హోమ్ /వార్తలు /బిజినెస్ /

వారెవా... టయోటా నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఫుల్ చార్జింగ్ చేస్తే హైదరాబాద్ నుంచి ఎక్కడి వరకు వెళ్లొచ్చంటే..

వారెవా... టయోటా నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఫుల్ చార్జింగ్ చేస్తే హైదరాబాద్ నుంచి ఎక్కడి వరకు వెళ్లొచ్చంటే..

Toyota bZ3 (Image:Twitter)

Toyota bZ3 (Image:Twitter)

జపనీస్ ఆటోమేకర్ టయోటా ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌లో తనదైన మార్కు చూపించాలని కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే సరికొత్త bZ3 (Toyota bZ3) సెడాన్‌ కారును త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జపనీస్ ఆటోమేకర్ టయోటా ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌లో తనదైన మార్కు చూపించాలని కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే సరికొత్త bZ3 (Toyota bZ3) సెడాన్‌ కారును త్వరలోనే చైనాలో లాంచ్ చేస్తున్నట్టు తాజాగా అనౌన్స్ చేసింది. చైనీస్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్ BYD, FAW టయోటా సహకారంతో దీనిని డెవలప్ చేసింది. ఈ కారు డిజైన్ చూపు తిప్పుకోనివ్వనంత అద్భుతంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఫీచర్లతో వచ్చే ఈ కారులో విలాసవంతమైన క్యాబిన్‌ అందించారు. ఇది ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ నుంచి శక్తిని తీసుకుంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 600కి.మీల రేంజ్‌ను అందజేస్తుంది. bZ3 కారు bZ సిరీస్ రెండవ మోడల్ కాగా FAW టయోటా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ల ద్వారా దీనిని ప్రొడ్యూస్ చేసి విక్రయించనున్నారు.

టయోటా మోటార్ కార్ప్ అనౌన్స్ చేసిన ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌లో BYD బ్యాటరీలు అందించనున్నారు. చైనాలోనే ఉత్పత్తి అయ్యే ఈ కార్లు మొదటగా ఆ దేశంలోనే విక్రయానికి రానున్నాయి. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాగా షోరూమ్‌లలో ఈ వాహనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. టయోటా నుంచి వచ్చిన కొత్త బియాండ్ జీరో (బిజెడ్) బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (బీఈవీ) సిరీస్‌లో ఇది రెండవ మోడల్.

Car Insurance: ఈ దీపావళికి కొత్త కారు కొన్నారా? మోటార్ ఇన్సూరెన్స్ ఖర్చు ఇలా తగ్గించుకోండి

టయోటా ఏప్రిల్‌లో బీజింగ్ ఆటో షోలో BYD తక్కువ పరిమాణం ఉన్న బ్లేడ్ బ్యాటరీలను ఉపయోగించే bZ3ని ఆవిష్కరించాలని ప్లాన్ చేసింది. కోవిడ్ 19 కారణంగా ఆ ఈవెంట్ రద్దు అయింది. టయోటా bZ3 సెడాన్‌లో వాలుగా ఉండే రూఫ్‌లైన్, పైకి ముడుచుకునే హెడ్‌లైట్లు, స్టైలిష్ అల్యూమినియం వీల్స్‌, ర్యాప్-అరౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు, క్రీజ్డ్ ఫెండర్లు అందించారు. టయోటా bZ3 కారులో BYD లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్‌పై ఆధారపడి 178hp లేదా 238hpని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గరిష్ఠంగా గంటకు 160కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

Car Loan Mistakes: కారు లోన్ తీసుకుంటున్నారా? అందరూ చేేసే ఈ 5 తప్పులు మీరు చేయొద్దు!

టయోటా bZ3 సెడాన్‌లోని 5-సీటర్ క్యాబిన్‌లో డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కూడిన సీట్లు, ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన పెద్ద సెంటర్ కన్సోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 'డిజిటల్ ఐలాండ్' టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం ఎయిర్‌బ్యాగ్స్‌ను కూడా ఇందులో ఆఫర్ చేశారు. టెస్లా మోడల్ 3 కారు కంటే ఈ అప్‌కమింగ్ సెడాన్‌ దరఖాస్తు తక్కువగానే ఉండొచ్చని రిపోర్ట్ పేర్కొంటున్నాయి. ఈ కారు రెండు వెర్షన్లలో రానుందని తెలుస్తోంది. మొదటి వెర్షన్ 49.92 kWh ఫాస్ఫేట్ బ్యాటరీతో 517 కిమీ.. రెండో వెర్షన్ 65.28 kWh ఫాస్ఫేట్ బ్యాటరీతో 616 కిమీ రేంజ్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

First published:

Tags: Auto motives, Auto News, Automobiles

ఉత్తమ కథలు