భారతదేశం లో జూన్ 2022 లో త్రిచక్ర, ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాల మొత్తం ఉత్పత్తి 2,081,148 యూనిట్లుగా ఉండింది. 2016-26 కాలానికి భారతదేశం వాహనాల ఎగుమతులను ఐదు రెట్లు పెంచాలన్న లక్ష్యం మరియు FY 2022 లో భారతదేశం నుండి వాహనాల ఎగుమతి 5,617,246 యూనిట్ల గా వున్నది. 2023 సంవత్సరం నాటికి వాహన ఉత్పత్తి రంగం US$ 8-10 బిలియన్ల విదేశీ పెట్టుబడులు ఆకర్శించగలదు అని భారత ప్రభుత్వం ఆశిస్తున్నది.
నీతీ ఆయోగ్ మరియు రాఖీ మౌంటెన్ ఇన్స్టిట్యూట్ (RMI) అనుసారం, 2030 నాటికి భారతదేశపు విద్యుత్ వాహన ఫైనాన్స్ పరిశ్రమ 3.7 లక్షల కోట్లు (US $ 50 బిలియన్) కు చేరగలదని , మరియు అదే కాలానికి విద్యుత్ మరియు స్వప్రేరిత వాహనాలకు అవకాశాలు కల్పిస్తూ భారతదేశం పరస్పర చలనశీలత లో నాయకత్వ స్థానం సంపాదించగలదు అని అంచనా.
కార్లు (ద్విచక్ర వాహనాలు కూడా !) మధ్య తరగతి భారతీయునికి ఒకప్పుడు ఒక విలాస చిహ్నం గా భావించే నేపథ్యం లో ఈ సంఖ్యలు విశేషంగా ప్రశంసాయోగ్యం. ఈ పరిస్థితి కేవలం 40 సంవత్సరాల క్రితమే. 1991 వరకు భారతదేశపు వ్యాపార సంస్థలు పరిమిత లైసెన్స్ రాజ్ క్రింద పనిచేసేవి అని గుర్తించుకోవడం ముఖ్యం: 1947 మరియు 1990 మధ్య కాలం లో పరిశ్రమల స్థాపన మరియు వాటి నిర్వహణలకు అవరోధాలైన లైసెన్సులు, నిబంధనలు, మరియు దాని తోడుగా వుండే రెడ్ టేప్ తీవ్రంగా వున్నపాలన.
భారతదేశం లో బీద రైతులను సశక్తికరులను చెయ్యడానికి సమాజవాదాన్ని మార్గం గా చూసిన అప్పటి మేధావుల మానసిక పుత్రి లైసెన్స్ రాజ్. స్వాతంత్రం తరువాత ఈ మేధావులు అధికారం చేపట్టాక లైసెన్స్ రాజ్ విధి విధానాల లోకి సామాజిక ధోరణులు చొరబడ్డాయి. దురదృష్టవశాత్తు ఆచరణ లో లైసెన్స్ రాజ్ ఆర్ధిక ప్రగతి మరియు బీదల అభివృద్ధికి అవరోధం అయింది. జయప్రదంగా భారతీయ వ్యాపార సంస్థలకు కూడా అభివృద్ధి బాటలో పెక్కు అవరోధాలు ఎదురయ్యాయి.
అయినప్పటికీ కొన్ని సంస్థలు వీటిని ఎదురొడ్డి నెగ్గి ప్రజల మనసులలో స్థానం ఏర్పరచుకున్నాయి. ఈ సంస్థలు ఎటువంటి ఉన్నత నాణ్యమైన మరియు అధిక డిమాండ్ లో కలిగిన ఉత్పత్తులు తయారుచేశాయంటే వాటి కొనుగోలు కోసం ప్రజలు ౧౦ సంవత్సరాలు నిరీక్షించే వారు. భారతదేశపు వాహన ఉత్పత్తి రంగం అటువంటి భారీ సంస్థకు పుట్టినిల్లు అయింది.
1970-1990 కాలం లో చలనశీలత అంత తేలికగా ఉండేది కాదు. రాజధాని లో కూడా బస్ సేవలు వేళకు నడిచేవి కావు మరియు జనం తో కిక్కిరిసి ఉండేవి. టాక్సీలు మరియు రిక్షాలు (ఇప్పటికి కూడా!) వారి ఇష్టానుసారం నడిచేవి మరియు చాలా భారతీయ నగరాల లో ఆమోదించిన అధికారిక బాడుగ కంటే చాలా వేరుగా ఉండేవి. అంతే కాకుండా అవి చాలా ఖరీదైనవి. అవి అవిశ్వసనీయము కూడా.
అప్పటి మధ్యతరగతి ప్రజలకు ఒక బజాజ్ చేతక్ వాహనం కలిగివుండడం వారి ఉన్నతమైన ఆకాంక్ష. ప్రస్తుతం 40 దశకం లో వున్నమొత్తం జెనరేషన్ వారికి వారి తండ్రి బజాజ్ చేతక్ వాహనం ఫుట్ స్టాన్డ్ పైన నిల్చుని బడికి వెళ్లడం బాగా గుర్తు.
