• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • TOP FIVE FUEL EFFICIENT BS6 SCOOTERS WE HAVE TESTED BA GH

BS 6 scooters: మన రోడ్లపై బెస్ట్ స్కూటర్లు... పెట్రోల్ తక్కువ, మైలేజ్ ఎక్కువ.. అదరగొట్టే ఫీచర్లు

BS 6 scooters: మన రోడ్లపై బెస్ట్ స్కూటర్లు... పెట్రోల్ తక్కువ, మైలేజ్ ఎక్కువ.. అదరగొట్టే ఫీచర్లు

Yamaha Ray ZR 125 (Image: @guru_drive /Twitter)

మనదేశంలో టూ వీలర్ సెగ్మెంట్ కరోనా లాక్ డౌన్ తరువాత విపరీతంగా పుంజుకుంది. ప్రజా రవాణా చతికిలపడటంతోపాటు వ్యక్తిగత వాహనాల్లో ప్రయా?

  • Share this:
మనదేశంలో టూ వీలర్ సెగ్మెంట్ కరోనా లాక్ డౌన్ తరువాత విపరీతంగా పుంజుకుంది. ప్రజా రవాణా చతికిలపడటంతోపాటు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించటం సురక్షితం అన్న ఆలోచనలో ఉన్న వారి సంఖ్య క్రమంగా పెరగటంతో టూ వీలర్ మార్కెట్ కు కొత్త జోష్ వచ్చింది. దీంతో స్కూటర్ సెగ్మెంట్ కు మంచి కళ వచ్చింది. మరోవైపు బీఎస్ 6 నిబంధనల ప్రకారం తయారవుతున్న కొత్త జనరేషన్ ద్విచక్ర వాహనాలు మంచి టెక్నాలజీతో తయారవుతున్నాయి. దీంతో ఇంధనం ఆదా అవ్వటంతోపాటు మైలేజ్ బ్రహ్మాండంగా ఇచ్చే వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. పెట్రోలు ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఇలాంటి వాహనాలకు మంచి డిమాండ్ వచ్చిపడుతోంది. ఇక జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు టూ వీలర్ లోన్ పై వడ్డీ తగ్గించటం, టూ వీలర్ కంపెనీలు కూడా ఆకర్షణీయమైన ఈఎంఐ సదుపాయాలు కల్పిస్తుండటంతో స్కూటర్లకు గిరాకీ పెరుగుతోంది. బీఎస్ 6 శ్రేణిలో కూడా చాలా వెహికల్స్ అందుబాటులోకి రాగా వాటిలో ఏది బెస్ట్ అని కస్టమర్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో జపనీస్ కంపెనీ మోడల్స్ మన మార్కెట్ ను కొల్లగొడుతోందన్న విషయాలు తెలుసుకోవాల్సిందే.

Yamaha Ray ZR 125

ఫ్యూయల్ ఎఫిషియంట్ మోడల్ గా Yamaha Ray ZR 125పై మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. యమహా ZR ఇంజిన్ తో పనిచేసే యమహా రే స్కూటర్ ఏకంగా 66.23KMPL ప్రామిస్ చేస్తుండగా ఇది 125CC ఇంజిన్ కావటం హైలైట్. గతంలో ఇది కేవలం 110సీసీ మాత్రమే. పైగా చాలా లైట్ వెయిట్ ఉన్న బండి కూడా కావటం మరో ఆకట్టుకునే విషయం. కేవలం 99 కేజీల బరువుతూగే ఈ టూ వీలర్ ఈజీ టు రైడ్ మోడల్స్ లో ఒకటిగా ఉంది.

Yamaha Fascino 125

Ray ZR డిజైన్ చాలా బాగుంది. దీని బరువు కూడా 99 కేజీలే. Yamaha Fascino 125 మాత్రం 65.92KMPL ప్రామిస్ చేస్తోంది. కానీ ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో లేవు. ఇవి లేకపోయినా Yamaha Fascino 125పై రైడ్ చాలా బాగుంటుంది.

Yamaha Ray ZR 125 (Image: @guru_drive
/Twitter)


Suzuki Burgman Street

ఎర్గోనామిక్స్ పరంగా చక్కని వెహికల్ గా ఉన్న Suzuki Burgman Street ప్రీమియం మ్యాక్సీ-స్కూటర్ డిజైన్ గా సెగ్మెంట్ లోకి వస్తుంది. 55.88KMPLతో మంచి సత్తా ఉన్న బండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 125సీసీ వాహనాల్లో ఇదో బెస్ట్ ఆప్షన్ గా ఉంది.

Suzuki Burgman Street : (Image: @arun8805/Twitter)


Honda Activa 125

మనదేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న Honda Activa 125కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 125సీసీ ట్రిమ్ ని ఇంట్రడ్యూస్ చేసిన హోండా బీఎస్ 6 వర్షన్ కోసం కొత్త ఇంజిన్ తో వచ్చింది. హోండా యాక్టివా మనదేశంలో తొలి బీఎస్6 స్కూటర్ కాగా 52.63KMPLతో ఇది అదరగొడుతోంది.

Honda Activa 6G finance, Honda Activa 6G, Honda Activa 6G cashback, Honda Activa 6G offers, Honda Activa 6G mileage, Honda Activa 6G features, Honda Activa 6G on road price, హోండా యాక్టీవా 6జీ ఆఫర్స్, హోండా యాక్టీవా 6జీ ధర, హోండా యాక్టీవా 6జీ స్పెసిఫికేషన్స్, హోండా యాక్టీవా 6జీ ఫీచర్స్
Honda Activa 125


Suzuki Access 125

52.45KMPL ప్రామిస్ చేస్తున్న సుజుకి యాక్సెస్ ..ఎల్ఈడీ లైటింగ్, కలర్డ్ సీటింగ్, క్రోమ్ బీజెల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ బీఎస్ 6 నామ్స్ తో అట్రాక్టివ్ గా ఉంది. మిగతా టూ వీలర్స్ తో పోల్చుకుంటే ఇది కూడా మంచి క్యాచీ లుక్, ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు