హోమ్ /వార్తలు /బిజినెస్ /

TSRTC: గ్రేటర్ వాసులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త.. ఆ రూట్లో కొత్త సర్వీసులు.. ప్రతీ 40 నిమిషాలకు ఓ బస్సు

TSRTC: గ్రేటర్ వాసులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త.. ఆ రూట్లో కొత్త సర్వీసులు.. ప్రతీ 40 నిమిషాలకు ఓ బస్సు

ఫొటో: ట్విట్టర్

ఫొటో: ట్విట్టర్

ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ (Sajjanar) బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంస్థను సరికొత్త పంథాలో నడుపుతున్నారు. ఇప్పటికే ఆయన సారథ్యంలో అనేక కొత్త రూట్లలో బస్సు సర్వీసులను ప్రారంభించిన ఆర్టీసీ తాజాగా మరో రూట్లో సేవలను ప్రారంభించింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  లాభాల బాటలో పయనిస్తున్న తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కొత్త జోష్ తో పరుగులు పెడుతోంది. కొత్త కొత్త రూట్లలో సర్వీసులు ప్రారంభిస్తూ ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ (Sajjanar) బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంస్థను సరికొత్త పంథాలో నడుపుతున్నారు. ఇప్పటికే ఆయన సారథ్యంలో అనేక కొత్త రూట్లలో బస్సు సర్వీసులను ప్రారంభించిన ఆర్టీసీ తాజాగా మరో రూట్లో సేవలను ప్రారంభించింది. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన దిల్ సుఖ్ నగర్ (Dilsukhnagar) నుంచి ఉద్యోగులు అధికంగా ఉండే కోకాపేట సెజ్ (Kokapet SEZ) వరకు 156K నంబర్ రూటులో కొత్త సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.40 గంటల వరకు ప్రతీ 40 నిమిషాలకు ఒక బస్సును నడపనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ.

  ఈ సేవలు ఇప్పటికే ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభయమ్యాయి. ఇంకా కోకాపేట నుంచి దిల్ సుఖ్ నగర్ కు ఉదయం 7.25 నుంచి రాత్రి 10.07 గంటల వరకు ప్రతీ నలభై నిమిషాలుకు ఒక బస్సు నడపనున్నారు. ఈ బస్సు కోఠి, మాసాబ్ ట్యాంక్, మెహదీపట్నం, లంగర్ హౌజ్, టిప్పుఖాస్ బ్రిడ్జి, బండ్లగూడ, తారామతిపేట, నార్సింగ్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. నార్సింగి, గండిపేట, కోకాపేట పరిసర ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు ఈ రవాణా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆర్టీసీ కోరింది.

  TSRTC Special Services: ఆఫీస్ నుంచే సొంత ఊర్లకు నేరుగా వెళ్లొచ్చు.. ఆ ఉద్యోగుల కోసం TSRTC స్పెషల్ సర్వీసులు.. వివరాలివే

  ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లో 24 గంటల పాటు జర్నీకి వినియోగించే T24 టికెట్ కు సంబంధించిన ఛార్జీలను తగ్గించింది. ఇప్పటివరకు ఈ టికెట్ ధర రూ.120 ఉండగా.. దానికి రూ.100కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంటే 20 రూపాయలను తగ్గించింది. ఈ తగ్గింపు ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది ఆర్టీసీ. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

  ఈ T24 టికెట్ ను కొనుగోలు చేసిన వారు 24 గంటల పాటు హైదరాబాద్ (Hyderabad) జంట నగరాలలో అన్ని సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. చార్మినార్, జూ పార్క్, ట్యాంక్ బండ్, బిర్లా టెంపుల్ లాంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శించవచ్చు. వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన వారికి ఈ టికెట్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో ఈ T24 టికెట్ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109గా ఉంది. అంటే.. ఈ టికెట్ తో లీటర్ పెట్రోల్ కన్నా తక్కువ ధరతో 24 గంటల పాటు జర్నీ చేయొచ్చన్నమాట.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Sajjanar, Tsrtc

  ఉత్తమ కథలు