Good News: డీటీహెచ్ ఛార్జీలు ఇక రూ.500లోపే... ట్రాయ్ కొత్త ఆదేశం

TRAI Good news: సెటాప్ బాక్స్ మార్చకుండా మరో ఆపరేటర్‌కు మారొచ్చు

ఇకపై డీటీహెచ్ ప్రొవైడర్లు రూ.500 ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ ఛార్జీలతో పాటు రూ.700-1200 మధ్య వసూలు చేస్తాయి. లేదా కస్టమర్లకు రూ.1,500-2,500 మధ్య సెట్-టాప్ బాక్సుల్ని అమ్ముతాయి. ఈ కొత్త ఆదేశాలు డిసెంబర్ 29 నుంచి అమలులోకి వస్తాయి.

  • Share this:
    టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మరో కొత్త ఆదేశాన్ని జారీ చేసింది. డీటీహెచ్ ప్రొవైడర్లు వసూలు చేసే ఇన్స్టాలేషన్, యాక్టివేషన్ ఛార్జీలు రూ.500 లోపే ఉండాలని ఆదేశించింది ట్రాయ్. ఇన్స్టాలేషన్ ఛార్జీలు రూ.350, యాక్టివేషన్ ఛార్జీలు రూ.150 కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని ఆదేశించింది. ప్రస్తుతం టాటా స్కై ఇన్స్టాలేషన్, యాక్టివేషన్ ఛార్జీలను ఒక నెల ఉచిత సబ్‌‍స్క్రిప్షన్‌తో కలిపి రూ.1,500 వరకు వసూలు చేస్తోంది. ఎయిర్‌టెల్ లాంటి డీటీహెచ్ ప్రొవైడర్లు రూ.1,200 వరకు వసూలు చేస్తున్నాయి.

    ఈ ఛార్జీలు నాన్-రీఫండబుల్. పరికరాలకు అదనంగా అద్దె వసూలు చేయాల్సిన అవసరం లేదు. అయితే కొత్త ఆదేశాలు అమలులోకి వచ్చిన తర్వాత రీఫండబుల్ డిపాజిట్‌తో పాటు పరికరాలకు ప్రతీ నెల ఛార్జ్ చేయొచ్చు. సబ్‌స్క్రిప్షన్ వద్దనుకుంటే సబ్‌స్క్రైబర్ 15 రోజుల ముందుగానే చెప్తే రీఫండబుల్ అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తారు. అంతే కాకుండా ఫలానా కంపెనీ సెట్-టాప్ బాక్స్ మాత్రమే కొనాలని వినియోగదారుల్ని డీటీహెచ్ ప్రొవైడర్లు, కేబుల్ ఆపరేటర్లు ఒత్తిడి చేయకూడదని ట్రాయ్ ఆదేశించింది.

    ప్రస్తుతం డీటీహెచ్ ప్రొవైడర్లు ఎస్‌డీ బాక్స్ కోసం రూ.2,200, హెచ్‌డీ బాక్స్ కోసం రూ.2,500 ఛార్జ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఛార్జీలు సగం కానున్నాయి. ఇకపై డీటీహెచ్ ప్రొవైడర్లు రూ.500 ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ ఛార్జీలతో పాటు రూ.700-1200 మధ్య వసూలు చేస్తాయి. లేదా కస్టమర్లకు రూ.1,500-2,500 మధ్య సెట్-టాప్ బాక్సుల్ని అమ్ముతాయి. ఈ కొత్త ఆదేశాలు డిసెంబర్ 29 నుంచి అమలులోకి వస్తాయి.

    ఇవి కూడా చదవండి:

    హెల్మెట్‌కు ఐఎస్ఐ మార్క్ లేకపోతే రెండేళ్ల జైలు శిక్ష

    Good News: మీ టీవీ ఛానెళ్లు ఏవీ బంద్ కావు... క్లారిటీ ఇచ్చిన ట్రాయ్

    బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ని ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి

    ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో మీకెంత లాభం? తెలుసుకోండిలా...

    మరో ఛాన్స్: ఓటరు జాబితాలో పేరు లేదా? ఇలా దరఖాస్తు చేసుకోండి
    First published: