రైలులో బెర్త్ దొరుకుతుందో లేదో అని ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేయడం, ప్రయాణంలో మార్పులు ఉంటే రైలు టికెట్లు క్యాన్సిల్ చేయడం (Train Ticket Cancellation) మామూలే. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ మొత్తం రాదు. అందులో కొంత క్యాన్సలేషన్ ఛార్జీల రూపంలో భారతీయ రైల్వే (Indian Railways) వసూలు చేస్తుంది. కన్ఫామ్డ్, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రైలు టికెట్లు రద్దు చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ క్యాన్సలేషన్ ఛార్జీలు రైలు టికెట్ క్యాన్సిల్ చేసిన సమయంపై ఆధారపడి ఉంటాయి. అందుకే రైలు టికెట్లు బుక్ (Train Ticket Booking) చేసేవారు క్యాన్సలేషన్ ఛార్జీలు, రీఫండ్ నియమనిబంధనలు తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఆ నియమనిబంధనలేంటో తెలుసుకోండి.
ట్రైన్ టికెట్ క్యాన్సలేషన్ ఛార్జీలు టికెట్ క్లాస్‌పైన ఆధారపడి ఉంటాయి. ఏసీ ఫస్ట్, ఏసీ చైర్ కార్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్... ఇలా వేర్వేరు క్లాస్‌లకు వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. కన్ఫామ్ అయిన టికెట్స్‌ని రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే ఏసీ ఫస్ట్, ఎగ్జిక్యూటీవ్ క్లాస్ టికెట్లకు రూ.240 క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ టికెట్లకు రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్, ఏసీ-3 ఎకానమీ టికెట్లకు రూ.180, సెకండ్ క్లాస్ టికెట్లకు రూ.60 క్యాన్సలేషన్ ఛార్జీలు ఉంటాయి.
Indian Railways: రైలు మిస్ అయ్యారా? అదే టికెట్‌పై మరో రైలు ఎక్కొచ్చా? తెలుసుకోండి
ఒకవేళ రైలు బయల్దేరడానికి 48 గంటల నుంచి 12 గంటల ముందు ట్రైన్ టికెట్ రద్దు చేస్తే టికెట్ ఛార్జీలో 25 శాతం క్యాన్సలేషన్ ఛార్జీలు ఉంటాయి. ఇక రైలు బయల్దేరడానికి 12 గంటల ముందు నుంచి 4 గంటల ముందు రైలు టికెట్ రద్దు చేస్తే టికెట్ ఛార్జీలో 50 శాతం క్యాన్సలేషన్ ఛార్జీలు ఉంటాయి. ఇక ఆర్ఏసీ, వెయిట్‌లిస్టింగ్‌లో ఉన్న రైలు టికెట్లను, రైలు బయల్దేరడానికి అరగంట ముందు వరకు ఎప్పుడు క్యాన్సిల్ చేసినా ఫుల్ రీఫండ్ వస్తుంది. కేవలం క్లర్కేజ్ ఛార్జీలు మాత్రమే చెల్లించాలి.
Railway Passengers: జనరల్ టికెట్‌తో స్లీపర్ కోచుల్లో ప్రయాణం... రైల్వే శాఖ కీలక నిర్ణయం
ఇక కన్ఫామ్ అయిన తత్కాల్ ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు. ఇక వరదలు, ప్రమాదాలు, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా రైళ్లు రద్దు చేస్తే ప్రయాణికులకు మూడు రోజుల్లో పూర్తి రీఫండ్ లభిస్తుంది. ఒకవేళ ఇ-టికెట్స్ విషయానికి వస్తే, ప్రయాణికులుఆన్‌లైన్‌లోనే రైలు టికెట్స్ రద్దు చేయొచ్చు. రైలు టికెట్లు క్యాన్సిల్ చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్న రైల్వే ప్రయాణికులు ఏవైనా సమస్యలు ఉంటే భారతీయ రైల్వే లేదా ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌లో కంప్లైంట్స్ చేయాలి. ఎవరైనా రీఫండ్ పేరుతో కాల్ చేస్తే పట్టించుకోవద్దు. ఇలాంటి మోసాలు ఇటీవల పెరిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, Railways