Home /News /business /

TOYOTA OFFERING YEAR END DISCOUNTS OF UPTO RS 50000 ON SELECT MODELS IN INDIA HERE ARE THE DETAILS MK GH

Toyota Year-End sale: కొత్త కారు కొంటున్నారా..Toyota కార్లపై రూ.50 వేల దాకా డిస్కౌంట్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కరోనాతో మందగించిన అమ్మకాలను పునరుద్ధరించడానికి, తమ స్టాక్ క్లియర్ చేసుకోవడానికి దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు ఈ నెలాఖరు వరకు ‘ఇయర్ ఎండ్ సేల్’ను నిర్వహిస్తున్నాయి.

కరోనాతో మందగించిన అమ్మకాలను పునరుద్ధరించడానికి, తమ స్టాక్ క్లియర్ చేసుకోవడానికి దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు ఈ నెలాఖరు వరకు ‘ఇయర్ ఎండ్ సేల్’ను నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగానే జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా(Toyota) కూడా తమ స్టాక్ క్లియర్ చేసుకోవడానికి ‘ఇయర్ ఎండ్ సేల్’తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే తమ ఉత్పత్తులపై నగదు తగ్గింపు(cash discounts), ఎక్స్ఛేంజ్ బోనస్(exchange bonus), కార్పొరేట్ డిస్కౌంట్ల(corporate discounts )ను అందిస్తోంది. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్లన్నీ ఈ నెలాఖరు (డిసెంబర్ 31) వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

టయోటా కార్లపై లభించే డిస్కౌంట్ల వివరాలు...

టయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

‘ఇయర్ ఎండ్ సేల్’లో భాగంగా అర్భన్ క్రూయిజర్ కారుపై ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌ను ప్రకటించింది టయోటా కంపెనీ. ఈ కారు కొనుగోలుపై మొత్తం రూ .20,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ .15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .5 వేల విలువైన అడిషనల్ కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. కాగా, భారత మార్కెట్లో అర్భన్ క్రూయిజర్ కారు రూ .8.40 లక్షల నుండి 11.30 లక్షల మధ్య లభిస్తుంది.

టయోటా గ్లాంజా (Toyota Glanza)

టయోటా గ్లాంజా కొనుగోలుపై మొత్తం రూ .30,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ .10,000 క్యాష్ డిస్కౌంట్(cash discounts), రూ .15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5,000 అడిషనల్ కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. కాగా, భారత మార్కెట్లో దీని ధర 7.01 లక్షల నుండి 8.96 లక్షల మధ్య ఉంది.

టయోటా యారిస్ (Toyota Yaris)

టయోటా యారిస్ కొనుగోలుపై మొత్తం రూ .50 వేల బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ .20,000 క్యాష్ డిస్కౌంట్(cash discounts), రూ.15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, అడిషనల్ కార్పొరేట్ డిస్కౌంట్లను పొందవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాక, ఆయా కార్ల డీలర్ల నిర్ణయానికి అనుగుణంగానే డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. కాగా, టయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్(Innova Crysta Facelift), ఫార్చ్యూనర్(Fortuner), కేమ్రీ హైబ్రిడ్(Camry Hybrid) మోడళ్ల కొనుగోలుపై ఎటువంటి డిస్కౌంట్లు లభించవు.
Published by:Krishna Adithya
First published:

Tags: Automobiles, CAR, Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు