• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • TOP RATED COMPANY FDS WITH INTEREST RATES UP TO 10 75 PERCENTAGE NS GH

Fixed Depositsలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? అయితే మీకు అధిక రాబడి ఇచ్చే మార్గాలివే..

ప్రతీకాత్మకచిత్రం

కరోనా సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులను తీసుకొచ్చింది. దీంతో సురక్షిత పెట్టుబడి మార్గంగా, నష్టభయం లేని పెట్టుబడి మార్గంగా భావించే ఫిక్స్ డిపాజిట్లలో పెట్టుబడికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

  • Share this:
కరోనా సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులను తీసుకొచ్చింది. దీంతో సురక్షిత పెట్టుబడి మార్గంగా, నష్టభయం లేని పెట్టుబడి మార్గంగా భావించే ఫిక్స్ డిపాజిట్లలో పెట్టుబడికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఆర్థిక విధానాల్లో భాగంగా అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించాయి. ఎందుకంటే, ఆయా బ్యాంకులు తమ ఎఫ్డి రేట్లను సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటుకు అనుగుణంగా నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు లేదా ఎన్‌బిఎఫ్‌సిలు మాత్రం ఎఫ్డీల్లో పెట్టుబడిపై అధిక రాబడిని ఇస్తున్నాయి. బ్యాంక్ ఎఫ్‌డిలతో పోలిస్తే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టే ఎఫ్డీలపై అధిక వడ్డీరేటు లభిస్తుంది. అంతేకాక, సీనియర్ సిటిజన్ల విషయంలో ఎన్బిఎఫ్సిలలో పెట్టే ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.5 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. కాబట్టి, 2020లో పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న, అధిక రాబడిని ఇచ్చే ఉత్తమ కార్పొరేట్ ఎఫ్‌డి వడ్డీ రేట్లను విశ్లేషిద్దాం.

వివిధ కార్పొరేట్ కంపెనీల్లో ఎఫ్డీలపై లభించే వడ్డీ రేట్లు..
కార్పొరేట్ ఎఫ్డీ వడ్డీరేటు(శాతం)-వ్యవధి
-హావ్కిన్స్ కూకర్ లిమిటెడ్ 10.25–10.75: 12 నుంచి 36 నెలలు
-కేరళ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 8.00–7.7: 5 1 నుంచి 5 ఏళ్లు
-శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 7.25–8.09: 12 నుంచి 60 నెలలు
-హౌజింగ్ అండ్ అర్భన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 7.00–7.25: 12 నుంచి 60 నెలలు
-పీఎన్బీ హౌజింగ్ 6.20–6.70: 12 నుంచి 120 నెలలు

-బజాజ్ ఫిన్సర్వ్ 6.10–6.60: 12 నుంచి 60 నెలలు
-సందరం ఫైనాన్స్ కంపెనీ 5.72–6.22: 12 నుంచి 36 నెలలు
-మహీంద్రా ఫైనాన్స్ 5.70–6.45: 15 నుంచి 40 నెలలు
-ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్ 5.50–6.15: 12 నుంచి 120 నెలలు
-ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ 5.65–5.75: 1 నుంచి 5 ఏళ్లు
-HDFC లిమిటెడ్ 5.65–6.05: 12 నుంచి 84 నెలలు

పైన పేర్కొన్న కార్పొరేట్ కంపెనీల్లో రూ. 2 కోట్లలోపు పెట్టే పెట్టుబడిపై వర్తించే వడ్డీరేట్లను పరిశీలించవచ్చు. అయితే, సీనియర్ సిటిజన్లు, కరెంట్ అకౌంట్ హోల్డర్ల విషయంలో ఈ వడ్డీరేట్లు అధికంగా ఉండవచ్చు. స్వల్పకాలిక పెట్టుబడి మార్గాలపై ఆసక్తి ఉన్న వారు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి అత్యంత ప్రమాదకర ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళడానికి ఇష్టపడకపోతే కార్పొరేట్ ఎఫ్‌డిలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై పలు ప్రామాణిక ప్రభుత్వ రంగ బ్యాంకుల అందజేసే వడ్డీ రేట్ల కంటే కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ రాబడిని ఇస్తాయి. అయితే, ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ) సంస్థల క్రెడిట్ పనితీరును CRISIL, ICRA, CARE వంటి వివిధ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తాయి. ఆయా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అందించే క్రెడిట్ స్కోరును పరిగణిలోకి తీసుకొని వాటిలో పెట్టుబడి పెట్టండి.
Published by:Nikhil Kumar S
First published: