news18-telugu
Updated: November 24, 2020, 1:02 AM IST
ప్రతీకాత్మకచిత్రం
భారత్ దిగుమతులు భారీగా తగ్గిపోతున్న నేపథ్యంలో– ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు అక్టోబర్ నెలలో 8.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది, గత ఏడాది ఇదే నెలలో ఇది 11.75 బిలియన్ డాలర్లు కాగా, ఏడాది ప్రాతిపదికన అక్టోబర్లో భారత వాణిజ్య లోటు 25 శాతం తగ్గింది. వాణిజ్య లోటు సెప్టెంబర్లో 2.7 బిలియన్ డాలర్లు, ఆగస్టులో 6.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్టోబర్లో ఎగుమతులు సంవత్సరానికి 5.12 శాతం క్షీణించి 24.89 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు, భారత ఎగుమతులు సెప్టెంబరులో 5.9 శాతం పెరిగాయి, ఆగస్టులో ఇది 12.2 శాతం తగ్గింది.
పెట్రోలియం, చమురు ఎగుమతులు...పెట్రోలియం, చమురు ఉత్పత్తు ఎగుమతుల్లో క్షీణత కనిపించింది. పెట్రోలియం, చమురు, లూబ్రికెంట్ ఎగుమతులు అక్టోబర్లో 52 శాతం తగ్గాయి, ఆగస్టులో పెట్రోలియం, చమురు, లుబ్రికెంట్ ఎగుమతులు 40.3 శాతం తగ్గాయి. అయితే జీడిపప్పు 21.57 శాతం, రత్నాలు, ఆభరణాలు 21.27 శాతం, తోలు 16.67 శాతం, మేన్ మేడ్ యార్న్/ఫ్యాబ్రిక్స్ 12.8 శాతం, ఎలక్ట్రానిక్ గూడ్స్ 9.4 శాతం, కాఫీ 9.2 శాతం, సముద్ర ఉత్పత్తులు 8 శాతం, ఇంజనీరింగ్ గూడ్స్ 3.75 శాతం ఎగుమతులు తగ్గిపోయాయి. అయితే బియ్యం, ఆయిల్ మీల్స్, ముడి ఇనుము, చమురు గింజలు, కార్పెట్లు, ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, పత్తి, రసాయనాల ఎగుమతుల్లో వృద్ధి కనిపించింది.
దిగుమతి ఎలా ఉంది
దిగుమతులు 11.53 శాతం తగ్గి 33.61 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశ దిగుమతులు సెప్టెంబర్లో 19.6 శాతం, ఆగస్టులో 26 శాతం తగ్గాయి. పెట్రోలియం, చమురు మరియు లూబ్రికెంట్ దిగుమతులు అక్టోబర్లో 38.5 శాతం, నాన్ పెట్రోలియం, చమురు మరియు కందెన ఉత్పత్తుల దిగుమతుల్లో 2.2 శాతం తగ్గాయి.
వాణిజ్య మిగులు ఈ సంవత్సరం ఉండవచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం వాణిజ్య మిగులును నమోదు చేయవచ్చు. దిగుమతుల కంటే ఎక్కువ ఎగుమతులు ఉన్నప్పుడు వాణిజ్య మిగులు నమోదు అవుతుంది. దిగుమతులు ఎగుమతులను మించినప్పుడు వాణిజ్య లోటు అవుతుంది. దిగుమతులు బాగా తగ్గడం వల్ల ఈ ఏడాది భారతదేశం వాణిజ్య మిగులును నమోదు చేయవచ్చని ఆ దేశ ముఖ్య ఆర్థిక సలహాదారు పేర్కొన్నారు.
Published by:
Krishna Adithya
First published:
November 24, 2020, 1:02 AM IST