వ్యాపారంలో ఎవ్వరూ ఓడిపోకూడదనే సూత్రమే అందరికీ లాభదాయకంగా ఉంటుంది. ఈ సూత్రం ఈ రెండు మోటారు కంపెనీల మార్కెట్ స్ట్రాటజీకి చక్కగా సరిపోతుంది. ఇండియాలో మారుతి సుజుకీ (Maruti Suzuki) , టయోటా (Toyota) భాగస్వామ్యం గురించి తెలిసిన విషయమే. భారతదేశంలో కొనుగోలు చేసే టయోటా గ్లాంజా, టయోటా అర్బన్ క్రూజర్ ఇప్పటికే మారుతి సుజుకీ కంపెనీలోనే తయారయ్యి, ఇండియా మార్కెట్లో అమ్ముడు పోతున్నాయి. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో ఇప్పటికే మారుతి సుజుకి బలెనో, టయోటా గ్లాంజా ఒకే ఇంజిన్‌తో తయారుచేస్తున్నారు. అయితే, ఇప్పుడు త్వరలో రాబోయే టయోటా సిడన్ కూడా మారుతీ సుజుకీ సియాజ్‌లో ఉన్న 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో నడవనున్నట్లు సమాచారం ఉంది.
అసలు వివరాల్లోకి వెళితే, భారతదేశంలో యారిస్ సిడన్ కారును ఆపేయాలనే నిర్ణయాన్ని టయోటా ఇండియా పరిగణించింది. వాహన తయారీదారులు పోర్ట్‌ఫోలియోలో చోటు సంపాదించడానికి మారుతి సుజుకీ సియాజ్ లాంటి వెర్షన్‌లో తమ బ్యాడ్జ్‌తో టాయోటా సిడన్‌ను తయారుచేయడానికి టాయోటా సిద్ధపడింది. మారుతి సుజుకీ బలెనో, మారుతి సుజుకీ వైటరా బ్రెజ్జా లాగానే ఇది కూడా ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో చేస్తున్న మార్పుగా చెప్పొచ్చు.
ఈ రీమోడలింగ్ పైన రెండు కంపెనీలు ఏలాంటి సమాచారం ఇచ్చినప్పటికీ, మనకు తెలిసిన సమాచారం మేరకు, టయోటా కంపెనీ బ్యాడ్జ్ తో మార్కెట్లోకి వస్తున్న మారుతి సుజుకీ సియాజ్, అంటే టయోటా సిడన్‌లో, చిన్న చిన్న కాస్మటిక్ మార్పులు మాత్రమే జరిగాయని తెలుస్తుంది. నిజానికిది రీబ్యాడ్జింగ్ (Re-badging)కనుక, అలాగే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, సిడన్‌కు కొత్తపేరు కూడా పెట్టే అవకాశం లేకపోలేదు. ఇందులో మార్పులు చేసినవి, తగ్గించినవి చాలా తక్కువగానే కనిపిస్తాయి. అలాగే మెరుగైన స్టాండర్డ్ వారంటీ ఉండొచ్చు.
ఇండియాలో మారుతి సుజుకీ సియాజ్‌ను ఎక్కడ తయారుచేస్తున్నారో అక్కడే టయోటా సిడన్‌ని కూడా తయారుచేయబోతున్నారు. ఈ క్రమంలోనే రాబోయో టయోటా సిడన్ 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పవర్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 103 బిహెచ్‌పి అవుట్‌పుట్‌తో పనిచేస్తుంది. దీనిలో అధిక టార్క్ 138 ఎన్ ఎమ్. ఇక రాబోయే ట్రాన్స్‌మిషన్ (Transmission) ఆప్షన్లు చూస్తే, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, 4-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ మధ్య ఉన్న అదే ఛాయిస్‌ని టయోటా ఆఫర్ చేయనుంది.