లాక్ డౌన్ నేపథ్యంలో ప్రీపెయిడ్ సేవలపై దృష్టి పెట్టండి...టెల్కోలకు ట్రాయ్ లేఖ

మొబైల్ సంస్థలు తమ కస్టమర్లకు భారంగా మారకుండా చొరవ తీసుకోవాలని టెలికాం నియంత్రణా సంస్థ ట్రాయ్ టెల్కోలను కోరింది. ఈమేరకు ప్రీపెయిడ్‌ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు ట్రాయ్‌ ఆదేశించింది.

news18-telugu
Updated: April 1, 2020, 12:03 AM IST
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రీపెయిడ్ సేవలపై దృష్టి పెట్టండి...టెల్కోలకు ట్రాయ్ లేఖ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనావైరస్‌ కారణంగా దేశ వ్యాప్త లాక్ డౌన్ దెబ్బతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ సంస్థలు తమ కస్టమర్లకు భారంగా మారకుండా చొరవ తీసుకోవాలని టెలికాం నియంత్రణా సంస్థ ట్రాయ్ టెల్కోలను కోరింది. ఈమేరకు ప్రీపెయిడ్‌ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు ట్రాయ్‌ ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రీపెయిడ్‌ యూజర్లంతా నిరంతరాయంగా సర్వీసులు పొందేందుకు .. వ్యాలిడిటీని పొడిగించడం సహా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. టెలికమ్యూనికేషన్‌ సేవలను నిత్యావసర సర్వీసుల కింద పరిగణించి, మినహాయింపు ఇచ్చింది. ప్రీపెయిడ్‌ సేవలకు సంబంధించి రీచార్జి వోచర్లు, ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాలను అందుబాటులో ఉంచడం తదితర అంశాలకు సంబంధించి ఈ మేరకు సూచనలు చేసింది.
First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading