హోమ్ /వార్తలు /బిజినెస్ /

Income Tax Notice: ఇన్‌కం ట్యాక్స్‌ నోటీసు ఎప్పుడు జారీ చేస్తారు? తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే

Income Tax Notice: ఇన్‌కం ట్యాక్స్‌ నోటీసు ఎప్పుడు జారీ చేస్తారు? తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదాయ పన్ను నోటీసును అందుకోవడం అంటే తప్పు చేశారని అర్థం కాదని తెలుసుకోవాలి. రొటీన్‌ చెక్‌ లేదా ట్యాక్స్‌ రిటర్న్‌లోని నిర్దిష్ట అంశాలపై స్పష్టత కోసం కూడా అధికారులు నోటీసు పంపే అవకాశం ఉంటుంది. నోటీసు పంపడానికి గల ముఖ్య కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Income Tax Notice: ప్రతి సంవత్సరం ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌(ITR)లను గడువులోగా, పొరపాట్లు లేకుండా ఫైల్‌ చేయడం అందరి బాధ్యత. కానీ చాలా మంది పన్ను చెల్లింపుదారులు వివిధ సమస్యలతో గడువులోగా ఫైల్‌ చేయలేరు. చివరి నిమిషాల హడావుడితో కొందరు తప్పులు చేస్తారు. మరోవైపు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా, ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ నుంచి ఆదాయ పన్ను నోటీసులు(Income Tax Notice) రావచ్చు. అలాంటి నోటీసులు అందుకున్నప్పుడు సాధారణంగానే అందరూ ఆందోళనకు గురవుతారు. అయితే, ఆదాయ పన్ను నోటీసును అందుకోవడం అంటే తప్పు చేశారని అర్థం కాదని తెలుసుకోవాలి. రొటీన్‌ చెక్‌ లేదా ట్యాక్స్‌ రిటర్న్‌లోని నిర్దిష్ట అంశాలపై స్పష్టత కోసం కూడా అధికారులు నోటీసు పంపే అవకాశం ఉంటుంది. నోటీసు పంపడానికి గల ముఖ్య కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* ఇన్‌కం, చెల్లించిన పన్ను మధ్య వ్యత్యాసం

అందుతున్న ఇన్‌కం, చెల్లించిన పన్ను మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా ఎక్కువ మందికి ఆదాయ పన్ను నోటీసులు వస్తుంటాయి. ఆదాయ పన్ను రిటర్న్‌లో మీరు పేర్కొన్న ఇన్‌కం, మీ యజమాని నివేదించిన ఇన్‌కం సరిపోలకపోతే అధికారులు నోటీసు పంపుతారు. ఇన్‌కరెక్ట్‌ TDS డిడక్షన్‌, శాలరీ మిస్‌మ్యాచ్‌ వంటి కారణాలతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఏవైనా వ్యత్యాసాలను గుర్తించడానికి పన్ను శాఖ మీ ఇన్‌కం, చెల్లించిన పన్నులను, మీ యజమాని, ఇతర సోర్సెస్‌ నుంచి సేకరించిన డేటాతో పోల్చి చూస్తుంది. ఏదైనా వ్యత్యాసం ఉంటే, నోటీసు జారీ చేస్తుంది.

* ఇన్‌కం వెల్లడించకపోవడం

ఇన్‌కం వెల్లడించకపోవడం వల్ల కూడా ఎక్కువ మందికి ఆదాయ పన్ను నోటీసులు వస్తుంటాయి. ట్యాక్స్‌ రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు మీరు మీ అన్ని ఇన్‌కం సోర్సెస్‌ను ప్రకటించకుంటే, పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. సేవింగ్స్‌ అకౌంట్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై లభించిన వడ్డీ, రెంటల్‌ ఇన్‌కం, క్యాపిటల్‌ గెయిన్స్‌ వంటి అన్ని రకాల సోర్సెస్‌ను కచ్చితంగా పేర్కొనాలి. భవిష్యత్తులో ఎలాంటి నోటీసులు రాకుండా ఉండేందుకు వాటిపై పన్నులు కూడా చెల్లించాలి.

* హై వ్యాల్యూ ట్రాన్సాక్షన్‌లు

క్యాష్ డిపాజిట్లు, ఆస్తి కొనుగోళ్లు, పెట్టుబడులు మొదలైన హై వ్యాల్యూ ట్రాన్సాక్షన్‌లను ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ట్రాక్‌ చేస్తూ ఉంటుంది. ఆదాయానికి మించిన ట్రాన్సాక్షన్‌లు ఏవైనా చేసి ఉంటే, ఐటీ అధికారులు నోటీసు పంపవచ్చు. ఎలాంటి నోటీసులు రాకుండా ఉండేందుకు అన్ని అవసరమైన డాక్యుమెంట్‌లను ఉంచుకోవాలి. ట్యాక్స్‌ రిటర్న్‌లో అన్ని హై వ్యాల్యూ ట్రాన్సాక్షన్‌లను కచ్చితంగా పేర్కొనాలి.

* ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌లను ఫైల్‌ చేయకపోవడం

ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్నులను ఫైల్‌ చేయకపోతే, గడువు తేదీ తర్వాత కూడా ఫైల్‌ చేయకుంటే ఆదాయ పన్ను నోటీసు వచ్చే అవకాశం ఉంది. ఇన్‌కం పొందే ప్రతి వ్యక్తి తమ ట్యాక్స్‌ రిటర్న్‌ను గడువు తేదీలోపు ఫైల్‌ చేయాలి. ఫైల్‌ చేయకపతే.. జరిమానాలు, వడ్డీలను ఎదుర్కోవలసి ఉంటుంది.

IRDAI: ఇన్సూరెన్స్‌ ఏజెంట్లకు కమీషన్‌ లిమిట్‌ తొలగింపు.. వినియోగదారులకు అందే ప్రయోజనాలు ఇవే..

* ట్యాక్స్‌ రిటర్న్‌లో తప్పు సమాచారం

ట్యాక్స్‌ రిటర్న్‌లో తప్పు సమాచారాన్ని అందించినట్లు అధికారులు భావిస్తే నోటీసు మంజూరు చేస్తారు. డిడక్షన్‌ తప్పుగా క్లెయిమ్‌ చేయడం, ఇన్‌కరెక్ట్‌ PAN లేదా ఆధార్ నంబర్, ఇన్‌కరెక్ట్ బ్యాంక్ అకౌంట్‌ వివరాలు, ఏదైనా ఇతర తప్పుడు సమాచారం గుర్తిస్తే నోటీసులు వస్తాయి. ఎలాంటి నోటీసులు రాకుండా ఉండాలంటే.. ట్యాక్స్‌ రిటర్న్‌ను ఫైల్ చేసే ముందు సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి.

ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎలాంటి నోటీసులు రాకుండా ఉండాలంటే, రిటర్న్‌లను సమయానికి, ఎలాంటి తప్పులు లేకుండా ఫైల్‌ చేయాలి. రిటర్న్‌ను ఫైల్ చేసే ముందు అన్ని ఇన్‌కం సోర్సెస్‌ను బహిర్గతం చేయాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి. నమోదు చేసే వివరాలను చెక్‌ చేసుకోవాలి. అంతే కాకుండా ఇన్‌కం ట్యాక్స్‌ నోటీసు అందితే.. తక్షణమే స్పందించాలి. అధికారులు కోరిన వివరాలను అందిస్తే, ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉండవు.

First published:

Tags: Income tax, ITR, ITR Filing

ఉత్తమ కథలు