ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ అవసరం లేని కార్లను (Cars) కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా వినియోగదారులకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఎందుకంటే హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ (Hybrid Powertrains)లను అందించే వాహన తయారీదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అంతేకాదు, ఇటీవలికాలంలో మార్కెట్లోకి వచ్చే ఎలక్ట్రిక్ కార్ల (EVs) సంఖ్య భారీగా పెరిగింది. అత్యుత్తమ హైబ్రిడ్ కార్లు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లు ఇంధన సామర్థ్యం (Fuel Efficiency) పరంగా పెట్రోల్, డీజిల్ వెర్షన్ల కంటే ఉత్తమంగా నిలవడమే కాకుండా, పనితీరు పరంగా కూడా వాటిని అధిగమించాయి. దాదాపు అన్ని ఈవీలు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌తో చాలా కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అయితే 2022లో మరికొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ భారత్‌లో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo Discount Offer: మూడు పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో
హ్యుందాయ్ ఐయోనిక్ 5
కొరియన్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ 2022 ద్వితీయార్ధంలో భారత్‌లో హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5 EV)ని పరిచయం చేయనుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 58kWh బ్యాటరీ ప్యాక్, పెద్ద 77.4kWh బ్యాటరీ ప్యాక్‌తో గ్లోబల్ రిలీజ్ అయింది. పెద్ద బ్యాటరీ 4WD కాన్ఫిగరేషన్‌గా ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 305bhp శక్తిని, 605Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు 481 కి.మీల పరిధిని ఆఫర్ చేస్తుంది.
కియా ఈవీ6
కియా EV6 అనేది దక్షిణ కొరియా తయారీ సంస్థ కియా నుంచి వస్తున్న మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు. ఈ స్పెషల్ కారును కంపెనీ ప్రత్యేక ఈవీ ప్లాట్‌ఫామ్‌పై తయారుచేసింది. కియా ఈవీ6 హ్యుందాయ్ ఐయోనిక్ 5 వలె అదే E-GMP ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రన్ అవుతుంది. జూన్ 2022 నాటికి భారత్‌లో కియా ఈవీ6 విడుదలయ్యే అవకాశం ఉంది. కియా ఈవీ6 ఇంజన్ కాన్ఫిగరేషన్ గురించి తెలియాల్సి వుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ కారు వేరియంట్‌లలో 58kWh బ్యాటరీ వెర్షన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. రియర్ వీల్ డ్రైవ్ (RWD)తో 170hp-ఉత్పత్తి చేసే సింగిల్-మోటార్, 235hp ఉత్పత్తి చేసే డ్యూయల్-మోటార్ సెటప్‌తో ఆల్-వీల్-డ్రైవ్ (AWD) వెర్షన్లు గ్లోబల్ గా రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒకటి భారత్‌లో లాంచ్ అవ్వచ్చు.
హోండా సిటీ హైబ్రిడ్
హోండా సిటీ హైబ్రిడ్ ఇప్పటికే ఇండియాలో రూ.19.49 లక్షల ధరతో విడుదలయ్యింది. హోండా నుంచి తొలి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వెహికల్ గా హోండా సిటీ హైబ్రిడ్ లాంచ్ అయ్యింది. సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉన్న ఈవీలలో తొలి వెహికల్ గా ఈ కారు నిలిచింది. ఈ కారు రాబోయే అన్ని కార్లకు బలమైన ప్రత్యర్థిగా నిలవనుంది. హోండా సిటీ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో, రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో కలిపి వస్తుంది. ఇది 98PS, 127Nm టార్క్‌తో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఎలక్ట్రిక్ మోటార్లు 109PSని అందిస్తాయి. ఈ కారు మొత్తం పవర్ అవుట్‌పుట్ 253Nm గరిష్ట టార్క్‌తో 126PS లేదా మెట్రిక్ హార్స్‌పవర్ గా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Car, Electric Vehicles, Hyundai, India, New hybrid cars