Electric Vehicle | మీరు కొత్త బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే బ్యాడ్ న్యూస్. టూవీలర్ ధరలు పెరగబోతున్నాయి. భారీగా పైకి కదిలనున్నాయి. అందువల్ల మీరు కొత్తగా బైక్ (Bike) కొనాలనే ఆలోచనలో ఉంటే మాత్రం ఇప్పుడు కొత్త బైక్ కొనేసుకోవడం ఉత్తమం. లేదంటే కొత్త ఏడాది నుంచి టూవీలర్ల (Two Wheeler) ధరలు కూడా పైకి చేరనున్నాయి. టార్క్ మోటార్స్ తన టూవీలర్ ధరను పెంచడానికి రెడీ అవుతోంది. భారీగా పెంపు ఉండనుంది.
కంపెనీ కొత్త టూవీలర్ మార్కెట్‌లోకి తీసుకువచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే ధర పెంచేస్తున్నట్లు టార్క్ మోటార్స్ వెల్లడించింది. బైక్ ధర రూ. 10 వేలు పైకి చేరుతుందని కంపెనీ వెల్లడించింది. క్రటోస్ బైక్ ధర రూ. 10 వేలు పెరుగుతుందని తెలిపింది. స్టాండర్ట్ వేరియంట్, ఆర్ వెర్షన్ వేరియంట్ ఇలా రెండు బైక్స్ ధరలు కూడా పైకి చేరుతాయని వివరించింది.
ఒక్కసారి చార్జింగ్ పెడితే 240 కిలోమీటర్లు వెళ్లే కొత్త స్కూటర్.. ఫీచర్లు అదుర్స్!
ధరల పెంపు తర్వాత క్రటోస్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1,32,499కు చేరుతుంది. అలాగే ఆర్ వెర్షన్ రేటు అయితే రూ. 1,47,499కే పెరుగుతుంది. ఇవి మహరాష్ట్ర ఎక్స్‌షోరూమ్ ధరలు. ఫేమ్ 2 సబ్సిడీ, రాస్ట్ర సబ్సిడీలను తీసేసిన తర్వాతనే ఈ రేటు ఉంది. అంటే సబ్సిడీ లేకపోతే వీటి రేటు ఇంకా భారీగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
కస్టమర్లకు అదిరే గిఫ్ట్.. బ్యాంక్ కీలక ప్రకటన, వారంలో 3 సార్లు..
ఈ బైక్ ధర పెంపు నిర్ణయం 2023 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. క్రటోస్ బైక్ ధర లాంచింగ్ సమయంలో రూ. 1.08 లక్షలుగా ఉండేది. స్టాండర్డ్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అదే ఆర్ వెర్షన్‌కు అయితే రూ. 1.23 లక్షలుగా ఉండేది. జనవరి రేట్ల పెంపు తర్వాత చూస్తే.. ఈ బైక్ ధర దాదాపు రూ. 25 వేలు పైకి చేరిందని చెప్పుకోవచ్చు. ఏడాది లోపే ధర ఈ స్థాయిలో పెరగడం గమనార్హం.
ఈ బైక్‌కు పోటీ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో ఈ బైక్‌కు సమానమైన పోటీ కలిగిన బైక్ మరొకటి లేదు. తక్కువలో చూస్తే రూ. 1.23 లక్షల రేంజ్‌లో రివోల్ట్ ఆర్‌వీ 400 బైక్ ఉంది. అలాగే హై ఎండ్‌లో చూస్తే.. అల్ట్రావాయిలెట్ ఎఫ్77 బైక్ ఉంది. దీని రేటు ఏకంగా రూ. 3.8 లక్షలుగా ఉంది. అందుకే ఈ బైక్ ధర పెరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ధరల పెంపు డిసెంబర్ 31 వరకు ఉండదు. అంటే ప్రస్తుత ధరతోనే బైక్ కొనొచ్చు. కొత్త ఏడాది వస్తే ఈ బైక్ రేటు రూ. 10 వేలు పెరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Electric bike, Electric Vehicles, Price Hike