• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • TRADEMARK WHAT IS A TRADEMARK WHAT ARE ITS USES MK GH

Trademark: ట్రేడ్‌మార్క్ అంటే ఏంటి...దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి...

Trademark: ట్రేడ్‌మార్క్ అంటే ఏంటి...దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి...

ప్రతీకాత్మకచిత్రం

ట్రేడ్‌మార్క్ అనేది మేధో సంపత్తిలో ఒక భాగం. గుర్తించగలిగే ఒక రకమైన గుర్తు, డిజైన్ లేదా సంకేతాన్ని ట్రేడ్‌మార్క్ అంటారు. ఒక వ్యక్తి లేదా సంస్థకు చెందిన వస్తు సేవలు, ఉత్పత్తులను.. ఇతరుల ఉత్పత్తుల నుంచి వేరు చేయడంతో పాటు సులువుగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

  • Share this:
ట్రేడ్‌మార్క్ అనేది మేధో సంపత్తిలో ఒక భాగం. గుర్తించగలిగే ఒక రకమైన గుర్తు, డిజైన్ లేదా సంకేతాన్ని ట్రేడ్‌మార్క్ అంటారు. ఒక వ్యక్తి లేదా సంస్థకు చెందిన వస్తు సేవలు, ఉత్పత్తులను.. ఇతరుల ఉత్పత్తుల నుంచి వేరు చేయడంతో పాటు సులువుగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి, వ్యాపార సంస్థ లేదా చట్టపరమైన సంస్థలు దీన్ని పొందవచ్చు. ఏదైనా ప్యాకేజీ, లేబుల్, వోచర్‌పై లేదా ప్రొడక్ట్‌లోనే ట్రేడ్‌మార్క్‌ ఉండవచ్చు. కార్పొరేట్ గుర్తింపు కోసం కంపెనీ బిల్డింగ్‌లపై ట్రేడ్‌మార్క్‌లను ప్రదర్శిస్తారు. దీనికి చట్టబద్దమైన మేధో సంపత్తిగా గుర్తింపు ఉంది.


ట్రేడ్‌మార్క్‌ను ఎవరు తీసుకుంటారు?

ఒక వ్యక్తి, వ్యాపార సంస్థ లేదా ఏదైనా చట్టపరమైన సంస్థలు ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్యాకేజీ, లేబుల్ లేదా ఉత్పత్తిలోనే ఇది ఉండవచ్చు.


ట్రేడ్‌మార్క్‌ల ముఖ్య ఉద్దేశం ఏంటి?

ఉత్పత్తులు లేదా వస్తు సేవల మూలాన్ని గుర్తించడానికి ట్రేడ్‌మార్క్ సహాయపడుతుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ యాజమాన్యాన్ని ఇవి సూచిస్తాయి. రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌కు చట్టప్రకారం కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి.


ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన అంటే?

భారతదేశంలో ట్రేడ్‌మార్క్ హక్కుల పర్యవేక్షణ, చట్టపరమైన రక్షణకు సంబంధించిన అంశాలను ట్రేడ్‌మార్క్ చట్టం, 1999లోని సెక్షన్ 29లో పొందుపరిచారు. ఒక వ్యక్తి లేదా సంస్థకు చెందిన రిజిస్టర్ ట్రేడ్‌మార్క్‌ను బయటి వ్యక్తులు అనధికారంగా, మోసపూరితంగా, సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన అంటారు.


ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనలు ఎన్ని రకాలు?

యజమానుల అనుమతి లేకుండా, అనధికారంగా ట్రేడ్‌మార్క్‌ ప్రయోజనాలు పొందడం.. ఇప్పటికే రిజిస్టర్ చేయించిన ట్రేడ్‌మార్క్‌ మాదిరిగా కొత్తదాన్ని రూపొందించడం.. యజమానులకు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ కల్పించే ప్రత్యేకమైన చట్టబద్ధమైన హక్కులను అక్రమంగా వినియోగించడం... వంటివన్నీ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కిందకు వస్తాయి.


ఉమ్మడి యాజమాన్యంలోని ట్రేడ్‌మార్క్‌లు ఎలా ఉంటాయి?

ఒకటి కంటే ఎక్కువ చట్టపరమైన సంస్థలు ఉమ్మడిగా ఉత్పత్తి చేసే వస్తు సేవలకు ఒకే ట్రేడ్‌మార్క్ తీసుకోవచ్చు. ఈ సందర్భంలో ట్రేడ్‌మార్క్‌ను సంబంధిత సంస్థల ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తారు.


ట్రేడ్‌మార్క్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది?

ఒక సంస్థ ఉనికిలో ఉన్నంత వరకు దాని పేరు మీద ఉన్న ట్రేడ్‌మార్క్ చెల్లుబాటు అవుతుంది. అంటే దీన్ని శాశ్వత ప్రాతిపదికన కేటాయిస్తారు. వెంచర్ ఆఫర్ చేస్తున్న వస్తువులు లేదా సేవలు ఉత్పత్తి అవుతున్నంత వరకు ట్రేడ్‌మార్క్ హక్కులు కొనసాగుతాయి. ఇది కాపీరైట్‌, పేటెంట్‌లకు భిన్నంగా ఉంటుంది. ఈ రెండింటికీ నిర్ణీత గడువు ఉంటుంది. ఆ తరువాత వాటిపై హక్కులు ప్రజలందరూ పొందే వీలుంటుంది. కానీ ట్రేడ్‌మార్క్‌ మాత్రం శాశ్వతంగా చెల్లుబాటు అవుతుంది.


భారతదేశంలో ట్రేడ్‌మార్క్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ట్రేడ్‌మార్క్ కోసం ఎవరైనా ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ ఇండియాకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత సంబంధిత అధికారులు దాన్ని పరీక్షిస్తారు. అవసరమైతే దానికి కొన్ని మార్పులు చేస్తారు. దరఖాస్తును షరతులతో అంగీకరించవచ్చు. దాన్ని తిరస్కరించే అవకాశం కూడా వారికి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తికావడానికి ఒక సంవత్సరం కూడా పట్టవచ్చు. ఒకవేళ ట్రేడ్‌మార్క్‌ను ఆమోదిస్తే.. దాన్ని యజమానులు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇతరుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే.. అప్పుడు ట్రేడ్‌మార్క్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తుంది.
Published by:Krishna Adithya
First published: