Home /News /business /

TOTAL SEVEN SPECIAL INCOME TAX BENEFITS FOR SENIOR CITIZENS UMG GH

Income Tax Benefits: సీనియర్ సిటిజన్స్‌కు స్పెషల్ ట్యాక్స్ బెనిఫిట్స్.. అవేంటో ఒక్కసారి చూడండీ..!

సీనియర్ సిటిజన్స్‌కి ట్యాక్స్ బెనిఫిట్స్ (Shutter Stock)

సీనియర్ సిటిజన్స్‌కి ట్యాక్స్ బెనిఫిట్స్ (Shutter Stock)

భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) ప్రకారం పరిమితికి మించి ఇన్‌కమ్‌ సంపాదించే ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాల్సిందే. అయితే 60-80 సంవత్సరాల మధ్య వయసున్న సిటిజన్లకు ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) స్పెషల్ ట్యాక్స్ బెనిఫిట్స్ (Tax Benefits) అందిస్తోంది.

ఇంకా చదవండి ...
భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) ప్రకారం పరిమితికి మించి ఇన్‌కమ్‌ సంపాదించే ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాల్సిందే. అయితే 60-80 సంవత్సరాల మధ్య వయసున్న సిటిజన్లకు ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) స్పెషల్ ట్యాక్స్ బెనిఫిట్స్ (Tax Benefits) అందిస్తోంది. 60-80 ఏళ్ల వయసున్న వారిని సీనియర్ సిటిజన్లగా పరిగణిస్తే.. 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిని సూపర్ సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్న్స్ దాఖలు ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. మరి సీనియర్ సిటిజన్లు పొందగలిగే ప్రత్యేకమైన ఐటీ బెనిఫిట్స్ ఏవో తెలుసుకుందాం.

1. వివిధ పన్ను-స్లాబ్ రేట్లు
సాధారణ సిటిజన్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లు డిఫరెంట్‌గా ఉంటాయి. సాధారణ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితి 2.5 లక్షలు ఉంటే.. సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం సంపాదించే సాధారణ సిటిజన్లు ఐదు శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్లు అయితే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయంపై 5 శాతం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది.

2. రూ.50,000 వరకు వడ్డీ ఆదాయ మినహాయింపు
ఇన్‌కమ్‌ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80TTB ప్రకారం, 60 ఏళ్లు, అంతకు మించి వయసున్న వ్యక్తులు రూ.50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్స్‌ పొందొచ్చు. 80TTB ప్రకారం, ట్యాక్స్ డిడక్షన్ అనేది ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వడ్డీ ఆదాయానికి వర్తిస్తుంది. అయితే ఐటీ చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం పోస్టాఫీస్, బ్యాంక్ లేదా కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న సేవింగ్స్ అకౌంట్ల డిపాజిట్ల వడ్డీపై కూడా మినహాయింపు పొందవచ్చు. కాగా ఈ సెక్షన్ కింద రూ.10,000 కంటే తక్కువ అమౌంట్ పై మాత్రమే మినహాయింపు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది.



3. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్‌పై సెక్షన్ 80డీ కింద మినహాయింపు
ఐటీ చట్టంలోని సెక్షన్ 80డీ అనేది 60 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పన్ను చెల్లింపుదారులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్‌పై రూ.25,000 వేల వరకు మినహాయింపు అందిస్తే.. సీనియర్ సిటిజన్లకు రూ.50,000 వరకు మినహాయింపు అందిస్తుంది.

4. వడ్డీపై టీడీఎస్ కట్ చేయకుండా ఫారమ్ 15హెచ్
ఒక ఆర్థిక సంవత్సరంలో సీనియర్ సిటిజన్ మొత్తం ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలో ఉంటే.. వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీపై ఫారమ్ 15హెచ్‌ని సబ్మిట్ చేయడం ద్వారా టీడీఎస్ కట్ అవ్వకుండా జాగ్రత్త పడొచ్చు. అలానే సెక్షన్ 194A కింద సీనియర్ సిటిజన్లు రూ.50,000 వరకు సంపాదించిన వడ్డీపై టీడీఎస్ కట్ అవ్వదు.

5. సెక్షన్ 80DDB కింద అధిక మినహాయింపు
సెక్షన్ 80DDB అనేది వైద్య చికిత్స ఖర్చులపై పన్ను మినహాయింపు అందిస్తుంది. నిర్దిష్ట వ్యాధుల వైద్య చికిత్స కొరకు చేసిన ఖర్చులపై సీనియర్ సిటిజన్లు రూ.1 లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు.

ఇదీ చదవండి: శాశ్వత సైనిక నియామకాల కోసం అగ్నివీరులకు నిరంతర పరీక్షలు.. లెఫ్టినెంట్ జనరల్ కీలక ప్రకటన


6. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించనక్కర్లేదు
ఎలాంటి బిజినెస్ ఇన్‌కమ్‌ లేని సీనియర్ సిటిజన్లకు అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ (Advance Tax Payment) నుంచి మినహాయింపు లభిస్తుంది. అలానే వీరు తమ మొత్తం ఆదాయంపై సెల్ఫ్-అసెస్‌మెంట్ ట్యాక్స్ మాత్రమే చెల్లించాలి.

7. రివర్స్ మోర్ట్‌గేజ్ స్కీమ్ కింద పొందే మొత్తంపై పన్ను మినహాయింపు
రివర్స్ మోర్ట్‌గేజ్ స్కీమ్ (Reverse Mortgage Scheme) ద్వారా పొందే మొత్తంపై సీనియర్ సిటిజన్లు పన్ను మినహాయింపు పొందవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: BUSINESS NEWS, IT Returns, Senior citizens, Taxes

తదుపరి వార్తలు