చైనా వస్తువులపై 25 శాతం పన్ను.. సంచలన నిర్ణయం తీసుకున్న..

గత 10 నెలల నుంచి 50 బిలియన్‌ డాలర్ల విలువైన సాంకేతిక వస్తువులపై 25 శాతం, 200 బిలియన్‌ డాలర్ల విలువైన ఇతర ఉత్పత్తులపై 10 శాతం పన్నును అమెరికాకు చైనా చెల్లిస్తోంది.

news18-telugu
Updated: May 7, 2019, 7:41 AM IST
చైనా వస్తువులపై 25 శాతం పన్ను.. సంచలన నిర్ణయం తీసుకున్న..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మరోసారి అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 25 శాతం పన్ను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10 నుంచి కొత్త పన్నులు అమల్లోకి రానున్నట్లు ట్రంప్ తెలిపారు. గత 10 నెలల నుంచి 50 బిలియన్‌ డాలర్ల విలువైన సాంకేతిక వస్తువులపై 25 శాతం, 200 బిలియన్‌ డాలర్ల విలువైన ఇతర ఉత్పత్తులపై 10 శాతం పన్నును అమెరికాకు చైనా చెల్లిస్తోంది. ట్రంప్‌ తాజా నిర్ణయంతో ఇతర ఉత్పత్తులపై చైనా చెల్లిస్తున్న 10 శాతం పన్ను.. ఇక నుంచి 25 శాతానికి చేరనుంది.

వాస్తవానికి రెండు దేశాల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక చర్చల ప్రక్రియ బుధవారం వాషింగ్టన్‌లో ప్రారంభం కావాల్సిఉంది. చైనాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్న ఈ సమావేశానికి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ చర్చల ప్రక్రియకు చైనా హాజరుకావడంపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా, చైనా, అమెరికాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధానికి పరిష్కార మార్గం కనుగొనేందుకు గత ఏడాది నవంబర్‌లో జరిగిన జీ-20 సమావేశంలో ఇరు దేశాధినేతలు నిర్ణయానికి వచ్చారు. 100 రోజులు ఇరు దేశాల పన్నులు పెంచకూడదని నిర్ణయించాయి. ఈ గడువు మార్చి నెలతో ముగియగా.. అమెరికా మరోమారు ఈ వ్యవధిని పెంచింది.
First published: May 7, 2019, 7:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading