Toyota cars: దసరా పండుగకు కొత్త కారు కొంటున్నారా...అయితే టయోటా కార్లపై ప్రత్యేక ఆఫర్లు

ఉద్యోగాలు చేసేవారికోసం టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు స్పెషల్ ఆఫర్లను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. సులభమైన కొనుగోలు పద్ధతులు, ఫైనాన్స్ ఆప్షన్ల ద్వారా టయోటా కార్లను సొంతం చేసుకోవచ్చు.

news18-telugu
Updated: October 17, 2020, 11:49 PM IST
Toyota cars: దసరా పండుగకు కొత్త కారు కొంటున్నారా...అయితే టయోటా కార్లపై ప్రత్యేక ఆఫర్లు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఉద్యోగాలు చేసేవారికోసం టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు స్పెషల్ ఆఫర్లను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. సులభమైన కొనుగోలు పద్ధతులు, ఫైనాన్స్ ఆప్షన్ల ద్వారా టయోటా కార్లను సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా కస్టమర్లు టయోటా అందించే మూడు నెలల EMI హాలిడే ఆఫర్ ను కూడా పొందవచ్చు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్యాష్ ప్యాకేజ్ స్కీమ్ ను ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగులు LTC/LTA-లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ విలువకు సమానమైన మొత్తాన్ని క్యాష్ రీఎంబర్స్ మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. LTC/LTA మాదిరిగానే ఈ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదు.

కార్ల కొనుగోలు సులభతరం

ఉద్యోగాలు చేసే కస్టమర్లు టయోటా పండుగ ఆఫర్లను, ఆర్థిక శాఖ ఇటీవల ప్రకటించిన స్పెషల్ క్యాష్ ప్యాకేజీలను ఉపయోగించి కారు కొనుగోలును సులభతరం చేసుకోవచ్చు. వీటి వల్ల కారు కొన్నప్పుడు చెల్లించే ఇనీషియల్ పర్ చేజ్(కారు కొన్నప్పుడు చెల్లించే కొంత డబ్బు) భారం తగ్గుతుంది. ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ సదుపాయంతో ప్రభుత్వ ఉద్యోగులు రూ.10,000 వరకు వడ్డీ లేని అడ్వాన్స్ పొందవచ్చు. ఈ డబ్బును వారు కారు బుకింగ్ కు కేటాయించుకోవచ్చు. టయోటా అర్బన్ క్రూయిజర్, టయోటా గ్లాంజా, టయోటా యారిస్ వంటి ఇతర బి సెగ్మెంట్ మోడళ్లు ఉద్యోగుల అవసరాలకు సరిపోయేలా ఉంటాయి.

EMIలతో లబ్ధి
ఈ ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు వినియోగదారులు ఈఎంఐ విధానంలో తగ్గింపులను పొందవచ్చు. వివిధ ఫైనాన్స్ సంస్థల ద్వారా సులభతరమైన EMI చెల్లింపుల ఆప్షన్ను ఎంచుకునే అవకాశాన్ని టయోటా కల్పిస్తోంది. EMIలపై తక్కువ వడ్డీ రేటు, ఏడు సంవత్సరాల వరకు లోన్ టెన్యూర్ను పొడిగించుకునే వీలుండటం వంటి ప్రయోజనాలు ఉద్యోగులకు అందుబాటులో ఉన్నాయి.

ఉద్యోగులకు ప్రయోజనం
పండుగ సీజన్లోనే చాలా మంది వినియోగదారులు కొత్త కారు కొనాలనే పెద్ద కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటారని టొయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని చెబుతున్నారు.‘ఉద్యోగాలు చేసే కస్టమర్లు ధరల తగ్గింపులు, ఆఫర్లతో పాటు వారికి సౌలభ్యంగా ఉండే చెల్లింపు పద్ధతుల గురించి ఆరా తీస్తారు. టయోటాలో ఇలాంటి ప్రయోజనాలను మేము కల్పిస్తున్నాం. వివిధ సెగ్మెంట్ల బయ్యర్ల కోసం మా సంస్థ ప్రత్యేక ఆఫర్లను, సౌలభ్యాలను కల్పిస్తోంది. ఉద్యోగులకు ఈ ప్రయోజనాలతో లబ్ధి చేకూరనుంది’ అని ఆయన వివరించారు.ప్రభుత్వ నిర్ణయంతో మేలు
ఇటీవల విడుదలైన ఎస్ యూవీ అర్బన్ క్రూయిజర్ తో సహా, వినియోగదారులు తమకు నచ్చిన వాహనాన్ని ఎంచుకునేలా వివిధ ఆఫర్లను టయోటా కల్పిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆసక్తిగల కొనుగోలుదారులు సులభంగా కారు కొనుక్కోవడానికి ఆసక్తి చూపే అవకాశం ఉందని ఆ సంస్థ తెలిపింది. ఈ సీజన్లో తమ కంపెనీ కార్ల అమ్మకాలు పెంచడానికి, ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి టయోటా ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన క్యాష్ ప్యాకేజ్ స్కీమ్ ఆటో మొబైల్ ఇండస్ట్రీకి పాజిటివ్ సెంటిమెంట్ ను తీసుకొస్తుందని కార్ల తయారీ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Published by: Krishna Adithya
First published: October 17, 2020, 11:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading