TRAI Deadline: ఛానెళ్ల ఎంపికకు మార్చి 31 డెడ్‌లైన్

TRAI Deadline | ఛానెళ్లు ఎంచుకున్నవారికి ఇబ్బంది లేదు. ఛానెళ్లు ఎంపిక చేసుకోలేదంటే మార్చి 31 తర్వాత మీరు చూస్తున్న ఛానెళ్లలో కొన్ని ఆగిపోవచ్చు.

news18-telugu
Updated: March 26, 2019, 12:10 PM IST
TRAI Deadline: ఛానెళ్ల ఎంపికకు మార్చి 31 డెడ్‌లైన్
TRAI Deadline: ఛానెళ్ల ఎంపికకు మార్చి 31 డెడ్‌లైన్
news18-telugu
Updated: March 26, 2019, 12:10 PM IST
మీరు ఏఏ ఛానెళ్లు చూడాలో ఎంపిక చేసుకున్నారా? ఇంకా చేయలేదంటే మార్చి 31 డెడ్‌లైన్ అన్న విషయం గుర్తుంచుకోండి. గతంలో ఈ డెడ్‌లైన్ జనవరి 31 వరకే ఉండేది. కానీ చాలామంది వీక్షకులు అప్పటికీ ఛానెళ్లు ఎంపిక చేసుకోకపోవడంతో మార్చి 31 వరకు గడువును పొడిగించింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI). ఆ గడువు దగ్గరపడింది. ఇంకొన్నిరోజులే ఉంది. ఒకవేళ మీరు అప్పటి వరకు కూడా ఛానెళ్లు ఎంపిక చేసుకోకపోతే ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేస్తాయి. మీరు చూస్తున్న ఛానెళ్లకు అంతరాయం ఏర్పడొచ్చు.

Read this: Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 21 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

ఛానెళ్ల ప్రసారం విషయంలో కొత్త నిబంధనలు రూపొందించిన ట్రాయ్... ఛానెళ్లు ఎంపిక చేసుకునే విషయంలో ప్రేక్షకులకు స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఛానెళ్ల ఎంపిక విషయంలో గందరగోళం నెలకొంది. అందుకే పే ఛానెళ్లు ఎంపిక చేసుకోవడానికి గడువు పొడిగించింది ట్రాయ్. అయితే ఇప్పటికీ ఎంతమంది ఛానెళ్లు ఎంపిక చేసుకున్నారో తెలియదు. ఛానెళ్లు ఎంచుకున్నవారికి ఇబ్బంది లేదు. ఛానెళ్లు ఎంపిక చేసుకోలేదంటే మార్చి 31 తర్వాత మీరు చూస్తున్న ఛానెళ్లలో కొన్ని ఆగిపోవచ్చు.

Read this: IPL Offer: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రీఛార్జ్ ఆఫర్లు ఇవే



ఏ ఛానెల్‌కు ఎంత ఛార్జీ ఉంటుందో ఆ వివరాలు ట్రాయ్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. బేసిక్ ప్యాక్ రూ.130. జీఎస్‌టీ అదనం. జీఎస్టీతో కలిపి సుమారు రూ.154 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 100 ఉచిత ఛానెళ్లు ఉంటాయి. ఉచిత ఛానెళ్లు కాకుండా పే ఛానెళ్లు చూడాలనుకుంటే మాత్రం వాటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో ఛానెల్‌కు ఒక్కో ధర నిర్ణయించింది ట్రాయ్. ఎస్‌డీ ఛానెళ్ల గరిష్ట ధర రూ.19. అయితే మీరు చూడాలనుకునే ఛానెళ్లకు ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసుకునేందుకు ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ట్రాయ్. ఆ అప్లికేషన్ ద్వారా మీ ప్యాక్ ఎంతవుతుందో చూడొచ్చు. ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్‌‌ను ఉపయోగించేందుకు ఈ లింక్ https://channel.trai.gov.in/index.html క్లిక్ చేయండి.
Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి
Loading...
ఇవి కూడా చదవండి:

WhatsApp: ఒక మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేశారు? ఇక లెక్క తేల్చనున్న వాట్సప్

Credit Score: క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఇలా పెంచుకోవచ్చు

IRCTC-SBI Offer: రివార్డ్ పాయింట్స్‌తో రైలు టికెట్ కొనొచ్చు... ప్రాసెస్ ఇదే
First published: March 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...