Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై

సబ్‌స్క్రైబర్లపై బిల్లు మోత తగ్గించేందుకు డీటీహెచ్ ఆపరేటర్లైన డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై సంస్థలు చర్యలు తీసుకోవడం వినియోగదారులకు నిజంగా శుభవార్తే.

news18-telugu
Updated: February 19, 2019, 7:25 AM IST
Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై
Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై
  • Share this:
కేబుల్ టీవీ, డీటీహెచ్ కనెక్షన్లు, ఛానెళ్ల ఎంపిక విషయంలో ట్రాయ్ కొత్త నిబంధనలు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు. వినియోగదారులు తమకు నచ్చిన ఛానెళ్లను ఎంచుకొని వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని ట్రాయ్ చెబుతున్నా... కావాల్సిన ఛానెళ్లు ఎంచుకుంటే గతంలో చెల్లించినదానికన్నా ఎక్కువ బిల్లు మోత తప్పదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చేశాయి. ఛానెళ్ల ఎంపికకు మార్చి 31 వరకు గడువు ఉంది. అయితే సబ్‌స్క్రైబర్లపై బిల్లు మోత తగ్గించేందుకు డీటీహెచ్ ఆపరేటర్లైన డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై సంస్థలు చర్యలు తీసుకోవడం వినియోగదారులకు నిజంగా శుభవార్తే.

Read this: Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

ట్రాయ్ సూచించిన టారిఫ్ ఇదే...



రూ.130+18% జీఎస్టీ చెల్లించి బేస్ ప్యాక్ తీసుకుంటే 100 ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్లు చూడొచ్చు. లేదా అందులో పే ఛానెళ్లు ఎంచుకొని వాటి ధరలు చెల్లించొచ్చు. అయితే బేస్ ప్యాక్‌లో ఫ్రీ-టు-ఎయిర్+పే ఛానెళ్లు కలిపి 100 మాత్రమే ఉండాలి. ఒకవేళ 100 ఛానెళ్లు దాటితే ప్రతీ 25 ఛానెళ్లకు రూ.20 చొప్పున అదనంగా చెల్లించాలి. బేస్ ప్యాక్‌కు చెల్లించే రూ.130, అదనపు ఛానెళ్లకు చెల్లించే రూ.20 ని నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ అని అంటారు. మొత్తం కలిపి వినియోగదారులకు భారం అవుతుండటంతో నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్(NCF) తగ్గించేందుకు ముందుకొచ్చాయి డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై.



Read this: మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ తొలగింపు


FTA 1 Basic ప్యాక్‌లో బేస్‌ప్యాక్ కన్నా ఎక్కువ ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్లు తీసుకున్నవారికి నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్(NCF) తొలగిస్తున్నట్టు సన్ డైరెక్ట్ ప్రకటించింది. అంటే ట్రాయ్ నిబంధనల ప్రకారం 100 ఛానెళ్లు దాటితే ప్రతీ 25 ఛానెళ్లకు రూ.20 చొప్పున చెల్లించాలి. కానీ ఆ ఛార్జీలను తొలగించింది సన్ డైరెక్ట్. రూ.130 లోనే 140 వరకు ఛానెళ్లను ఎంచుకోవచ్చు. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. సన్ డైరెక్ట్ మొత్తం 330 ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్లను ఆఫర్ చేస్తోంది. దీని వల్ల కొన్ని పే ఛానెళ్లు కలిపి తీసుకున్నా వినియోగదారులపై భారం ఎక్కువగా పడదు. ఇంతకుముందు డిష్ టీవీ కూడా ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్లకు నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్(NCF) తొలగిస్తున్నట్టు ప్రకటించింది. టాటా స్కై కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.
Loading...
Read this: Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం

ట్రాయ్ కొత్త నియమనిబంధనలకు అనుగుణంగా బ్రాడ్‌క్యాస్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించిన ఛానెళ్ల ధరలు, నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్(NCF) కలిపి వినియోగదారులపై పెనుభారం తప్పదని రీసెర్చ్ సంస్థ అయిన క్రిసిల్ ఈ నెల మొదటివారంలోనే నివేదిక ఇచ్చింది. వినియోగదారులు ప్రస్తుతం చెల్లిస్తున్నదాని కన్నా 25 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుందని క్రిసిల్ అభిప్రాయపడింది. అయితే ఆ భారాన్ని తగ్గించేందుకు డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై లాంటి డీటీహెచ్ ఆపరేటర్లు తీసుకుంటున్న చర్యలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...



ఇవి కూడా చదవండి:

IRCTC Discount: టికెట్ బుకింగ్‌లో వృద్ధులకు మినహాయింపు... నిబంధనలు ఇవే

WhatsApp Group: వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయాలంటే మీ పర్మిషన్ తప్పనిసరి
First published: February 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com