Home /News /business /

Toyota Fortuner Legender: టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ మోడల్​పై ఎంత ధర పెరిగిందంటే...

Toyota Fortuner Legender: టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ మోడల్​పై ఎంత ధర పెరిగిందంటే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపుకి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, ఇసుజి, హీరో మోటోకార్స్ వంటి దిగ్జజ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచగా.. ఇప్పుడు ఈ జాబితాలో జపనీస్​ కార్​ బ్రాండ్​ టయోటా కిర్లోస్కర్​ మోటార్స్​ కూడా చేరింది.

ఇంకా చదవండి ...
వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపుకి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, ఇసుజి, హీరో మోటోకార్స్ వంటి దిగ్జజ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచగా.. ఇప్పుడు ఈ జాబితాలో జపనీస్​ కార్​ బ్రాండ్​ టయోటా కిర్లోస్కర్​ మోటార్స్​ కూడా చేరింది. ఏప్రిల్​ 1 నుంచి తమ వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. పెరుగుతున్న ఇన్​ పుట్​ ఖర్చులే ఈ పెంపుకు ప్రధాన కారణమని టయోటా స్పష్టం చేసింది. టయోటా జనవరిలో భారత మార్కెట్​లోకి విడుదల చేసిన ఫార్చ్యూనర్ లెజెండర్ ధరను భారీగా పెంచేసింది. రూ. 37.58 లక్షలుగా ఉండే, ఈ మోడల్​ను రూ. 38.30 లక్షల(ఎక్స్​షోరూమ్​)కు పెంచేసింది. అంటే దీని ధర అమాంతం రూ. 72 వేలు పెరిగిందని చెప్పవచ్చు. కాగా, లాంఛ్​ అయిన కేవలం మూడు నెలల్లోనే దీని ధరను పెంచడం టయోటా ప్రియులకు నిరాశ కలిగించే అంశమనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ, ఏప్రిల్​ 1 నుంచి ఫార్చ్యూనర్ లెజండర్ ఇప్పుడు రూ. 38.30 లక్షలు (ఎక్స్‌షోరూమ్, న్యూ ఢిల్లీ)లకు లభించనుంది. కాగా, ఈ మోడల్​ భారత మార్కెట్​లో విడుదలైన కొద్ది రోజుల్లోనే అనై విపరీతమైన బుకింగ్స్​ సాధించింది.

అద్భుతమైన ఫీచర్లను అందించడమే దీని క్రేజ్​కు ప్రధాన కారణం. దీంతో ధర పెంచినా సరే.. వినియోగదారుల నుంచి ఏమాత్రం డిమాండ్ తగ్గదని కంపెనీ భావిస్తోంది. ఇక, ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 2.8 ఎల్, టర్బోచార్డ్జ్​, ఇన్​లైన్​ -4 డీజిల్ ఇంజిన్​ని అందించింది. ఇది గరిష్టంగా 204 పిఎస్, 500 ఎన్ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఫార్చ్యూనర్ లెజెండర్ 6 -స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. దీని వెనుక వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌ను కూడా అందించింది. ఫార్చ్యూనర్ శ్రేణిలో టాప్-స్పెక్ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ, దానిలో 4- వీల్-డ్రైవ్ ఆప్షన్​ మాత్రం లభించదు. ఈ 4 వీల్ డ్రైవ్ ఆప్షన్​​ కేవలం స్టాండర్డ్​ ఫార్చ్యూనర్‌ డీజిల్​ వెర్షన్​లో మాత్రమే లభిస్తుంది.

రెగ్యులర్​ ఫార్చ్యూనర్‌ వేరియంట్​తో పోలిస్తే లెజెండర్​ బాహ్య రూపకల్పనలో కొన్ని తేడాలు ఉన్నాయి. లెజెండర్​ వేరియంట్​లో ఫ్రంట్ ఫాసియా, ఫుల్​ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌లను చేర్చారు. అంతేకాక, దీనిలో ఇంటిగ్రేటెడ్ DRL లతో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లను కూడా అందించారు. ఈ LED హెడ్‌ల్యాంప్‌లు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. కారు వెనుక అందించిన బంపర్ కూడా భిన్నంగా ఇతర మోడళ్లకు భిన్నంగా ఉంటుంది. దీనిలో 18 -అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్​ను అందించింది. టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వేరియంట్​లో స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, యుఎస్‌బి పోర్ట్, గెస్చర్​ ఆపరేటెడ్​ టెయిల్‌గేట్‌ వంటి ఆకర్షనీయమైన కనెక్టింగ్​ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

అంతేకాక, దీనిలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, వెంటిలేటెడ్, పవర్- అడ్జెస్టెడ్​ ఫ్రంట్ సీట్లు, స్టార్ట్/ స్టాప్ పుష్ -బటన్, కూల్డ్ గ్లోవ్‌ బాక్స్, హైట్ సర్దుబాటుతో వచ్చే మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ వంటి అద్భుతమైన ఫీచర్స్​ను అందించింది. ఇక, సేఫ్టీ పరంగా చూస్తే.. దీనిలో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఆటో ఎమర్జెన్సీ అన్‌లాక్‌తో కూడిన స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఎమర్జెన్సీ బ్రేక్ సిగ్నల్ వంటి ఫీచర్లను చేర్చింది. అయితే, ఈ కారులో సన్​రూఫ్​ ఫీచర్​ను మాత్రం చేర్చకపోవడం కొంత ప్రతికూల అంశంగానే చెప్పవచ్చు. భారత మార్కెట్లో, టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఒకే కలర్​ ఆప్షన్​లో లభిస్తుంది.- బ్లాక్ రూఫ్​తో కూడిన వైట్ పెర్ల్ క్రిస్టల్ షైన్ కలర్​లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు