ట్రంప్ కంపెనీలకు కరోనా దెబ్బ... అప్పు కట్టలేమంటూ...

ప్రస్తుత పరిస్థితుల్లో అంతా సమన్వయంతో ముందుకు సాగితేనే మంచిదని ట్రంప్ వ్యాపారాలను చూస్తున్న ఆయన కుమారుడు ఎరిక్ తెలిపాడు.

news18-telugu
Updated: April 3, 2020, 2:06 PM IST
ట్రంప్ కంపెనీలకు కరోనా దెబ్బ... అప్పు కట్టలేమంటూ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా కారణంగా చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను అంతగా కొనసాగించలేకపోతున్నాయి. దీంతో చాలా కంపెనీలు నష్టాలు చవిచూస్తున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపును సైతం చెల్లించలేని పరిస్థితిల్లోకి వచ్చేశాయి. సాక్ష్యాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ది ట్రంప్ ఆర్గనైజేషన్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక మందగమనం కారణంగా తాము చెల్లించే రుణాలను వాయిదా వేయాలని ఈ కంపెనీ డ్యూయిష్ బ్యాంక్‌ను కోరినట్టు ది న్యూ యార్క్ టైమ్స్ వెల్లడించింది. మార్చిలో చెల్లించాల్సిన రుణాన్ని వాయిదా వేయాలని ఈ కంపెనీ బ్యాంక్‌కు విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో అంతా సమన్వయంతో ముందుకు సాగితేనే మంచిదని ట్రంప్ వ్యాపారాలను చూస్తున్న ఆయన కుమారుడు ఎరిక్ తెలిపాడు. అయితే ఈ చర్చల ద్వారా రుణాల వాయిదాపై డ్యూయిష్ బ్యాంక్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ట్రంప్ ఫ్యామిలీకి చెందిన ది ట్రంప్ ఆర్గనైజేషన్ సంస్థ డ్యూయిష్ బ్యాంక్‌కు వంద మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది.


First published: April 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading