అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో ఒక తుంటరి పని చెయ్యకుండా ఉండరు. ఈసారి ఆయన తీసుకున్న నిర్ణయం అమెరికాతోపాటూ... భారతీయులకు అతిపెద్ద నష్టాన్ని తెచ్చి పెడుతోంది. విదేశీ వర్కర్లు అమెరికాకు రాకుండా సస్పెండ్ చేస్తూ... ట్రంప్... మంగళవారం... ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల H-1B వీసాలు, L వీసాలు, H-2B సీజనల్ వర్కర్ వీసాలు, J వీసాలతో అమెరికాలోకి వచ్చే వారికి... తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. ఈ కొత్త ప్రత్యేక ఆదేశాలు... జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయి. డిసెంబర్ 31 వరకూ ఇవి అమల్లో ఉంటాయి. ఇది భారతీయులకు అత్యంత విచారకరమైన నిర్ణయం. అమెరికాలో ఉద్యోగాలకు అప్లై చేసుకునే లక్షల మంది భారతీయులకు తీరని అన్యాయం చేస్తున్నారు ట్రంప్. ముఖ్యంగా టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాల్ని ఏటా భారతీయులే ఎక్కువగా సంపాదించుకుంటారు. కానీ ట్రంప్ నిర్ణయం వల్ల డిసెంబర్ వరకూ... ఆ ఉద్యోగాల్ని భారతీయులు పొందనివ్వకుండా చేసినట్లైంది.
తాను అమెరికాకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నాననీ... స్థానికులకు ఉపాధి అవకాశాల్ని మిస్సవకుండా చేస్తున్నానని ట్రంప్ గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజానికి ఇదో పెద్ద అబద్ధం. అసలు నిజమేంటంటే... ట్రంప్... టాలెంట్ ఉన్న విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలు రానివ్వకుండా తొక్కేస్తున్నారని అమెరికా కంపెనీలే మండిపడుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వల్ల... అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పతనం అవుతుందే తప్ప బాగుపడదని వాళ్లే చెబుతున్నారు.
ఏటా లక్షల మంది భారత్, చైనా, హాంకాంగ్ సహా ఆసియా దేశాల నుంచి అమెరికాకు వేర్వేరు వీసాలతో వెళ్లి టాలెంట్ చూపించి... ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎక్కడలేని సంపాదన తెచ్చిపెడుతున్నారు. అసలు అమెరికాకు వెళ్లి జాబ్ చెయ్యాలనేది చాలా మంది ఇండియన్స్ డాలర్ డ్రీమ్. విద్యార్థులైతే... అమెరికాకు వెళ్లేందుకు ఏం చదవాలో అవే చదివేవారు కోట్లలో ఉన్నారు. అలాంటి వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు ట్రంప్.
తాజా ఆదేశం వల్ల అనధికారికంగా 5.25 లక్షల టాలెంటెడ్ ఇమ్మిగ్రాంట్స్, వారి కుటుంబ సభ్యులు... ఈ ఏడాది చివరివరకూ అమెరికాలో అడుగుపెట్టే ఛాన్స్ లేకుండా పోయింది. మొత్తంగా 1.5 కోట్ల ఉద్యోగాల్ని విదేశీయులతో భర్తీ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. ఈ ఉద్యోగాల్ని స్థానికులకు ఇచ్చేందుకు అమెరికా కంపెనీలు సిద్ధంగా లేవు. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. జనరల్‌గా స్థానిక అమెరికన్లు చదువుపై అంతగా శ్రద్ధ పెట్టరు. అందువల్ల వారిలో టాలెంట్ చాలా తక్కువగా ఉంటుంది. దానికి తోడు... విదేశాలకు ఇచ్చే జీతాలతో పోల్చితే... స్థానికులు... రెండు మూడు రెట్లు ఎక్కువ జీతాలు ఆశిస్తారు. ఈ పరిస్థితులు కంపెనీల యాజమాన్యాలకు తలనొప్పి తెప్పిస్తున్నాయి. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేకంటే... తమ కంపెనీలు మూసుకోవడం బెటరనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. ట్రంప్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా... అమెరికన్స్ ఫస్ట్ అంటూ... అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో అమెరికాలోని భారతీయులు... ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు లేవు. నాలుగేళ్ల కిందట కూడా ట్రంప్ ఇలాగే అమెరికన్స్ ఫస్ట్ అంటూ... జాతీయతా భావాన్ని రెచ్చగొట్టి... భారతీయులు సహా... విదేశీయులను ఇబ్బంది పెట్టి... ఒబామా నుంచి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. కానీ... ఇప్పుడు అమెరికన్లు సైతం... ట్రంప్‌ని సమర్థించట్లేదు. ఆయన కంటే ఒబామానే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారు. అందువల్ల ఈసారి భారతీయులతోపాటూ... అమెరికాలోని విదేశీయులు ట్రంప్‌కి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.