Mirai Car | మార్కెట్‌లోకి కొత్త కొత్త కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఆటో ఎక్స్‌పో 2023లో కంపెనీలు పలు రకాలా కొత్త మోడళ్లను ఆవిష్కరించాయి. వీటిల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicle) ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైక్స్ (Electric Bike), ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు ఇలా చాలా వాటిని ఆవిష్కరించాయి. అయితే వీటిల్లో ఒక కారు మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అదే 2 ఇన్ 1 కారు. అదేంటని అనుకుంటున్నారా? ఈ కారు అటు బ్యాటరీతో, ఇటు హైడ్రోజన్ గ్యాస్‌తో నడుస్తుంది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా ఈ కారును లాంచ్ చేసింది .ఈ కారు పేరు మిరాయ్. ఇది హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ వెహికల్. ఈ కారు అంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి కూడా చాలా ఇష్టం. ఒక్కసారి ఈ కారును హైడ్రోజన్ గ్యాస్‌తో ట్యాంక్ ఫుల్ చేస్తే.. ఏకంగా 640 కిలోమీటర్లు వెళ్తుంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద కంపెనీ ఈ కారును దేశీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ కారు ద్వారా ఒక్క రూపాయి ఖర్చుతో ఒక కిలోమీటర్ వెళ్లొచ్చు.
బంగారం కొనే వారికి భారీ షాక్.. ఈ విషయం తెలిస్తే వామ్మో అనాల్సిందే!
కారులో హైడ్రోజన్ ట్యాంక్ ఉంటుంది. ఇందులోనే ఆక్సిజన్, హైడ్రోజన్ చర్య జరుగుతుంది. తద్వారా ఎనర్జీ జరేట్ అవుతుంది. దీని ద్వారా కారు పరుగులు పెడుతుంది. అదేసమయంలో అదనపు ఎనర్జీ అనేది బ్యాటరీ రూపంలో స్టోర్ అవుతుంది. కారులో మూడు హైడ్రోజన్ ట్యాంక్స్ ఉంటాయి. కేవలం 5 నిమిషాల్లోనే వీటిని ఫుల్ చేసుకోవచ్చు. అలాగే ఈ కారులో 1.24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
రూ.400తో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వెళ్లొచ్చు.. ఎలక్ట్రిక్ బైక్ అదిరింది!
టయోటా మిరాయ్‌లో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీని పవర్ 182 బీహెచ్‌పీ. అలాగే టార్క్ 300 ఎన్ఎం. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9.2 సెకన్లలోనే అందుకుంటుంది. టయోటా న్యూ గ్లోబల్ అర్కిటక్చర్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని తయారు చేశారు. ఇది కూపే స్టైల్ సెడాన్ కారు. దీని పొడవు 4.9 మీటర్లు. ఇందులో 20 ఇంచుల వీల, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పానోరమిక్ వ్యూ మానిటర్, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, వైర్‌లెస్ చార్జర్, పానోరమిక్ సర్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, టయోటా టీమ్‌మెట్ సాఫ్ట్‌వేర్ వంటి పలు రకాల పీచర్లు ఉన్నాయి. కేవలం ఈ కారు మాత్రమే కాకుండా టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించాయి. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే అని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Bikes, Electric cars, Electric Scooter, Electric Vehicles, Toyota