గుడ్‌న్యూస్...టీవీ ఛానెళ్ల ఎంపికకు గడువు పెంపు...అప్పటి దాకా అన్నీ..

ఒక వేళ మార్చి 31 వరకు కూడా ఛానెళ్ల ఎంపిక పూర్తిచేయకుంటే..ఆటోమేటిగ్గా 'బెస్ట్ ఫిట్ ప్లాన్‌'లోకి మారిపోతారు. భాష, ఛానెల్ పాపులారిటీ, ప్రేక్షకుల వినియోగాన్ని బట్టి 'బెస్ట్ ఫిట్ ఫ్లాన్'ను రూపొందిస్తారు.

news18-telugu
Updated: February 12, 2019, 8:22 PM IST
గుడ్‌న్యూస్...టీవీ ఛానెళ్ల ఎంపికకు గడువు పెంపు...అప్పటి దాకా అన్నీ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 8:22 PM IST
పే ఛానెళ్ల ఎంపిక..! గత మూడు నెలలుగా దేశమంతటా దీనిపైనే చర్చ జరుగుతోంది. వినియోగదారుడు వీక్షించే ఛానెళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించేలా ట్రాయ్ కొత్త విధివిధానాలు రూపొందించిన నేపథ్యంలో అంతటా గందరగోళం నెలకొంది. 'ఫ్రీ టూ ఎయిర్' ఛానెళ్ల విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఒక్కో 'పే ఛానెల్‌'కి డబ్బు చెల్లించుకుంటూ పోతే..తమ జేబుకు చిల్లు తప్పదని జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికీ చాలా మంది పే ఛానెళ్ల ఎంపికను పూర్తి చేయలేదు. దాంతో చాల ప్రాంతాల్లో కొన్ని పే ఛానెల్స్ ప్రసారాలు ఆగిపోయాయి.

నచ్చిన ఛానెళ్లను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కేబుల్ ఆపరేటర్లు కూడా దీనిపై జనాల్లో అవగాహన కల్పించకపోవడంతో ప్రేక్షకుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు ఊరట కల్పిస్తూ..'పే ఛానెళ్ల ఎంపిక' గడువును మార్చి 31 వరకు పొడిగిచింది ట్రాయ్. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ప్లానే కొనసాగుతుంది. ఒక వేళ మార్చి 31 వరకు కూడా ఛానెళ్ల ఎంపిక పూర్తిచేయకుంటే..ఆటోమేటిగ్గా 'బెస్ట్ ఫిట్ ప్లాన్‌'లోకి మారిపోతారు. భాష, ఛానెల్ పాపులారిటీ, ప్రేక్షకుల వినియోగాన్ని బట్టి 'బెస్ట్ ఫిట్ ఫ్లాన్'ను రూపొందిస్తారు. అది కూడా..ప్రస్తుతమున్న టారిఫ్ ప్లాన్‌ రేటును మించకూడదని కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీచేసింది ట్రాయ్.

ట్రాయ్ నిబంధనల ప్రకారం 100 ఎస్‌డీ ఛానెళ్ల బేస్ ప్యాక్ రూ.130. దానికి జీఎస్‌టీ అదనం. జీఎస్టీతో కలిపి కేవలం రూ.153 చెల్లించి 100 ఉచిత ఛానెళ్లు చూసే వెసులుబాటు ఉంది. మొత్తం 535 ఫ్రీ టూ ఎయిర్ ఛానెళ్లలో మనకు నచ్చినవి 100 ఎంపిక చేసుకోవచ్చు. ఇక పే ఛానెల్స్ చూడాలంటే మాత్రం అదనంగా చెల్లించాల్సిందే. ఇందుకోసం ఆయా ఛానెళ్లు సూచించిన ప్యాకేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. 330 పే ఛానెల్స్‌లో ఏది కావాలంటే అది ఎంపిక చేసి..దానికి డబ్బు చెల్లించాలి. ఎయిర్‌టెల్, టాటాస్కై రూ.99 నుంచే బేస్ ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నాయి.First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...