Toyota Yaris: టయోటా కంపెనీ షాకింగ్​ నిర్ణయం.. భారత్​లో యారిస్ మోడల్​ కార్ల ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేత

yaris

టయోటా భారత్​లో విక్రయిస్తున్న యారిస్ మిడ్-సైజ్ సెడాన్‌ మోడల్​ తయారీ, విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్​ 27 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.

  • Share this:
భారత్​లో నష్టాలు తట్టుకోలేక అనేక విదేశీ ఆటోమొబైల్​ సంస్థలు ఇక్కడ తయారీ, విక్రయ యూనిట్లను మూసివేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫోర్డ్​, హార్లే డేవిడ్సన్​ వంటి ఆటోమొబైల్​ దిగ్గజాలు భారత మార్కెట్​ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే దారిలో మరికొన్ని ఆటోమొబైల్​ సంస్థలు వెళుతున్నాయి. అవి మొత్తం విక్రయాలను నిలిపివేయనప్పటికీ.. ఆదరణ లేని మోడల్స్​ను మాత్రం ఆపేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా చేరింది. టయోటా భారత్​లో విక్రయిస్తున్న యారిస్ మిడ్-సైజ్ సెడాన్‌ మోడల్​ తయారీ, విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్​ 27 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.

SBI Loan Offers: రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు.. అతి తక్కువ వడ్డీకే రుణాలు.. పూర్తి వివరాలివే..!


అయితే ఇప్పటివరకు ఈ కారు కొనుగోలు చేసిన కస్టమర్లకు మాత్రం మరో 10 సంవత్సరాల పాటు సర్వీసులు యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2018 ఏప్రిల్​లో యారిస్​ మోడల్​ను రూ. 9 లక్షల నుంచి రూ. 14 లక్షల మధ్య టయోటా కిర్లోస్కర్​ లాంచ్​ చేసింది. 2019లో ఇందులో మరిన్ని ఫీచర్లు చేర్చి కొత్త మోడల్​ను ఆవిష్కరించింది.

టయోటా యారిస్ కారును హోండా సిటీకి పోటీగా తీసుకొచ్చారు. ప్రీమియం సెడాన్ విభాగంలో హోండా సిటీతో పాటు హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్, స్కోడా రాపిడ్, వోక్స్వాగన్ వెంటోలతో ఈ టయోటా యారిస్ పోటీగా నిలిచింది. కానీ, ఈ కారు మిడ్​సైజ్ సెడాన్ విభాగంలో తన మార్క్ చూపడంలో విఫలమైంది. అందుకే లాంచ్​ చేసిన మూడేళ్లకే విక్రయాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.​

TAC Security: టీఏసీ కంపెనీ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులే పని


ఈ నిర్ణయంపై టయోటా ప్రతినిధి మాట్లాడుతూ ‘‘మా బ్రాండ్‌పై నమ్మకం, మద్దతు ఇచ్చినందుకు మా కస్టమర్లందరికీ కృతజ్ఞతలు. టయోటా యారిస్​ విక్రయాలు నిలివేస్తున్నప్పటికీ.. ఇప్పటికే వాటిని​ కొనుగోలు చేసిన కస్టమర్లందరికీ సర్వీసులు కొనసాగిస్తాం. 2022లో కొత్త టయోటా మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. గ్రీనర్ మొబిలిటీకి ఊతమిచ్చేందుకు, మా ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను రిఫ్రెష్ చేసేందుకు ఇటీవలే క్లీనర్ టెక్నాలజీస్‌లో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం” అని పేర్కొన్నారు. ప్రస్తుతం, టయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, అర్బన్ క్రూయిజర్, గ్లాంజా మోడల్స్​ను భారత్​లో విక్రయిస్తోంది. ఇవి మంచి అమ్మకాలను నమోదు చేశాయి.
Published by:Krishna Adithya
First published: