TPG-Reliance Retail deal: రిలయన్స్ రిటైల్‌లో టీపీజీ కంపెనీ రూ.1,837.5 కోట్ల పెట్టుబడులు

TPG-Reliance Retail deal: రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఏడో పెట్టుబడి డీల్ విశేషాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 3, 2020, 8:54 AM IST
TPG-Reliance Retail deal: రిలయన్స్ రిటైల్‌లో టీపీజీ కంపెనీ రూ.1,837.5 కోట్ల పెట్టుబడులు
రిలయన్స్ రిటైల్‌లో టీపీజీ కంపెనీ రూ.1,837.5 కోట్ల పెట్టుబడులు
  • Share this:
TPG-Reliance Retail deal: ప్రపంచ పెట్టుబడుల సంస్థ TPG... రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ సంస్థలో... 0.41 శాతం వాటా పొందుతూ... రూ.1,837.5 కోట్లను పెట్టుబడిగా పెట్టబోతోంది. మూడు వారాల్లో ఇది ఏడో పెట్టుబడి డీల్. తాజా ఏడో డీల్‌తో కలిపి... రిలయన్స్ రిటైల్ ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూ రూ.4.285 లక్షల కోట్లకు చేరిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ గత రాత్రి విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో తెలిపింది. టీపీజీ కంపెనీ... తన టీపీజీ క్యాపిటల ఆసియా ఫండ్ నుంచి ఈ పెట్టుబడి పెట్టనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థల్లో TPG పెడుతున్న రెండో పెట్టుబడి ఇది. ఇంతకు ముందు ఇదే సంస్థ... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన జియో ప్లాట్ఫామ్స్‌లో రూ.4,546.8 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది ఆరంభంలో ఈ డీల్ కుదిరింది.

రిలయన్స్ రిటైల్ ఇప్పటివరకూ... 7.28 శాతం వాటాను కోల్పోయి... అందుకు బదులుగా... రూ.32,197 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. "ప్రపంచ టెక్నాలజీ వ్యాపారాల్లో టీపీజీ ఓ విలువైన భాగస్వామిగా... నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కలిగివుంది. ప్రపంచ టెక్నాలజీ ఇండస్ట్రీ పెద్దల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థతో కలిసి మా ప్రయాణం ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు.

"రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి వాడుకోతగ్గ టెక్నాలజీ ఉంది. రిలయన్స్ రిటైల్ చాలా బలంగా ఉంది. చాలా పద్దతైన సంస్థ. సరికొత్త ఆలోచనలో లీడర్‌గా నిలిచింది. మేం వారితో కలిసి... రిటైల్ ఇండస్ట్రీలో ముందుకు సాగడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈ బిజినెస్ ద్వారా... వ్యాపారులు, వినియోగదారులకు మేలు కలుగుతుంది. రిలయన్స్ రిటైల్ ఓమ్నఛానెల్ ప్లాట్‌ఫామ్ ఎంతో ప్రత్యేకతను చాటుకుంటోంది." అని టీపీజీ సహ సీఈఓ జిమ్ కాల్టెర్ తెలిపారు.

అక్టోబర్ 2న సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ GIC కూడా... రిలయన్స్ రిటైల్‌లో 1.22 వాటా దక్కించుకొని... రూ.5,512.5 కోట్లను పెట్టుబడిగా పెట్టబోతున్నట్లు తెలిపింది. అక్టోబర్ 1న అబూదాబీ స్టేట్ ఫండ్ ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ... రిలయన్స్ రిటైల్‌లో 1.4 శాతం వాటా దక్కించుకొని... రూ.6,247.5 కోట్లను పెట్టుబడిగా పెట్టబోతున్నట్లు ప్రకటించింది. మూడు వారాల్లో 7 డీల్స్ ద్వారా... రిలయన్స్ రిటైల్ ప్రీ మనీ ఈక్విటీ వాల్యూ రూ.4.285 లక్షల కోట్లకు చేరింది.

రిలయన్స్ రిటైల్... ఇండియాలో అతి పెద్ద, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయక వ్యాపార సంస్థ. ఇది దేశంలో 12,000 స్టోర్లతో 64 కోట్ల మందికి చేరువైంది.

టీపీజీ సంస్థను 1992లో 83 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులతో స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ ఈక్విటీ, గ్రోత్ ఈక్విటీ, రియల్ ఎస్టేట్, పబ్లిక్ ఈక్విటీ వంటి కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. తన 30 ఏళ్ల చరిత్రలో ఈ కంపెనీ... వందల కొద్దీ పోర్‌ఫోలియో కంపెనీలను స్థాపించింది. ఇందులో నిపుణులైన ప్రొఫెషనల్స్, కార్యనిర్వాహకులు, సలహాదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టిన ఈ కంపెనీ... తన వర్క్ ఫోర్స్‌తో... మరిన్ని అవకాశాలు వచ్చేలా చేయగలదని తెలుస్తోంది.

Disclosure: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd.
Published by: Krishna Kumar N
First published: October 3, 2020, 8:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading