ఇంధన ధరల ప్రభావంతో సీఎన్జీ వెహికల్స్‌ను కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో అన్ని కంపెనీలు పాత మోడళ్లను CNG ఇంజిన్లతో అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. తాజాగా మార్కెట్లోకి సరికొత్త గ్లాంజా సీఎన్జీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది టొయోటా ఇండియా. ఈ కంపెనీ కొన్ని నెలల క్రితమే ఇండియన్ మార్కెట్లోకి పెట్రోల్-ఓన్లీ గ్లాంజా (Petrol Only Glanza) హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా గ్లాంజా CNG వెర్షన్ కార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ నుంచి రిలీజ్ అయిన మొట్టమొదటి CNG వెర్షన్ ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ.8.43 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుంచి ప్రారంభమవుతుంది.
ఇండియాలోని అన్ని కంపెనీ అథరైజ్డ్ డీలర్‌షిప్‌లలో టొయోటా గ్లాంజా CNG బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కార్ మిడ్ లెవల్ S, G గ్రేడ్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. మారుతి సుజుకి బ్రెజ్జాకు టొయోటా వేరియంట్ అయిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో కూడా CNG వేరియంట్‌ను లాంచ్ చేయనున్నట్లు టొయోటా స్పష్టం చేసింది.
IRCTC Konark Tour: కోణార్క్ ఫెస్టివల్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
పెట్రోల్-ఓన్లీ గ్లాంజాలోని 1197 cc K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌తో గ్లాంజా CNG వెర్షన్ వస్తుంది. ఇది 76 బీహెచ్పీ పవర్ అవుట్‌పుట్‌ని అందిస్తుంది. కిలోమీటరుకు 30.61 కిమీ మైలేజీని ఇస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లింక్ అయి ఉంటుంది. CNG వేరియంట్లో స్టాండర్డ్ పెట్రోల్ మోడల్లో ఉండే ఐడియల్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్ అందుబాటులో లేదు.
టొయోటా గ్లాంజా CNG ధర స్టాండర్డ్ పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే దాదాపు రూ.90,000 ఎక్కువగా ఉంది. లేటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్, ఫీచర్లలో ఎటువంటి అప్డేట్లు ఉండవు. పెట్రోల్-ఓన్లీ గ్లాంజా తరహాలోనే ఉంటుంది. టొయోటా గ్లాంజా CNG, గత వారం ఇండియాలో లాంచ్ అయిన మారుతి సుజుకి బాలెనో CNG నుంచి పోటీ ఎదుర్కోనుంది.
OTT Mobile Plans: మొబైల్ ఓన్లీ ప్లాన్స్ అందిస్తున్న అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్
మారుతి సుజుకి బాలెనోతో పోలిస్తే కొత్త గ్లాంజా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది కొత్త గ్రిల్‌తో టొయోటా ఫ్యామిలీలా కనిపిస్తుంది. టొయోటా హెడ్‌ల్యాంప్‌లను కూడా అప్డేట్ చేసింది. గ్లాంజా హెడ్‌ల్యాంప్‌లు L-షేప్డ్ DRLలతో వస్తాయి. టొయోటా గ్లాంజాకు కొత్త అల్లాయ్ వీల్స్‌ను కూడా యాడ్ చేసింది. గ్లాంజా వెనుక భాగంలో బాలెనో తరహాలోనే కొత్త స్ప్లిట్ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో గ్లాంజా, బాలెనోతో సమానంగా ఉంటుంది.
గ్లాంజా కారు డ్యుయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, సీట్స్‌తో వస్తుంది. కొత్త క్లైమెట్ కంట్రోల్ స్విచెస్ కూడా అందుబాటులో ఉంటాయి. కొత్త గ్లాంజా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై టూ అనలాగ్ డయల్స్, ఒక MIDని అందిస్తుది. హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. 9.0-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి స్పెసిఫికేషన్లు దీని సొంతం. దీంట్లోని కొత్త సిస్టమ్ స్మార్ట్‌వాచ్‌కి కూడా కనెక్ట్ అవుతుంది.
SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్... మీకు ఆ మెసేజ్ వస్తే జాగ్రత్త
ఈ సందర్భంగా TKM సేల్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అతుల్ సూద్ మీడియాతో మాట్లాడారు. గ్లాంజా CNG వెర్షన్‌ను లాంచ్ చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అయిన TKM, కస్టమర్ ఆసక్తికి మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కస్టమర్ల ఆలోచనలపై స్పష్టమైన అవగాహనతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడమే టొయోటాలో తమ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Cars, CNG, Toyota, Toyota Glanza