DTH, CABLE NEWS: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు

TRAI Good News | రూ.153 చెల్లించి 100 ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్లు మాత్రమే కాదు... అందులో పే ఛానెల్స్ కూడా ఎంచుకోవచ్చు. అంటే 100 ఛానెల్స్‌లో ముందుగా కావాల్సిన పే ఛానెల్స్ ఎంచుకొని, మిగతావి ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాయ్ విడుదల చేసిన తాజా ఉత్తర్వులు ఇవి.

news18-telugu
Updated: January 14, 2019, 1:27 PM IST
DTH, CABLE NEWS: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేబుల్, డీటీహెచ్ కనెక్షన్ల విషయంలో ఉన్న గందరగోళానికి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-ట్రాయ్ తెరదించుతోంది. సామాన్యులకు ఉన్న అనుమానాలను, సందేహాలను తీర్చడమే కాదు... కొత్తకొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. రూ.153 చెల్లిస్తే కేవలం 100 ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్లు మాత్రమే చూసే అవకాశం ఉంటుందని ఇన్నాళ్లూ అందరూ అనుకుంటుంటే... ఇప్పుడు ట్రాయ్ మరో శుభవార్త చెప్పింది. రూ.153 చెల్లించి 100 ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్లు మాత్రమే కాదు... అందులో పే ఛానెల్స్ కూడా ఎంచుకోవచ్చు. అంటే 100 ఛానెల్స్‌లో ముందుగా కావాల్సిన పే ఛానెల్స్ ఎంచుకొని, మిగతావి ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాయ్ విడుదల చేసిన తాజా ఉత్తర్వులు ఇవి.

వాస్తవానికి 100 ఛానెళ్ల టారిఫ్ కేవలం రూ.130 మాత్రమే. జీఎస్‌టీతో కలిపి రూ.153.40 చెల్లించాల్సి వస్తుంది. ట్రాయ్ తాజా ఉత్తర్వుల ప్రకారం జనవరి 31 లోపే కొత్త ఛానెళ్ల ఎంపిక పూర్తికావాలి. ఫిబ్రవరి 1 నుంచి ఎంపిక చేసుకున్నట్టుగా ఛానెళ్లు ప్రసారమౌతాయి. ట్రాయ్ చెప్పినదాని ప్రకారం ఇది బేస్ ప్యాక్ మాత్రమే. ఇందులో హెచ్‌డీ ఛానెల్స్ ఉండవు. ట్రాయ్ తాజా ఆదేశాలపై ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే 011-23237922 (ఏకే భరద్వాజ్), 011-23220209 (అర్వింద్ కుమార్) నెంబర్లకు కాల్ చేసి లేదా advbcs-2@trai.gov.in, arvind@gov.in అడ్రస్‌లకు ఇమెయిల్ చేసి కనుక్కోవచ్చు.

పే ఛానెల్స్‌లో అత్యధిక ధర రూ.19 మాత్రమే. ఛానెళ్లను ఎంపిక చేసుకునే ముందు వినియోగదారులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఛానెళ్లు ఒక్కొక్కటిగా ఎంచుకోవచ్చు. లేదా డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లు ఇచ్చే బొకేలను ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు

JALLIKATTU: 'జల్లికట్టు' వెనకున్న ఆసక్తికర చరిత్ర ఏంటో తెలుసా?

Work From Home: స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో కూర్చొని రూ.40 వేలు సంపాదించండి ఇలా

కార్డు నెంబర్, సీవీవీ లేకుండా పేమెంట్స్ సాధ్యం... ఎలాగో తెలుసుకోండి
First published: January 14, 2019, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading