హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల కన్నా తక్కువ ధరకే లభిస్తున్న టాప్ ఎస్‌యూవీ కార్లు ఇవే!

Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల కన్నా తక్కువ ధరకే లభిస్తున్న టాప్ ఎస్‌యూవీ కార్లు ఇవే!

Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల కన్నా తక్కువ ధరకే లభిస్తున్న టాప్ ఎస్‌యూవీ కార్లు ఇవే!

Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల కన్నా తక్కువ ధరకే లభిస్తున్న టాప్ ఎస్‌యూవీ కార్లు ఇవే!

Best Cars | మీరు రూ.10 లక్షల లోపు ధరలో మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు అందుబాటులో ఉన్న ఆప్షన్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Top Cars | కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇవి టాప్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభిస్తున్నాయి. మారుతీ సుజుకీ (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors), హ్యుందాయ్ వంటి పలు ఇతర కంపెనీలు రూ. 10 లక్షల ధరలోపే ఎస్‌యూవీలను అందిస్తున్నాయి. మీరు కూడా ఈ ధరలోపు కొత్త ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే.. అందుబాటులో ఉన్న ఆప్షన్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతీ సుజుకీ కంపెనీ ఎస్‌ ప్రెసో సీఎన్‌జీ మోడల్‌ను అందిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 5.9 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది రెండు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. ఎల్ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ అనేవి ఇవి. హ్యుందాయ్ నుంచి వెన్యూ కారు లభిస్తోంది. ఇది ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 7.53 నుంచి ప్రారంభం అవుతోంది.

పర్సనల్ లోన్ కావాలా? 24 బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా.. ఎందులో తక్కువంటే?

అలాగే కియా సొన్నెట్ కారు కూడా ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభం ధర రూ. 7.17 లక్షలు. ఇందులో సైడ్ ఎయిర్ బ్యాగ్స్, హైలైన్ టైర్ ప్రెజన్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్ ఫీచర్లుగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నయని చెప్పుకోవచ్చు.

భారీగా తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇలా!

ఇంకా రెనో కైగర్ మోడల్‌కు ఈ లిస్ట్‌లో ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 5.84 లక్షల నుంచి ఉంది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మల్టీ సెన్స్ డ్రైవింగ్ మోడ్స్, గ్రేట్ క్యాబిన్ స్టోరేజ్అండ్ కార్గో స్పేస్ వంటివి ఈ కారు సొంతం. సామర్థ్యం, పనితీరు కలయికతో ఈ కారు మార్కెట్‌లోకి వచ్చింది.

ఇక మారుతీ సుజుకీ నుంచి వితారా బ్రెజా కూడా దుమ్మురేపుతోంది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలుగా ఉంది. ఈ ఎస్‌యూవీలో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. కలర్డ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే స్క్రీన్, ఆటో హెడ్‌ల్యాంప్స్, రియర్ ఏసీ వెంట్, కూల్డ్ గ్లూవ్ బాక్స్, రియర్ ఫాస్ట్ చార్జింగ్ యూఎస్‌బీ పోర్ట్స్ వంటి ప్రత్యేకతలు ఈ కారులో ఉన్నాయి. రూ. 10 లక్షలలోపు బడ్జెట్‌లో కారు కొనాలని భావించే వారు ఈ మోడల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.

First published:

Tags: Best cars, Budget cars, Cars, Kia cars, Maruti cars, Tata Motors

ఉత్తమ కథలు