ప్రయాణికులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ (TSRTC) మరో రెండు కొత్త ఆఫర్లను తీసుకువచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) ప్రాంతంలో నివాసం ఉండే వారికి ఈ రెండు ఆఫర్లు మరింత ప్రయోజనకరంగా మారనున్నాయి. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టి-6’ను, వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం 'ఎఫ్-24' టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టీ-24 మాదిరిగానే ఈ టికెట్లను ఆదరించాలని TSRTC యాజమాన్యం ప్రయాణికులను కోరింది. ఈ రెండు కొత్త ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
F24 Ticket: దీని ధర రూ.300 మాత్రమే. ఈ టికెట్ పై మొత్తం నలుగురు ప్రయాణించవచ్చు. 24 గంటల పాటు హైదరాబాద్ లోని అన్ని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. శని, ఆది, పబ్లిక్ హాలిడేస్ లో ప్రయాణానికి అవకాశం ఉంటుంది. సెలవులు దినాల్లో హైదరాబాద్ ను సందర్శించాలనుకుంటున్న కుటుంబాలకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్లను #TSRTC ప్రకటించింది. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6ను, వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం 'ఎఫ్-24' టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-24 మాదిరిగానే ఈ టికెట్లను ఆదరించాలని #TSRTC యాజమాన్యం కోరుతోంది. pic.twitter.com/0qSvQ6mceF
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 9, 2023
T6 Ticket: ఈ టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. ఈ టికెట్ 6 గంటల పాటు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్న వారు అన్ని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో జర్నీ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.