తెలంగాణ ఆర్టీసీ (TSRTC) మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా సజ్జనార్ (Sajjanar) మరో కీలక కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఆర్టీసీలో గరుడ, రాజధాని బస్సులకు వేర్వేరుగా ఛార్జీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అత్యంత లగ్జరీగా ఉంటూ ఏసీ సదుపాయం ఉండే గరుడ బస్సుల్లో ఛార్జీలు అధికంగా ఉంటాయి. రాజధాని బస్సుల్లో గరుడాతో పోల్చితే ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అయితే.. ఈ రెండు బస్సు ఛార్జీలను సమానం చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. రాష్ట్రంలో నడిచే అన్ని బస్సు సర్వీసుల్లో ఈ నెల 30వ తేదీ వరకు ఇది అందుబాటులో ఉండనుంది. ఇంకా హైదరాబాద్-విజయవాడ (Hyderabad - Vijayawada) రూట్లో నడిచే గరుడ బస్సుల ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలతో సమానం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఈ విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు సజ్జనార్. అన్ని బస్ స్టేషన్లలో ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదిలా ఉంటే.. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మీరు వ్యాపారాన్ని నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టాండ్ లో (MGBS) మీరు వ్యాపారం చేయొచ్చు. బస్టాండ్ లోని స్టాల్స్ లో బేకరీ, స్వీట్ షాప్, సూపర్ మార్కెట్, ఫుట్ వేర్, బ్యాగ్స్, టీ, స్నాక్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయ కేంద్రం నిర్వహించుకోవచ్చు.
Now #TSRTC Garuda Bus Fare = #TSRTC Rajdhani Bus Fare, limited period offer Hurry up & book your tickets through https://t.co/J3Yih8BOIt@puvvada_ajay @Govardhan_MLA @tsrtcmdoffice @MaheshBabuNews @MaheshBabuFacts @GoWirally @urstrulyMahesh @baraju_SuperHit @T2BLive @TV9Telugu pic.twitter.com/3PCjlk7T5B
— TSRTC (@TSRTCHQ) September 1, 2022
నగరం నడబొడ్డున, రాష్ట్రంలోని ప్రజలందరూ మీకు వినియోగదారులే అయితే ! వ్యాపారం చేసేందుకు ఇంతకంటే అనువైన స్థలం ఉంటుందా? ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొండి..#TSRTCStallTenders pic.twitter.com/yrXPSvvhKW
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) August 29, 2022
ఇంకా.. చిన్నపిల్లల బొమమ్ల షాప్ లు, కేఎఫ్సీ, చాట్ బండార్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ, కూల్ డ్రింక్స్, ఫ్యాన్సీ&జనరల్ స్టోర్స్, ఫోర్ వీలర్ పార్కింగ్, గోడౌన్ నిర్వహణకు స్టాల్స్ ను వేలం వేస్తోంది ఆర్టీసీ. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా టెండర్ వేసు కోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.