New Delhi : మొబైల్ కాల్స్ టెర్మినేషన్పై 6 పైసలు IUC ఛార్జీలను రద్దు చేయాలనే నిర్ణయానికి భారీ మద్దతు లభిస్తోంది. ఐతే... ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు సంబంధించి టెలికం రెగ్యులేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా (TRAI) నిర్వహించిన డిబేట్‌కి 155 మంది హాజరయ్యారు. రిలయన్స్ జియో, BSNL, MTNL సహా మొబైల్ ఆపరేటర్లు, దేశవ్యాప్తంగా ఉండే మొబైల్ వినియోగదారుల్లో కొందరు ఇందులో పాల్గొన్నారు. 2020 జనవరి 1న 6పైసలు IUC ఛార్జీలను రద్దు చేసేలా బిల్లు తేవాలా లేక వాయిదా వెయ్యాలా అనే దానిపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎక్కువ మంది వినియోగదారులు... IUC ఛార్జీలను రద్దు చేయడమే మంచిదన్నారు.
2017 ట్రాయ్ రెగ్యులేషన్ పేపర్ ద్వారా తెచ్చిన IUC ఛార్జీలను జనవరి 1 నుంచీ ఎత్తివేయడమే మంచిదన్న అభిప్రాయం డిబేట్లో వ్యక్తమైనట్లు టెలికం కమిషన్ మాజీ (టెక్నాలజీ) సభ్యుడు ఎస్.ఎస్.సిరోహీ తెలిపారు. జనవరి 1న ఛార్జీలను రద్దు చేయాలనుకున్న నిర్ణయాన్ని వాయిదా వెయ్యాల్సిన అవసరం లేదన్నారు ఆయన. అన్ని రకాల సంప్రదింపుల తర్వాతే... ట్రాయ్... ఈ అభిప్రాయానికి వచ్చిందన్న సిరోహీ... ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ రద్దు జరగాలన్నారు. అసలు దీనిపై లేనిపోని రాద్ధాంతం ఎందుకు జరుగుతోందో అన్న ఆయన... ఆల్రెడీ పరిష్కారం అయిన అంశాలపై మళ్లీ చర్చే అవసరం లేదన్నారు. 6 పైసల ఛార్జీలు రద్దు చెయ్యకపోతే... వినియోగదారులు అసంతృప్తి చెందుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

"మన దేశంలో టెలికం రంగాన్ని ఓ క్రమపద్ధతిలో అభివృద్ధి చెయ్యడానికి... వినియోగదారుల సంక్షేమాన్ని పెంచడం, (వినియోగదారులకు ఎక్కువ ఎంపిక అవకాశాలు, తక్కువ టారిఫ్‌లు, నాణ్యమైన, సరికొత్త సేవలు అందేందుకు), సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం అన్నది ముఖ్యమైన అంశం. ఇందులో భాగంగా IUC ఛార్జీలను 2020 జనవరి 1 నుంచీ రద్దు చెయ్యడం కీలకం. 2022 నుంచీ అందరికీ బ్రాడ్‌బ్యాండ్ అందించే లక్ష్యంతో 2018లో రూపొందించిన నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీని కార్యరూపం దాల్చేలా చేసేందుకు కూడా ఈ ఛార్జీల రద్దు అవసరమే."
— సిరోహీ
IUC ఛార్జి అనేది ఏదైనా టెలికం సంస్థ... వేరే టెలికం సంస్థ నెట్వర్క్ కాల్‌ను రద్దు చేస్తే... అందుకు ఆ టెలికం సంస్థకు చెల్లించే ఛార్జి. మొదట్లో ఇది నిమిషానికి 14 పైసలుగా ఉండేది. తర్వాత దాన్ని నిమిషానికి 6 పైసలకు తగ్గించారు. ఇప్పుడు 2020 జనవరి 1 నుంచీ ఈ ఛార్జీని పూర్తిగా తొలగించాలని ట్రాయ్ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి :
టీ10 లీగ్‌లో సందడి చేసిన సన్నీలియోన్
వావ్... స్ట్రీట్ డాన్స్ ఇరగదీసిన నోరా ఫతేహి
పులి చర్మం డ్రెస్‌లో ఇలియానా... సోషల్ మీడియా షేక్...
టార్గెట్ రాహుల్... నేడు బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు Published by:Krishna Kumar N
First published:November 16, 2019, 10:21 IST