US Visa : అమెరికా ప్రయాణం ఇక మరింత కఠినం...విజిటింగ్ వీసా నిబంధనల్లో పెనుమార్పులు...

భారతీయులే టార్గెట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వీసా చట్టాన్ని కఠినతరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు, బిజినెస్ పీపుల్, ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బందులకు గురవ్వనున్నారు.

news18-telugu
Updated: April 26, 2019, 5:13 PM IST
US Visa : అమెరికా ప్రయాణం ఇక మరింత కఠినం...విజిటింగ్ వీసా నిబంధనల్లో పెనుమార్పులు...
డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
news18-telugu
Updated: April 26, 2019, 5:13 PM IST
అమెరికాలో స్థిరపడిన మీ పిల్లలను చూసేందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారా... అయితే మున్ముందు ఆ ప్రయత్నాలు మరింత కఠినం అయ్యే అవకాశం ఉంది. నాన్ ఇమ్మిగ్రెంట్ల రాకను అంటే విజిటింగ్ వీసాలను అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ విభాగం అడ్మిషన్ బాండ్స్ ను ప్రవేశపెట్టనుంది. దీంతో అమెరికాను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు, బిజినెస్ పీపుల్, ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బందులకు గురవ్వనున్నారు. కాగా భారతీయులే టార్గెట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వీసా చట్టాన్ని కఠినతరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి వైట్ హౌస్ నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రధానంగా అమెరికాకు వచ్చే బిజినెస్, టూరిస్ట్ ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను తగ్గించే దిశగా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రెసిడెన్షియల్ ఆదేశాల్లో ప్రధానంగా నాన్ ఇమ్మిగ్రెంట్ విభాగంలో అన్ని రకాల వీసా నిబంధనలు కఠినతరం చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని, అలాగే భవిష్యత్తులో అడ్మిషన్ బాండ్స్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కాలిఫోర్నియాకు చెందిన ఇమ్మిగ్రేషన్ లా నిపుణుడు మిచెల్ వెక్స్‌లర్ అభిప్రాయ పడ్డారు.

ఇదిలా ఉంటే గత నవంబర్ నాటికే అమెరికాలో మొత్తం 1.96 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. వీరి సంఖ్య అమెరికాలో విద్యనభ్యసిస్తున్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో 18 శాతం కావడం విశేషం. కాగా 2013లో యూకే సైతం విజిటింగ్ వీసాలను కట్టడి చేసేందుకు ఇలాంటి సెక్యూరిటీ బాండ్ల విధానాన్నే ప్రవేశపెట్టింది. మొత్తం ఆరు దేశాలకు చెందిన పౌరులు యూకేను సందర్శించాలంటే 3వేల పౌండ్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నిబంధన పెట్టింది. అయితే ఎంపిక చేసిన 6 దేశాల్లో భారత్ కూడా ఉండటం కొసమెరుపు.

First published: April 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...