(బజాజ్ ఆటో ఏ భారతదేశం కి తీసుకొచ్చిన) దిగుమతి చేసుకున్న వెస్పాలు మరియు లాంబ్రెట్టాలు వున్న విపణి లో ౧౯౭౨ లో పరిచయం చేసిన బజాజ్ చేతక్ ప్రజల మనస్సులు చూరగొన్నది. వెస్పా స్ప్రింట్ లాగా రూపొందించబడిన దీనికి మహారణా ప్రతాప్ యొక్క నమ్మకమైన గుర్రం పేరు పెట్టబడింది. స్కూటర్లు కొత్త కాదు కానీ ఈ స్కూటర్ ఒక పెద్ద ఆవిష్కరణ. సప్ప్లై కన్నా డిమాండ్ ఎన్నో రెట్లు అధికంగా వుండింది.
కానీ అప్పుడు లైసెన్స్ రాజ్ ఉండడం వలన బజాజ్ ఆటో కు డిమాండ్ పూర్తి చెయ్యడానికి ఉత్పత్తి పెంచే సావకాశం లేదు. తత్కారణంగా ధరలు రెట్టింపు అయ్యాయి మరియు త్వరలోనే ఒక కొత్త బజాజ్ చేతక్ పొందడానికి ౧౦ సంవత్సరాలు పట్టేది. ప్రజలు ఆగేవారు, ఎందుకంటే బజాజ్ చేతక్ విలువ అటువంటిది కనుక. ఇది అందరికి చవక. ఇది ధృడంగా ఉండేది. కిక్ కొట్టగానే స్టార్ట్ అయ్యేది. ఎవరైనా దానిని బాగుచెయ్యగలిగే వారు. మైలేజ్ బాగుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే, చిత్తశుద్ధి కల సంస్థ యొక్క ఉత్తమ ఉత్పత్తి ఇది.
ఇప్పటివరకూ బజాజ్ ఆటో కు ఇది అత్యంత పెద్ద సఫలం అయినప్పటికీ వాళ్లకి ఈ విధమైన ప్రేరేపణ మొదటిది కాదు. బజాజ్ ఆటో ఒంటరిగానే భారతదేశం లో ద్వి మరియు త్రి చక్ర వాహనాల విప్లవం తీసుకొచ్చింది. ౧౯౪౮ లో వారు దిగుమతి చేసిన వాహనాల అమ్మకం తో ప్రారంభించి ౧౯౫౯ నాటికి ద్వి మరియు త్రి చక్ర వాహనాలు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు . వారి విజయం వారిని 1960 లోకి పరుగుపెట్టించింది. అప్పటికి వారు పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా ఎదిగి తదనంతరం ఒక దశకం తరువాత 1970 లో వారి 1,౦౦,౦౦౦ వ వాహనం ఉత్పత్తి చేశారు. క్రిక్కిరిసిన బస్సులకు 1977 లో ఆవిష్కరించిన వెనుక ఇంజను వుండే ఆటో రిక్షా సుఖప్రదమైన వికల్పముగా అవతరించింది. అంతే కాకుండా ఇది మహిళలు కళాశాలలకు, ఆఫీసులకు లేదా వారి పిల్లలను బడులకు తమంత తామే తీసుకోని వెళ్ళడానికి ఇది సురక్షిత సాధనం అయింది.
అప్పుడు 1991 లో సరళీకరణ వచ్చింది. వారికి దన్ను అయిన ఉత్తమ నాణ్యత, మన్నిక, చవక ధరలలో విశ్వాస భరితమైన వాహనాలు ఆధారంగా బజాజ్ ఆటో అంతర్జాతీయ పోటీ ను ఎదుర్కొన్నది. రూ. 11,845 కోట్ల అమ్మకాల తో దేశపు ద్వి మరియు త్రి చక్ర వాహనాల ఎగుమతులతో 50% కంటే ఎక్కువ పరిమాణం తో నేడు బజాజ్ ఆటో భారతదేశపు వాహనాల ఎగుమతులతో అగ్రస్థానం లో ఉన్నది. FY 2019-20 లో బజాజ్ ఆటో యొక్క వాహన ఉత్పత్తి లో 47$ 79 దేశాలకు ఎగుమతి అయింది.
చాలా విధాలుగా ఇండియా ఇన్క్ ప్రగతి పథానికి బజాజ్ ఆటో ప్రయాణం సమాంతరంగా వున్నది. రెండూ కూడా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని లఘు విజయాలకు దీర్ఘ కాలం అధిక శ్రమ వెచ్చించవలసి వచ్చేది, రెండూ తమ సామర్ధ్యాలు పెంచుకొని మారుతున్న స్థితులకు నిరంతరం సన్నిద్ధం అయ్యేవారు, తత్కారణంగా ఇద్దరూ మరింత పఠిష్టమయ్యారు.
