హోమ్ /వార్తలు /బిజినెస్ /

కరోనాతో ఈ రంగంలో పెరిగిన అమ్మకాలు...ఆ కంపెనీలకు భలే లాభాలు...

కరోనాతో ఈ రంగంలో పెరిగిన అమ్మకాలు...ఆ కంపెనీలకు భలే లాభాలు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కోవిడ్–19 కారణంగా భారతదేశంలో ట్రాక్టర్ అమ్మకాలు పెరిగాయి. రాబోయే పండుగ సీజన్‌కు ట్రాక్టర్ల అమ్మాకాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయిని పరిశ్రమలోని వ్యక్తులు అభిప్రాయడుతున్నారు.

కోవిడ్–19 దేశంలో అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. అయితే ఆటోమొబైల్ పరిశ్రమ మాత్రం ఆశాజనకంగా వృద్ధి సాధించింది. కోవిడ్–19 కారణంగా భారతదేశంలో ట్రాక్టర్ అమ్మకాలు పెరిగాయి. రాబోయే పండుగ సీజన్‌కు ట్రాక్టర్ల అమ్మాకాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయిని పరిశ్రమలోని వ్యక్తులు అభిప్రాయడుతున్నారు. కోవిడ్ –19 కారణంగా పంజాబ్, హర్యానా మరియు ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఇది అధిక వ్యవసాయ యాంత్రీకరణకు దారితీసిందని వ్యవసాయ రంగ విశ్లేషకులు పేర్కొన్నారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ట్రాక్టర్ అమ్మకాలు సుమారు 5 శాతం మేర పెరిగమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. రబీ పంట కాలంలో ఆశించిన మేరకు వర్షాలు పడని నేపథ్యంలో, ఈ ఖరీఫ్ పంట కాలంలో ఎక్కువ అమ్మకాలు జరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రుతి సబూ తెలిపారు. కాగా ఖరీఫ్ పంట కాలం అనగా 2020 సెప్టెంబర్ 4 నాటికి పంట మొత్తం విస్తీర్ణం 6.3 శాతం పెరిగింది. దీంతో ట్రాక్టర్ల డిమాండ్ భారీగా పెరగనుంది. ది ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్ గత నెలలో ఇచ్చిన డేటా ప్రకారం పరిశ్రమలు మొత్తం 86,999 యూనిట్లను తయారు చేయగా 72,581 యూనిట్ల విక్రయం జరిగింది. వీటిలో 7,852 యూనిట్లను ఎగుమతి చేసింది.

2019 ఆగస్టులో ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం 70,039 యూనిట్లను తయారు చేయగా 44,030 యూనిట్లను విక్రయించింది, అందులో 6,980 యూనిట్లను ఎగుమతి చేసింది. ఫలితంగా, అన్ని ట్రాక్టర్ కంపెనీలు తమ పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను తీర్చలేకపోతున్నాయి.

దీనిపై అక్యూట్ రేటింగ్స్ చీఫ్ ఎనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి మాట్లాడుతూ " గత సంవత్సరంలో జరిగిన ట్రాక్టర్ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో పెరుగుదల చాలా కనిపిస్తుంది. లాక్డౌన్ తరువాత వీటి డిమాండ్ మరింతగా పెరింగింది. ఆర్థిక సంక్షోభంలో కూడా ట్రాక్టర్ అమ్మకాల్లో ఇటువంటి స్థిరమైన పెరుగుదల కనిపించడాన్ని మనం గమనించవచ్చు.”అని అన్నారు.

అంతేకాకుండా, ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెరగడం, వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం, ఎంజిఎన్ఆర్ఈఎస్ కింద బడ్జెట్ కేటాయింపులు పెరగడం వంటి ఇతర అంశాలను డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇండస్ట్రీ ప్లేయర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా మాట్లాడుతూ "జూలైలో నెలతో పాటు ఆగస్టులో కూడా మరిన్ని అమ్మకాలను సాధించాము. ట్రాక్టర్ పరిశ్రమ వృద్ధి ఆగస్టులో బలంగా ఉంది. వచ్చే పండుగ సీజన్లో గ్రామీణ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని మరియు ట్రాక్టర్ డిమాండ్‌లో మరింత వృద్ధి ఉంటుందని మేము ఆశిస్తున్నాము." అని అన్నారు.

కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ గత ఆరు నెలల్లో ట్రాక్టర్ అమ్మకాల్లో భారీ పెరుగుదల కన్పించింది. మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమలో ట్రాక్టర్ అమ్మకాల్లోనే ఈ డిమాండ్ కన్పించిందని ట్రాక్టర్ గ్రాంట్ తోర్న్టన్ భారత్ ఎల్ఎల్పి పార్ట్నర్ శ్రీధర్ అన్నారు. సంమృద్ధిగా వర్షాలు కరవడం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వివిధ విధాన కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం నుండి మద్దతు ఇవ్వడం వంటి చర్యలు ట్రాక్టర్ అమ్మకాలు పెరగడానికి సహాయపడుతాయి.

(Trending Desk)

First published:

Tags: Automobiles, Cars

ఉత్తమ కథలు