Home /News /business /

Toyota X-Prologue: త్వరలో టొయోటా మొదటి విద్యుత్ కారు ఎక్స్-ప్రోలాగ్ లాంఛ్.. ఫీచర్లు ఇవే..

Toyota X-Prologue: త్వరలో టొయోటా మొదటి విద్యుత్ కారు ఎక్స్-ప్రోలాగ్ లాంఛ్.. ఫీచర్లు ఇవే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

జపాన్ వాహన తయారీ సంస్థ టొయోటా విద్యుత్తు కార్లను తయారు చేస్తోంది. వాటిని విశ్వవ్యాప్తంగా అందించాలనే లక్ష్యంతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. అదే ఎక్స్-ప్రోలాగ్. ఈ విద్యుత్ వాహనం మార్చి 17న లాంఛ్ చేయనుంది.

పర్యావరణ కాలుష్యం గురించి రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. మితిమీరిన కర్బన ఉద్గారాల విడుదల వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను నియంత్రించేందుకు ఆటో పరిశ్రమ తీవ్రంగా కృషిచేస్తోంది. ఇందుకోసమే భవిష్యత్తు తరపు కార్ల అభివృద్ధికి చురుకుగా పావులు కదుపుతున్నాయి కొన్ని వాహన సంస్థలు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసి విశ్వవ్యాప్తంగా అందజేయడం వారి ముందున్న అతిపెద్ద సవాలు. ఇది దృష్టిలో ఉంచుకునే జపాన్ వాహన తయారీ సంస్థ టొయోటా విద్యుత్తు కార్లను తయారు చేస్తోంది. వాటిని విశ్వవ్యాప్తంగా అందించాలనే లక్ష్యంతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. అదే ఎక్స్-ప్రోలాగ్. ఈ విద్యుత్ వాహనం మార్చి 17న లాంఛ్ అయ్యింది.

ఇటీవలే ఈ కారు ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది టొయోటా. సీ-ఆకారంలో ఎల్ఈడీ లైట్లతో ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది ఎక్స్-ప్రోలాగ్ కారు. అంతేకాకుండా ఎంతో క్లాసీ లుక్ తో ఉండి వాహన ప్రియుల మనసు దోచుకుంటోంది. లార్జ్ క్రాస్ ఓవర్లను కలిగి ఉండి మిని వ్యానులా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ ఈ కారుకు సంబంధించిన వేరియంట్లు, ఫీచర్లు లాంటి మరిన్ని వివరాలను లాంచ్ రోజున బహిర్గతపరచనుందీ జపాన్ ఆటోమేకర్. ఫ్రంట్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ సపోర్ట్ ఇందులో ఉంది. వైవిధ్యమైన బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికత, ప్రత్యేకతలను పొందుపరిచిన ఈ వాహన చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది.

ఈ సరికొత్త టొయోటా ఎక్స్-ప్రోలాగ్ సంబంధించిన ఇంతకు మించిన వివరాలను కంపెనీ బహిర్గత పరచలేదు. విశ్వవ్యాప్తంగా ఈ వాహనాన్ని ఆవిష్కరించిన తర్వాత దీనికి సంబంధించిన ప్రత్యేకతలు, ఫీచర్లు తెలుస్తాయి. ప్రస్తుతానికి ఈ కారును ఐరోపాలోనే మాత్రమే విక్రయానికి ఉంచనుంది టొయోటా సంస్థ. దీంతో పాటు జపాన్ లో తయారు చేయనుండటం వల్ల ఆ దేశంలోనూ లాంఛ్ అయ్యే అవకాశముంది. భారత్ లో ఎప్పుడు లాంఛ్ అవుతుందన్న విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. దీనిపై కంపెనీయే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ వాహనం టొయోటాకు చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకోనుంది. అత్యాధునిక సాంకేతికతను ఇందులో పొందుపరచడంతో పాటు, డిజైన్, ఎలక్ట్రిక్ మోటార్, ఛార్జింగ్ లాంటి విషయాల్లో కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా పర్యావరణ హితంగా రూపొందించినట్లు తెలుస్తోంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Cars

తదుపరి వార్తలు