Hyryder Car | మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా తాజాగా హైరైడర్ మోడల్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను (Car) మార్కెట్‌లో లాంచ్ చేసింది. హైరైడర్ ఎస్‌యూవీని (SUV) పాపులర్ అర్బన్ క్రూయిజర్‌గా చెప్పుకుంటారు. కంపెనీ ఇప్పుడు ఇందులో సీఎన్‌జీ మోడల్ తెచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 13.23 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇప్పటి వరకు టయోటా హైరైడర్ మోడల్‌లో పెట్రోల్ వేరియంట్ మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండేది.
టయోటా హైరైడర్ సీఎన్‌జీ కారు రెండు ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఒకటేమో ఎస్ ట్రీమ్. దీని ధర రూ. 13.23 లక్షలు. అలాగే జీ ట్రిమ్ కూడా ఉంది. దీని రేటు రూ. 15.29 లక్షలుగా ఉంది. ఇవ్వన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. ఈ రెండు వేరియంట్లు కేవలం మ్యానువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లోనే లభిస్తున్నాయి.
అదిరిపోయే లుక్‌తో హీరో కొత్త స్కూటర్.. ధర తక్కువ, ఫీచర్లు సూపర్!
టయోటా ఈ కొత్త సీఎన్‌జీ వేరియంట్‌లో 1.5 లీటర్ కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ కారు కేజీకి 26.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. మారుతీ గ్రాండ్ విటారా తర్వాత దేశీ మార్కెట్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ రూపంలో లభిస్తున్న రెండో కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇదే కావడం గమనార్హం. సీఎన్‌జీ అనేది చాలా మంది కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆప్షన్. పెట్రోల్ ఖర్చులు భరించలేమని భావించే వారు సీఎన్‌పీ కార్లను పరిశీలించొచ్చు.
బజాజ్ ఫిన్‌సర్వ్ దారిలో మరో ఫైనాన్స్ కంపెనీ.. కస్టమర్లకు గుడ్ న్యూస్!
దేశంలోనే అదిపెద్ద కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతూ వస్తున్న మారుతీ సుజుకీ ఇప్పటికే పలు మోడళ్లలో సీఎన్‌జీ వేరియంట్లను కస్టమర్లకు అందిస్తోంది. అలాగే హ్యుందాయ్ కూడా సీఎన్‌జీ కార్లను అందుబాటులో ఉంచింది. అలాగే టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు కూడా సీఎన్‌జీ వేరియంట్లను అందిస్తున్నాయి. అయితే ఇవి తక్కువ. ఈ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువగా ఫోకస్ చేశాయి.
హైరైడర్ సీఎన్‌జీ కారులో 17 ఇంచుల అలాయ్ వీల్స్ ఉంటాయి. 9 ఇంచుల స్మార్ట్ ప్లేకాస్ట్ టచ్ స్క్రీన్ ఆడియో, ఆరు ఎయిర్ బ్యాగ్స్, క్రూయిజ్ కంట్రోల్, టయోటా ఐ కనెక్ట్ టెక్నాలజీ వంటివి ఈ కారులో ఉన్నాయి. సీఎన్‌జీ కార్లు పర్యావరణ అనుకూలమని చెప్పుకోవచ్చు. టయోటా హైరైడర్‌కు కేవలం ఒక్క మోడల్ నుంచే పోటీ ఉంది. అదే మారతీ గ్రాండ్ విటారా. ఇక పెట్రోల్ వేరియంట్ అయితే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషక్, ఫోక్స్‌వ్యాగన్ తైగూన్, ఎంజీ అస్టార్ వంటి మోడళ్లకు పోటీ ఇస్తోంది. ఇకపోతే హైరైడర్ సీఎన్‌జీ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కంపెనీ వెబ్‌సైట్‌లోకి బుక్ చేసుకోవచ్చు. లేదంటే టయోటా డీలర్‌షిప్స్ వద్దకు వెళ్లి కారు బుక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Cars, Toyota