Toyota Hilux Price | కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వారికి తీపికబురు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న టయోటా అదిరిపోయే శుభవార్త అందించింది. కార్ల (Cars) ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల కొత్తగా టయోటా కారు కొనే వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కంపెనీ కేవలం ఒకే ఒక్క మోడల్ ధరను తగ్గించేసింది. టాయోటా (Toyota) హిలక్స్ స్టాండర్డ్ ఎంటీ ధరను రూ. 3.59 లక్షలు తగ్గిస్తున్నట్లు కంపెనీ వెల్లడిచింది. దీంతో ఇప్పుడు ఈ కారు దర రూ. 30.40 లక్షలకు దిగి వచ్చింది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర.
టాయోటా కంపెనీ ఈ హిలక్స్ స్టాండర్డ్ ధరను తగ్గించినట్లుగానే తగ్గించి.. మరో రెండు వేరియంట్ల ధరను మాత్రం పెంచేసింది. హై ఎంటీ ధర రూ. 1.35 లక్షలు పెరిగింది. ఇంకా హై ఏటీ వేరియంట్ ధర రూ. 1.1 లక్షలు పైకి కదిలింది. అంటే కంపెనీ ఒక వేరియంట్ ధరను భారీగా తగ్గిస్తే.. ఇతర వేరియంట్ల ధరను మాత్రం పెంచేసిందని చెప్పుకోవచ్చు.
150 కి.మి రేంజ్, బడ్జెట్ ధరలో లభించే 8 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర రూ.59 వేల నుంచి..
టయోటా హిలక్స్ మోడల్ ఫార్చునర్ కన్నా తక్కువ డిమాండ్ కలిగి ఉందని చెప్పుకోవచ్చు. దేశంలో ఈ పికప్ ట్రక్ 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. దీని పరవ్ 201 బీహెచ్‌పీ, 500 ఎన్ఎంగా ఉంది. ఇందులో ఆరు గేర్లు ఉంటాయి. మ్యానువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఇది లభిస్తోంది. అలాగే ఈ కారులో ఫోర్ వీల్ డ్రైవ్ ఫీచర్ ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.
వచ్చే వారం బ్యాంకులకు 2 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడు పనిచేయవంటే?
లైఫ్‌స్టైల్ యుటిలిటీ వెహికల్‌గా కొనసాగుతూ వస్తున్న టయోటా హిలక్స్‌లో అదిరే ఫీచర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపి కార్ ప్లే కనెక్టివిటీ, వెంటిలేటెడ్ సీట్స్, 8 వే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో 7 ఎయిర్ బ్యాగ్స్, రియర్ వ్యూ కెమెరా, వీఎస్‌సీ, ట్రాక్షన్ కంట్రోల్, వేరబుల్ ఫ్లో కంట్రోల్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. టయోటా హిలక్స్ ఎక్స్‌షోరూమ్ ధరలను గమనిస్తే.. స్టాండర్డ్ ఎం ధర రూ. 30.40 లక్షలు ఉంది. హై ఎంటీ వేరియంట్ ధర రూ. 37.15 లక్షలుగా ఉంటుంది. అలాగే హై ఏటీ ధర రూ. 37.9 లక్షలుగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Cars, Toyota