హోమ్ /వార్తలు /బిజినెస్ /

TSRTC Special Services: ఆఫీస్ నుంచే సొంత ఊర్లకు నేరుగా వెళ్లొచ్చు.. ఆ ఉద్యోగుల కోసం TSRTC స్పెషల్ సర్వీసులు.. వివరాలివే

TSRTC Special Services: ఆఫీస్ నుంచే సొంత ఊర్లకు నేరుగా వెళ్లొచ్చు.. ఆ ఉద్యోగుల కోసం TSRTC స్పెషల్ సర్వీసులు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రయాణికులకు మరింత చేరువ అయ్యి సంస్థను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రయాణికుల కోసం కొత్త కొత్త సర్వీసులను ప్రవేశ పెడుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Khammam | Karimnagar

  ప్రయాణికులకు మరింత చేరువ అయ్యి సంస్థను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ (TSRTC) తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రయాణికుల కోసం కొత్త కొత్త సేవలను ప్రవేశ పెడుతోంది. అనేక కొత్త సర్వీసులను ప్రవేశపెడుతోంది. పాత కాలం పద్ధతులకు స్వస్తి చెప్పి నూతన ఒరవడిని అవలంభిస్తోంది యాజమాన్యం. ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. ఐటీ ఉద్యోగులే (IT Employees) లక్ష్యంగా కొత్త సర్వీసులను ప్రారంభించింది. సాధారణంగా ఐటీ ఉద్యోగులు వీకెండ్స్ లో సొంత ఊర్లకు వెళుతూ ఉంటారు. వారి కోసం ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది తెలంగా ఆర్టీసీ. హైదరాబాద్ లోని వేవ్ రాక్ (Waverock) ప్రాంతంంలో ఐటీ కంపెనీలు అధికంగా ఉంటాయి. అక్కడి నుంచి కరీంనగర్, హన్మకొండ, ఖమ్మం పట్టణాలకు స్పెషల్ బస్సులను (TSRTC Special Buses) ప్రకటించింది ఆర్టీసీ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వీకెండ్ లో అంటే ప్రతీ శుక్రవారం సాయంత్రం వేవ్ రాక్ నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. మళ్లీ సోమవారం తెల్లవారు జామున ఆయా పట్టణాల నుంచి ఈ బస్సులు బయలుదేరి.. ఆఫీస్ టైం కల్లా వేవ్ రాక్ కు చేరుతాయని ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీసుకులకు సంబంధించిన పూర్తి టైమింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.TSRTC Service No.9701: ప్రతీ శుక్రవారం ఈ సర్వీసును వేవ్ రాక్ బస్టాప్ నుంచి కరీంనగర్ కు నడపనున్నారు. ఈ బస్సు ప్రతీ శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరుతుంది.
  TSRTC Service No.9700: కరీంనగర్ నుంచి వేవ్ రాక్ బస్టాప్ కు ఈ బస్సు సర్వీసును ప్రతీ సోమవారం నడపనున్నారు. ఈ బస్సు ఆయా రోజుల్లో కరీంనగర్ లో ఉదయం 5 గంటలకు ప్రారంభం అవుతుంది.  TSRTC Service No.8256: ఈ బస్సు సర్వీసును ప్రతీ శుక్రవారం వేవ్ రాక్ బస్టాప్ నుంచి హన్మకొండకు నడపనున్నారు. ఈ బస్సు ఆయా రోజుల్లో వేవ్ రాక్ బస్టాప్ నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది.
  TSRTC Service 8255: హన్మకొండ నుంచి వేవ్ రాక్ కు ఈ బస్సు సర్వీసును నడపనున్నారు. ఈ బస్సు ప్రతీ సోమవారం హన్మకొండలో ఉదయం 5 గంటలకు ప్రారంభం అవుతుంది.
  TSRTC Service No.8658: వేవ్ రాక్ బస్టాప్ నుంచి ఖమ్మంకు ఈ బస్ సర్వీసును ప్రతీ శుక్రవారం నడపనున్నారు. ఈ బస్సు ప్రతీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు వేవ్ రాక్ బస్టాప్ వద్ద ప్రారంభం అవుతుంది.
  TSRTC Service No.8600: ఈ బస్సు సర్వీసును ఖమ్మం నుంచి వేవ్ రాక్ బస్టాప్ వరకు నడపనున్నారు. ఈ బస్సు ఆయా రోజుల్లో తెల్లవారు జామున ఉదయం 4 గంటలకు ఖమ్మంలో ప్రారంభం అవుతుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Sajjanar, Tsrtc

  ఉత్తమ కథలు