Triumph Bikes : లగ్జరీ బైక్స్ (Luxury Bikes)తయారు చేసే బ్రిటన్ ఆటోమొబైల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్(Triumph Bikes).. ఇండియాలో ఎనిమిది కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. బోన్నెవిల్లే, రాకెట్ 3 లైనప్స్ నుంచి 8 కొత్త లిమిటెడ్ క్రోమ్ ఎడిషన్ బైక్స్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రాకెట్ 3 R, రాకెట్ 3 GT, బోన్నెవిల్లే T120, బోనెవిల్లే బాబర్, బోనెవిల్లే స్పీడ్‌మాస్టర్, బోనెవిల్లే T100, స్పీడ్ ట్విన్ 900, స్క్రాంబ్లర్ ఎడిషన్ మోడల్స్ ఉన్నాయి. వీటి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బైక్స్ డెలివరీలు 2022 చివరిలో లేదా 2023 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్స్ ఒక సంవత్సరం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ట్రయంఫ్ ఐకానిక్ క్లాసిక్ కస్టమ్ లుక్‌తో రానున్న కొత్త క్రోమ్ ఎడిషన్స్ ధర, స్పెసిఫికేషన్లు చూద్దాం.
ట్రయంఫ్ రాకెట్ 3 GT క్రోమ్ ఎడిషన్
ఇండియన్ మార్కెట్లో ఇది రూ. 21.40 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. ఇది డయాబ్లో రెడ్ యాక్సెంట్‌తో కూడిన క్రోమ్-స్టడెడ్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. ఈ బైక్ జెట్ బ్లాక్ హెడ్‌లైట్ బౌల్స్, ఫ్లై స్క్రీన్, ఫ్రంట్ మడ్‌గార్డ్, రేడియేటర్ కౌల్స్, సైడ్ ప్యానెల్స్, రియర్ బాడీవర్క్‌తో ఆకట్టుకుంటుంది.
ట్రయంఫ్ రాకెట్ 3 R క్రోమ్ ఎడిషన్
ఇండియాలో రాకెట్ 3 R క్రోమ్ ఎడిషన్ ధర రూ. 20.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ జెట్ బ్లాక్ యాక్సెంట్ క్రోమ్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. ఫ్లై స్క్రీన్, హెడ్‌లైట్ బౌల్స్, ఫ్రంట్ మడ్‌గార్డ్, రేడియేటర్ కౌల్స్, సైడ్ ప్యానెల్స్, రియర్ బాడీవర్క్ వంటి జెట్ బ్లాక్ థీమ్ స్పెసిఫికేషన్లతో వస్తుంది.
ట్రయంఫ్ బోన్నెవిల్లే T100 క్రోమ్ ఎడిషన్
ఇండియాలో దీని ధర రూ.10.04 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ క్రోమ్ ఎడిషన్ మెటల్ స్ట్రిప్‌తో కూడిన కోబాల్ట్ బ్లూ ఫ్యూయల్ ట్యాంక్‌తో రిలీజ్ అయింది. జెట్ బ్లాక్ థీమ్‌తో వచ్చిన మడ్‌గార్డ్‌లు, సైడ్ ప్యానెల్‌లు దీని స్పెషల్ అట్రాక్షన్.
ట్రయంఫ్ బోన్నెవిల్లే బాబర్ క్రోమ్ ఎడిషన్
ఇండియాలో ఈ బైక్ ధర రూ. 12.85 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ బైక్ కూడా క్రోమ్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. అయితే ట్యాంక్‌పై ట్రయంఫ్ ట్రయాంగిల్ బ్యాడ్జింగ్‌తో పాటు జెట్ బ్లాక్ పెయింటెడ్ ఓవర్‌లే ఉంటుంది. మడ్‌గార్డ్‌లు, సైడ్ ప్యానెల్స్ జెట్ బ్లాక్ కలర్ థీమ్‌లో వచ్చాయి.
ఏడాదిలో 3 రోజులు మాత్రమే తెరిచి ఉండే దేవాలయం.. ఈ గుడిలో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది
ట్రయంఫ్ బోన్నెవిల్లే T120 క్రోమ్ ఎడిషన్
మన దేశంలో ఈ బైక్ ధర రూ. 11.89 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది మెరిడెన్ బ్లూ పెయింటెడ్ యాక్సెంట్‌తో కూడిన సిగ్నేచర్ క్రోమ్ ట్యాంక్‌ను కలిగి ఉంది. మడ్‌గార్డ్‌లు, హెడ్‌లైట్ బౌల్, సైడ్ ప్యానెల్స్ క్లాసిక్ జెట్ బ్లాక్ ఫినిషింగ్‌తో వచ్చాయి.
ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 క్రోమ్ ఎడిషన్
మన దేశంలో దీని ధర రూ. 8.84 లక్షలు (ఎక్స్-షోరూమ్). క్రోమ్ ఎడిషన్ మెటల్ నీ ప్యాడ్ నీ ప్యాడ్ (knee pad) ఇన్‌ఫిల్స్, జెట్ బ్లాక్ ట్యాంక్ స్ట్రిప్, ట్రయంఫ్ ట్రయాంగిల్ ట్యాంక్ బ్యాడ్జింగ్, మెటల్ డిటైలింగ్‌తో వచ్చిన రెడ్ హాప్పర్ కలర్ స్కీమ్‌తో ఈ బైక్ లగ్జరీ లుక్‌లో కనిపిస్తుంది.
ట్రయంఫ్ బోన్నెవిల్లే స్పీడ్‌మాస్టర్ క్రోమ్ ఎడిషన్
ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ. 12.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ బోల్డ్ డయాబ్లో రెడ్ సరౌండ్స్ క్రోమ్ ట్యాంక్‌తో వస్తుంది. అయితే మడ్‌గార్డ్‌లు, సైడ్ ప్యానెల్స్, హెడ్‌లైట్ బౌల్ జెట్ బ్లాక్ కలర్ స్కీమ్‌తో కనిపిస్తున్నాయి.
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 900 క్రోమ్ ఎడిషన్
ఇండియాలో దీని ధర రూ. 9.94 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. బ్రూక్‌ల్యాండ్స్ గ్రీన్ కలర్లో కనిపించే ఈ బైక్, క్లాసిక్ జెట్ బ్లాక్ థీమ్ ట్యాంక్ ఫినిషింగ్‌తో వస్తుంది. క్రోమ్ ఎడిషన్ మెటల్ నీ ప్యాడ్ (knee pad), క్రోమ్ బేస్డ్ ట్రయంఫ్ ట్రయాంగిల్ ట్యాంక్ బ్యాడ్జింగ్, మడ్‌గార్డ్‌లు, సైడ్ ప్యానెల్స్‌తో ఆకట్టుకుంటుంది. ఫ్రేమ్ కౌల్స్ జెట్ బ్లాక్ థీమ్‌తో వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Motor Cycle