Electric Vehicle | మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? బడ్జెట్ ధరలోనే అదిరిపోయే స్కూటర్ ఒకటి అందుబాటులో ఉంది. తన్వల్ ఎలక్ట్రిక్ కంపెనీ పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను (e-Scooter) మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటిల్లో మిని లిథియో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒకటి ఉంది. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర కేవలం రూ. 55 వేలు మాత్రమే. తక్కువ ధరలో మంచి స్కూటర్ (Scooter) కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఇస్కూటర్‌ను పరిశీలించొచ్చు.
మిని లిథినో ఎలక్ట్రిక్ స్కూటర్2లో 48వీ 26 ఏహెచ్ కెపాసిటీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగే కంపెనీ ఇందులో బీఎల్‌డీసీ మోటార్‌ను అమర్చింది. ఈ బ్యాటరీ ఫుల్ కావడానికి 4 నుంచి 5 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఒక్కసారి చార్జింగ్ ఫుల్ చేస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 55 నుంచి 70 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ తెలియజేసింది.
ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ముందు, వెనుక డ్రమ్స్ బ్రేక్స్‌ను అమర్చారు. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ట్యూబ్ లెస్ టైర్లు. హైడ్రాలిక్ సస్పెన్షన్ ముందు భాగంలో ఉంటుంది. వెనుక భాగంలో స్ప్రింగ్ బేస్డ్ షాక్ అబ్జార్బర్ సిస్టమ్ ఉంటుంది. అలాగే ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిట్ల ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడో మీటర్, పుష్ బటన్ స్టార్ట్, ఈబీఎస్, ఎల్ఈడీ లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ ఐదు రకాల రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
బస్ టికెట్ ధరకే విమాన టికెట్.. కంపెనీ రూ.1,199 ఆఫర్ అదిరింది!
ఇకపోతే మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఓలా కంపెనీ దుమ్మురేపుతోంది. డిసెంబర్ నెలలో ఈ కంపెనీ అమ్మకాలు ఏకంగా 25 వేల యూనిట్లుగా నమోదు అయ్యాయి. అలాగే ఏథర్, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్ కంపెనీకు చెందిన ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా దుమ్మురేపుతున్నాయి. అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయితే కంపెనీలు ఫైనాన్స్ స్కీమ్స్ అందించడం వల్ల అమ్మకాలు పెరిగాయని అర్థం చేసుకోవచ్చు. ఈజీ ఈఎంఐ, జీరో వడ్డీ, జీరో డౌన్ పేమెంట్, డిస్కౌంట్ వంటి వాటి వల్ల కొనుగోలు దారులు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చూస్తున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం చాలా రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌లో నచ్చిన స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Scooter, Electric Vehicles, Ev scooters, SCOOTER