TRAI: ఛానెళ్లు ఎంపిక చేసుకోనివారికి 'బెస్ట్ ఫిట్ ప్లాన్'

TRAI's Best Fit Plan | మీరు మార్చి 31 లోగా ఛానెళ్లు ఎంపిక చేసుకోనట్టైతే 'బెస్ట్ ఫిట్ ప్లాన్' యాక్టివేట్ చేయాలని ట్రాయ్ సూచించింది. మీకు గతంలో వస్తున్న ఛానెళ్లు ఇప్పుడు రాకపోతే ట్రాయ్ రూపొందించిన 'బెస్ట్ ఫిట్ ప్లాన్' యాక్టివేట్ అయినట్టే.

news18-telugu
Updated: April 8, 2019, 3:43 PM IST
TRAI: ఛానెళ్లు ఎంపిక చేసుకోనివారికి 'బెస్ట్ ఫిట్ ప్లాన్'
TRAI ఛానెళ్లు ఎంపిక చేసుకోనివారికి 'బెస్ట్ ఫిట్ ప్లాన్'
news18-telugu
Updated: April 8, 2019, 3:43 PM IST
మీరు మార్చి 31 లోగా ఛానెళ్లు ఎంపిక చేసుకోలేదా? అయితే మీకు 'బెస్ట్ ఫిట్ ప్లాన్' యాక్టివేట్ అయినట్టే. వాస్తవానికి ఛానెళ్ల ఎంపిక విషయంలో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి వచ్చాయి. కానీ మార్చి 31 వరకు ఛానెళ్లు ఎంపిక చేసుకోవడానికి సబ్‌స్క్రైబర్లకు అవకాశం ఇచ్చింది ట్రాయ్. అయితే మార్చి 31 లోగా ఛానెళ్లు ఎంపిక చేసుకోనివారి పరిస్థితి ఏంటన్న అనుమానాలు, సందేహాలు చాలామందిలో ఉండేవి. వారి కోసం ట్రాయ్ 'బెస్ట్ ఫిట్ ప్లాన్' రూపొందించింది. మీరు మార్చి 31 లోగా ఛానెళ్లు ఎంపిక చేసుకోనట్టైతే 'బెస్ట్ ఫిట్ ప్లాన్' యాక్టివేట్ చేయాలని ట్రాయ్ సూచించింది. మీకు గతంలో వస్తున్న ఛానెళ్లు ఇప్పుడు రాకపోతే ట్రాయ్ రూపొందించిన 'బెస్ట్ ఫిట్ ప్లాన్' యాక్టివేట్ అయినట్టే.

Read this: Fixed Deposit: టాప్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే...

బెస్ట్ ఫిట్ ప్లాన్ అంటే ఏంటీ?



వినియోగదారుల భాష, ఛానెళ్లు చూసే తీరును బట్టి 'బెస్ట్ ఫిట్ ప్లాన్' రూపొందించింది ట్రాయ్. వేర్వేరు జానర్లకు చెందిన ఛానెళ్ల కలయికతో 'బెస్ట్ ఫిట్ ప్లాన్' ఉంటుంది. మీరు ఇప్పటికే చెల్లిస్తున్న కేబుల్ బిల్లు పరిధిలోనే 'బెస్ట్ ఫిట్ ప్లాన్' ఉంటుంది. లేదా కొద్దిగా బిల్లు పెరుగుతుంది. కేబుల్ ఆపరేటర్లతో పాటు డీటీహెచ్ ఆపరేటర్లు ఈ 'బెస్ట్ ఫిట్ ప్లాన్'ను యాక్టివేట్ చేస్తారు. ఒకవేళ మీకు ఇప్పటికీ 'బెస్ట్ ఫిట్ ప్లాన్' యాక్టివేట్ కాకపోతే మీరు సంబంధిత డీటీహెచ్ ఆపరేటర్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పటికే 'బెస్ట్ ఫిట్ ప్లాన్' యాక్టివేట్ అయినా మీరు మీకు కావాల్సిన ఛానెళ్లను ఎంపిక చేసుకోవచ్చు.



ట్రాయ్ నిబంధనల ప్రకారం 100 ఛానెళ్లకు నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు రూ.130+18% జీఎస్టీ. మొత్తం రూ.153 అవుతుంది. 100 ఛానెళ్లలో 25 దూరదర్శన్ ఛానెళ్లు ఉంటాయి. మీరు 100 కన్నా ఎక్కువ ఛానెళ్లు ఎంచుకుంటే ప్రతీ 25 ఛానెళ్లకు అదనంగా రూ.20 చెల్లించాలి.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

JIO Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రూ.200 లోపు జియో ప్లాన్స్ ఇవే...

IRCTC Insurance: 49 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలో తెలుసుకోండి
First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...