హోమ్ /వార్తలు /బిజినెస్ /

Viral Photo: మీకు హైదరాబాద్ బాగా తెలుసా? అయితే.. ఈ ఫొటోలోని ప్లేస్ చెప్పుకోండి.. నెటిజన్లకు సజ్జనార్ ప్రశ్న..

Viral Photo: మీకు హైదరాబాద్ బాగా తెలుసా? అయితే.. ఈ ఫొటోలోని ప్లేస్ చెప్పుకోండి.. నెటిజన్లకు సజ్జనార్ ప్రశ్న..

నెటిజన్లకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) ఓ ప్రశ్న విసిరారు. ఈ మేరకు ఆయన ఓ ఫొటో షేర్ చేసి హైదరాబాద్ లో ఆ ఏరియా ఎక్కడుందో చెప్పాలంటూ కోరారు. దీంతో ఆ ఫొటో వైరల్ గా (Viral Photo) మారింది.

  తెలంగాణ(Telangana)లో వార్తలు అంతో ఇంతో ఫాలో అయ్యే వారందరికీ ఐపీఎస్ అధికారి సజ్జనార్ (TSRTC MD Sajjanar) సుపరిచతమైన వ్యక్తి. వరంగల్ (Warangal) లో కాలేజీ యువతులపై యాసిడ్ దాచి నిందితుల ఎన్ కౌంటర్ సమయంలో ఆయన అక్కడ ఎస్పీగా పని చేయడంతో ఆ సమయంలో సజ్జనార్ పేరు మీడియాలో మార్మోగింది. అనంతరం దిశ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ తో ఆయన పేరు మరో సారి హాట్ టాపిక్ అయ్యింది. మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఆయనపై అభినందనలు వెల్లువెత్తాయి. అయితే.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సజ్జనార్ ను తెలంగాణ ఆర్టీసీకి ఎండీగా నియమించింది. దీంతో ఆయన ఖాకీ యునిఫామ్ కు తాత్కాలికంగా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అనేక మంది క్రిమినల్స్ ను ఆటకట్టించి డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా పంపించడంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి.

  అయితే సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అక్కడ కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుతున్నారు. కొత్త కొత్త స్కీంలను తీసుకువచ్చి సంస్థను లాభాల బాట పట్టించేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు సజ్జనార్. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆర్టీసీ సంస్థను ప్రమోట్ చేసేలా ఫన్నీ ఫొటోలు, వీడియోలను ఆయన షేర్ చూస్తూ ఉంటారు. కొన్ని సార్లు నెటిజన్లకు తనదైన శైలిలో ప్రశ్నలు కూడా తన ట్విట్టర్ వేధికగా అడుగుతుంటారు.

  TSRTC బంపరాఫర్.. ఆ ఛార్జీలపై 25% తగ్గింపు.. ఆఫర్ వివరాలివే

  తాజాగా సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా నుంచి ఓ ఫొటో ను షేర్ చేశారు. హైదరాబాద్ లోని ఓ ప్రాంతాన్ని డ్రోన్ సహాయంతో తీసిన ఫొటో అది. ఆ ఫొటో ఎక్కడిదో చెప్పండంటూ ఆయన నెటిజన్లకు ప్రశ్న విసిరారు. అయితే.. ఈ ఫొటో కూడా ఆర్టీసీకి సంబంధించిన ప్రశ్నే కావడం విశేషం. అయితే.. చుట్టూ ఆగి ఉన్న బస్సుల ఆధారంగా దాన్ని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ గా గుర్తించి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

  First published:

  Tags: Kcr, Sajjanar, Tsrtc, Viral photo

  ఉత్తమ కథలు