ముచ్చింతల్లోని ప్రముఖ చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఈ నెల 2 నుంచి 14 వరకు జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు వెళ్లే భక్తులకు TSRTC శుభవార్త చెప్పింది. పలు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.
ముచ్చింతల్లోని ప్రముఖ చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) ఆశ్రమంలో ఈ నెల 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించేందకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు ప్రధాని మోదీ (PM Modi) సైతం హాజరు కానున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5న ప్రధాని ముచ్చింతలకు రానున్నట్లు ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నుంచి చినజియర్ స్వామి ఆశ్రమానికి సమాచారం అందింది. మోదీ శ్రీరామానుజాచార్యుల వారి విగ్రహ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ వేడుకలకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5వేల మంది రుత్వికులు, వేదపండితులు హాజరుకానున్నట్లు సమాచారం. అయితే, ఈ వేడులకను తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు.
జేబీఎస్ నుంచి..
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఉదయం 6, 7, 8 గంటలకు బస్సులు బయలుదేరాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6, 7, 8 గంటలకు బస్సులు బయలుదేరనున్నాయి. TSRTC New Website: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్.. నూతన వెబ్ సైట్ ప్రారంభం.. వివరాలివే
నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి..
నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సైతం బస్సులు ఉదయం 6, 7, 8 గంటలకు ముచ్చింతల్ కు బయలుదేరనున్నాయి.
-ప్రయాణికులు ఈ బస్సులను ఆయా బస్ స్టాప్ ల వద్ద ఎక్కితే నేరుగా ముచ్చింతల్ కు వెళ్లొచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.