లైసెన్స్ రాజ్ అంతం దాకా నిలబడగలిగిన కొద్ది దేశీయ సంస్థలలో బజాజ్ ఆటో ఒకటి. నిరంతరం తమను తాము నవీకరించుకోవడం మరియు ఉన్నత స్థాయి కి ఎదగడం వైపుగా తమను తాము ప్రేరేపించుకోవడం వారి విజయానికి కొంత కారణం. ఏమైనప్పటికి నాణ్యత బజాజ్ యొక్క ముఖ్య గుణం: నాణ్యమైన ఉత్పత్తి, నాణ్యమైన సేవ మరియు ప్రశ్నించలేని చిత్తశుద్ధి.
ఇటువంటి పఠిష్టమైన పునాది ఏర్పరుచుకోవడం లో 90 దశకపు చివరి భాగం లో వున్న ఆర్ధిక పర్యావరణ బజాజ్ ఆటోకు గొప్పగా సహాయపడింది. చారిత్రాత్మకమైన సరళీకరణ ప్రయత్నం అనంతరం ఉన్నత అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల తో ధీటుకా వుండే ప్రపంచ స్థాయి లో అంగీకారయోగ్యమైన వ్యవస్థను భారతదేశం ఏర్పర్చాల్సిన అవసరం వుండినది. 1996 లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) పురుడుపోసుకుంది, మరియు QCI ఒక సంస్థ గా రూపుదిద్దడానికి GOI మూడు అగ్రగామి పారిశ్రామిక సంస్థలైన ASSOCHAM, FICCI మరియు CII ల తో కలిసి శ్రమించింది.
అంతర్జాతీయ సంస్థల తో మొదటిసారిగా పోటీ పడుతున్న భారతీయ సంస్థలకు ఇది ఇంతకంటే మంచి తరుణం లో వచ్చేది కాదు. పోటీ పటిమ తో బాటూ దేశీయ సంస్థలకు అంతర్జాతీయ స్థాయి నాణ్యత మరియు దక్షత లు నేర్చుకొని మరియు అలవర్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. వెల స్మృతి గల భారతీయ వినియోగదారుడికి ఉన్నపళంగా వికల్పాలు తన్నుకొచ్చాయి, మరియు తమ ఇష్టానుసారం ఎంచుకునే స్థితి ఏర్పడ్డది. మారుతున్న వినియోగదారుల ఇష్టాలకనుగుణంగా మారగలిగిన వేగం కలిగి ఉండడమే కాకుండా నాణ్యత లో అగ్రస్థానం లో నిలబడగలిగే భారతీయ సంస్థలు మాత్రమే ఈ మథనం నిలదొక్కుకున్నవి.
మన ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలకు హామీ ఇస్తూ పలు రంగాలలో ఉత్పత్తులను ధృవీకరిస్తూ గత 25 సంవత్సారాలుగా భారతదేశం లో నాణ్యతా ఉద్యమం రూపుదిద్దడం లో QCI కీలక పాత్ర పోషించింది. ఆకారం అందించడం మరియు వారికి కావలసిన వనరులను అందించడం ద్వారా నాణ్యత, చిత్తశుద్ధి మరియు వినియోగదారుడికి పెద్ద పీట ఇవ్వడం లో భారతీయ సంస్థలకు నూతన ప్రమాణం నిర్ధారించడం లో QCI సహాయపడింది.
భారతీయ సంస్థలు నిరంతరం మరింత ఉన్నత నాణ్యతా ప్రమాణాలు , మెరుగైన పోటీ పటిమ మరియు వినియోగదారుల ఉన్నత విశ్వాసం సాధించే లక్ష్యం దిశగా తద్వారా ప్రపంచ విపణి లో విజయవంతులవడానికి వారిని తయారుచెయ్యడం కోసం భారతదేశపు నాణ్యత ఉద్యమం అయిన గుణవత్థా సే ఆత్మనిర్భరత నిరంతరం శ్రమిస్తోంది. వర్ధిల్లుతున్న ఉత్పత్తి రంగం, సరళీకృత వ్యాపార పర్యావరణం మరియు అభివృద్ధి చెందుతున్నఅవస్థాపన నేపథ్యం లో దేశ వాసుల మనస్సులలోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం లో మన సంస్థలు ఎన్ని ఎదుగుతాయో అన్నది కుతూహలాత్మకమైన విషయం.
QCI మరియు భారతదేశపు గుణవత్థా సే ఆత్మనిర్భరత చొరవ మరియు అది వివిధ కోణాలలో మన జీవితాలపైన చూపిన ప్రభావం గురించి మరింత తెలుసుకోవడానికి https://www.news18.com/qci/ సందర్శించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.