన వివరించారు. టీవీ సెట్ల దిగుమతికి కేంద్రం బ్రేకులు వేసింది. పూర్తిగా అభివృద్ధి చేసిన ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం యూనిట్ను దిగుమతి చేసుకుంటే, దానిపై సుంకం 20 శాతంగా నిర్ణయించింది. టీవీ సెట్లను దిగుమతి చేసుకోవాలనుకునే వారికి లైసెన్స్ అవసరం. అందుకే టెలివిజన్ సెట్ల పూర్తి దిగుమతి కూడా ఈ సమయంలో సరైన ఎంపిక కాదు.
  Published by:Santhosh Kumar S
  First published: