హోమ్ /వార్తలు /బిజినెస్ /

TSRTC Dussehra Special Buses: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ ఎండీ సజ్జనర్ శుభవార్త.. స్పెషల్ బస్సులు, ఛార్జీలపై కీలక ప్రకటన.. వివరాలివే

TSRTC Dussehra Special Buses: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ ఎండీ సజ్జనర్ శుభవార్త.. స్పెషల్ బస్సులు, ఛార్జీలపై కీలక ప్రకటన.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దసరా సందర్భంగా స్పెషల్ బస్సులు, అదనపు ఛార్జీలపై తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో అతిపెద్ద పండుగలు అయిన బతుకమ్మ, దసరా సంబరాలు (Dussehra 2022) రానే వచ్చాయి. పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి ప్రజలు పట్టణాల నుంచి భారీగా తరలివెళ్లనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానరగం నుంచి ప్రజలు భారీగా గ్రామాలకు తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కీలక ప్రకటన చేసింది. పండుగా సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి భారీ శుభవార్త చెప్పింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు భారీగా స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ ఆధారంగా మొత్తం 3500కు పైగా స్పెషల్ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్​ తో పాటు దిల్ షుక్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, అమీర్ పేట్, ఈసీఐఎల్ నుంచి ఈ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపింది ఆర్టీసీ. ఈ మేరకు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.

  గతంలో పండుగల సీజన్లో నడిపే స్పెషల్ బస్సుల్లో 50 శాతం మేరకు ఛార్జీలు పెంచే వారు అధికారులు. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. అయితే.. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ పరిస్థితి మారింది. పండుగల సమయంలో నడిపే స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నారు. సంస్థను ప్రయాణికులకు మరింతగా చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసకున్నారు సజ్జనార్. ఈ దసరా సీజన్లోనూ స్పెషల్ బస్సులకు సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

  TSRTC: గ్రేటర్ వాసులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త.. ఆ రూట్లో కొత్త సర్వీసులు.. ప్రతీ 40 నిమిషాలకు ఓ బస్సు

  పండుగ సందర్భంగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది ఆర్టీసీ. 30 కంటే ఎక్కువ మంది ఒకే ప్రాంతానికి వెళ్లే వారు ఉంటే ప్రయాణికులు ఉన్న చోటుకే బస్సు పంపించనున్నట్లు వెల్లడించింది. కాలనీల్లో నివాసం ఉండే ఒకే ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. ప్రయాణికులు ఇతర పూర్తి వివరాలకు www.tsrtconline.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. లేదా 040-23450033, 040-69440000 నంబర్లను సంప్రదించాలన్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dussehra 2022, Sajjanar, Tsrtc

  ఉత్తమ కథలు