జపనీస్ కార్ బ్రాండ్ టయోటా(Toyota) కిర్లోస్కర్ తన మొట్టమొదటి లైఫ్ స్టైల్ పికప్ ట్రక్కు హిలక్స్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. మల్టీ యుటిలిటీ (ఎంయూవీ) విభాగంలో తీసుకొచ్చిన ఈ వాహనాన్ని ప్యాసింజర్(Passenger), గూడ్స్ వెహికిల్‌గా(Goods Vehicle) అన్ని రకాల పనులకు ఉపయోగించుకోవచ్చు. అడ్వెంచర్(Adventure), లగ్జరీ సౌకర్యాలను అందిస్తున్న ఈ ఎస్యూవీ వాహనాన్ని టయోటా ఫార్చ్యునర్ మాదిరిగా డిజైన్ చేసింది. టయోటా హిలక్స్(Hilux) రెండు వరుసల సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. వస్తువులను లోడ్ చేయడానికి ప్రత్యేక బాక్స్‌ను కూడా దీనిలో అమర్చారు. కాగా, టయోటా హిలక్స్ ప్రీ-బుకింగ్‌లు(Free Booking) ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
భారతదేశంలోని అన్ని టయోటా అధీకృత డీలర్‌షిప్ సెంటర్లలో రూ.1 లక్ష అడ్వాన్స్ చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో రూ. 50,000 చెల్లించి ణు ప్రీ-బుక్ చేయవచ్చు. అయితే వీటి డెలివరీలు మాత్రం ఏప్రిల్ 2022లో ప్రారంభం కానున్నాయి. టయోటా హిలక్స్ ట్రక్కు ధరను మాత్రం కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఆన్లైన్లో లీకైన వివరాల ప్రకారం, హిలక్స్ ట్రక్కు ధర రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ట్రక్కు ఇసుజు డీ మాక్స్, విక్రాస్ ట్రక్కులతో పోటీ పడనుంది.
ఈ ట్రక్కు మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. హిలక్స్, హిలక్స్ రియో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇక, హిలక్స్ ట్రక్కు మొత్తం 5 కలర్ వేరియంట్లలో లభిస్తుంది. పెర్ల్ వైట్, సూపర్ వైట్, ఎమరాల్డ్ రెడ్, గ్రే మెటాలిక్, సిల్వర్ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రక్కు తయారీలో కావాల్సిన కొన్ని విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దేశీయంగా కర్ణాటకలోని బిదాడీ యూనిట్లో అసెంబ్లింగ్ చేస్తారని సమాచారం.
టయోటా ఎంయూవీ హిలక్స్ ఫీచర్లు..
టయోటా ఫార్చ్యునర్ మాదిరిగానే ఈ వాహనంలో 2.8- లీటర్ నాలుగు సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్లను ఉపయోగించింది. ఆటోమేటిక్ ట్రిమ్‌లో 204 బీహెచ్పీ వద్ద 500 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, మాన్యువల్ ట్రిమ్‌లో 204 బీహెచ్పీ వద్ద 420 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ఈ ఇంజిన్ ఫోర్ వీలర్ డ్రైవ్‌తో వస్తుంది. దీనిలో 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్‌లను కూడా అమర్చింది. హిలక్స్ ట్రక్కును ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యునర్లకు సుపరిచితమైన ఐఎంవీ–2 ఆధారంగా డిజైన్ చేశారు.
దీనిలో18- అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌ల్యాంప్‌లను అందించింది. మరోవైపు, ఏడు ఎయిర్ బ్యాగ్‌లతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను చేర్చింది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి ఫీచర్లను కూడా అందించింది. టయోటా హిలక్స్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ (EDL), ఆటోమేటిక్ హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), డౌన్‌హిల్ అసిస్ట్ కంట్రోల్ (DAC), ఆటోమేటిక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ (ALSD) ఫీచర్లతో వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.