Home /News /business /

TOSHIBA PHILIPS MI ONEPLUS TCL AND SOME COMPANIES GIVES OFFERS IN AMAZON GREAT INDIAN FESTIVAL SALE OFFERS AK GH

Offers on Smart TVs: అమెజాన్‌లో స్మార్ట్‌ టీవీలపై భారీ ఆఫర్లు.. అతి తక్కువ ధరకే తొషిబా, ఫిలిప్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Offers On SmartTVS: పాపులర్ బ్రాండ్లు అయిన షియోమి, వన్ ప్లస్ లాంటి సంస్థలు TVలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. వీటితో పాటు బ్యాంక్ రాయితీలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇస్తున్నాయి.

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు వినియోగదారుల ముందు ఆఫర్ల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా గృహ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై చాలా కంపెనీలు అత్యుత్తుమ రాయితీలను అందిస్తుంటాయి. తాజాగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ సందర్భంగా అమెజాన్‌లో సరికొత్త ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పాపులర్ బ్రాండ్లు అయిన షియోమి, వన్ ప్లస్ లాంటి సంస్థలు TVలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. వీటితో పాటు బ్యాంక్ రాయితీలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇస్తున్నాయి.

* తొషిబా 43 అంగుళాల విడా ఓఎస్ సిరీస్ టీవీ..
తొషిబా 43 అంగుళాల (108 సెంటీమీటర్లు) విడా ఓఎస్ సిరీస్ పుల్ HD స్మార్ట్ ఏడీఎస్ ఎల్ఈడీ టీవీని అమెజాన్‌లో కేవలం రూ.22,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.31,999 కాగా.. పండుగ సీజన్ సందర్భంగా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 60Hz రిఫ్రెష్ రేటుతో పుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉండే ఈ టీవీలో 24W సామర్థ్యం ఉన్న స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ ఆడియో ఫీచర్ కూడా ఇందులో ఉంది.

* Mi 32 అంగుళాల హారిజన్ ఎడిషన్..
ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీపై అమెజాన్‌లో రూ. 5వేల డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.19,999 కాగా.. రాయితీతో రూ.15,499కే సొంతం చేసుకోవచ్చు. 60Hz రిఫ్రెష్ రేటుతో డిస్‌ప్లే ఉండే ఈ టీవీలో 20W సామర్థ్యం కలిగిన సౌండ్ అవుట్ పుట్, డీటీఎస్‌తో కూడిన డాల్బీ ఆడియో లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితో పాటు ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్, వైఫై వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

* వన్ ప్లస్ 43 అంగుళాల వై-సిరీస్ టీవీ
ఈ ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర అమెజాన్‌లో రూ.27,999గా ఉంది. దీని అసలు ధర రూ.29,999 కాగా.. రూ. 2 వేలు రాయితీనిచ్చింది. ఫుల్ HD(1920X1080) డిస్ ప్లే, 2 యూఎస్బీ పోర్టులు, సెట్ అప్ బాక్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు 2 HDMI పోర్టులు, బ్లూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

* టీసీఎల్ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ టెలివిజన్..
ఈ స్మార్ట్ ఎల్ఈడీ టెలివిజన్‌ను అమెజాన్‌లో రూ.29,990కు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.51,990 కాగా.. రూ.22 వేలు డిస్కౌంట్ ఉంది. అమెజాన్ పే యూపీఐ ద్వారా 10 శాతం లేదా రూ.100 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డులపై 10 శాతం లేదా రూ.1750 వరకు తక్షణ రాయితీ ఇచ్చింది.

* అమెజాన్ బేసిక్స్ 109 సెంటిమీటర్ల 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ..
ఈ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని అమెజాన్‌లో రూ.24,499కు కొనుగోలు చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.44,000 కాగా.. రూ.19,501 రాయితీనిచ్చింది. దీంతో పాటు ఆర్బీఎల్ క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐ యేతర లావాదేవీలు(non-EMI transactions) చేసినవారికి 10 శాతం లేదా రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. అమెజాన్ పే యూపీఐ ద్వారా లావాదేవీ నిర్వహిస్తే 10 శాతం లేదా రూ.100 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

* ఫిలిప్స్ 43 అంగుళాల పుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ..
ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీని అమెజాన్‌లో రూ.28,999లకు కొనుగోలు చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.35,990 కాగా.. రూ.6,991 డిస్కౌంట్ ఇచ్చింది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ లావాదేవీలు చేసినవారికి 10 శాతం లేదా రూ. 1750 తక్షణ రాయితీ లభిస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Amazon Great Indian Festival Sale, Smart TV

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు