TSRTC ANNOUNCED TRAVEL AS YOU LIKE OFFER IN TRI CITIES OF WARANGAL HANAMKONDA AND KAZIPET ONLY AT RS 60 NS
TSRTC Offer: వరంగల్, హన్మకొండ, కాజీపేట వాసులకు తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్.. కేవలం రూ.60కే..
ప్రతీకాత్మక చిత్రం
వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ వాసులకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) శుభవార్త చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కొత్త కొత్త ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల సంస్థ తీసుకువస్తున్న అనేక ఆఫర్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad) జంట నగరాల్లో తీసుకువచ్చిన ట్రావెల్ యాజ్ యూ లైక్ (TAYL) ఆఫర్ సత్ఫలితాలను ఇస్తోంది. ఈ ఆఫర్ కింద రూ.100తో TAYL టికెట్ కొనుగోలు చేసిన వారు 24 గంటల పాటు ఏసీ మినహా ఏదైనా సిటీ బస్సులో ఎక్కి నగరంతో పాటు నగర శివార్లలోని వివిధ ప్రాంతాలను సందర్శింవచ్చు. ఈ టికెట్ కు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ప్రతీ సిటీ బస్ లో ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్లను అంటించింది ఆర్టీసీ. ఇంకా కండక్టర్లతో పాటు ప్రత్యేక సిబ్బంది సైతం ఆర్టీసీ బస్ స్టాప్ లలో ఈ టికెట్ పై ప్రచారం చేస్తూ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు.
పెట్రోల్ ధర రూ.100 దాటిన ఈ తరుణంలో లీటర్ పెట్రోల్ కన్నా తక్కువ ధరకే అంటే కేవలం రూ.100తోనే సిటీ అంతటా 24 గంటల పాటు ప్రయాణించవచ్చని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ మహానగరం తర్వాత అభివృద్ధి చెందుతున్న రెండో నగరం వరంగల్. ఈ వరంగల్ లోనూ ఈ TAYL ఆఫర్ ను తీసుకువచ్చింది తెలంగాణ ఆర్టీసీ. వరంగల్ తో పాటు కాజీపేట, హన్మకొండ నగరాల్లోని సిటీ బస్సుల్లో కేవలం రూ.60తో TAYL టికెట్ తీసుకుని 24 గంటల పాటు ప్రయాణించవచ్చని ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. TS RTC GIFT: మదర్స్ డే నాడు అమ్మలందరికి బస్సుల్లో ప్రయాణం ఉచితం..వాళ్లకు మాత్రం కాదు సుమా
ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది తెలంగాణ ఆర్టీసీ. ఏదైనా పని మీద వరంగల్ వెళ్లిన వారు సైతం ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దాదాపు అర లీటర్ పెట్రోల్ ధరతోనే 24 గంటల పాటు ప్రయాణించే అవకాశాన్ని కల్పించడం అద్భుతమైన ఆఫర్ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.